S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేర్చుకుందాం

10/05/2017 - 18:54

అందెలు గజ్జెలు మ్రోయగ
చిందులు ద్రొక్కుచును వేడ్క చెలువారంగా
నందుని సతి యా గోపిక
ముందర నాడుదువు మిగుల మురియుచు

10/04/2017 - 18:35

అల్ల జగన్నాథుకు శ్రే
పల్లియ క్రీడార్థమయ్యె పరమాత్మునకున్
గొల్లసతి యా యశోదయు
తల్లియునై చన్ను గుడిసె దనరగ కృష్ణా!

10/03/2017 - 18:41

అష్టమి రోహిణి ప్రొద్దున
అష్టమ గర్భమున బుట్టి యా దేవకికిన్
దుష్టుని కంసు వధింపవె
సృష్టి ప్రతిపాలనంబు సేయగ కృష్ణా!

10/01/2017 - 23:18

పదునాలుగు భువనంబులు
కుదరుగ నీ కుక్షి నిలుపుకొను నేర్పరివై
విదితంబుగ నా దేవకి
యుదరములో నెట్టు లొదిగి యుంటివి కృష్ణా!

09/29/2017 - 20:35

ఓ కారుణ్య పయోనిధి
నా కాధారంబ వగుచు నయముగ బ్రోవన్
నాకేల యితర చింతలు
నాకాధిప వినుత! లోకనాయక! కృష్ణా!

భావం; ఓ దయాసముద్రుడా!స్వర్గానికి అధిపతియైన ఇంద్రుని చేత పూజించబడిన వాడా!పదునాలుగు భువనములకు అధిపతి యైనవాడా!నాకు ఆధారమైనవాడా! నన్ను ఎల్లవేళలా నీవు కంటికి రెప్పవలె కాపాడుతుండగా నాకు అన్యచింతనలేల? నాకు ఇతరముల గురించి ఆలోచింపనవసరము లేదు.

శ్రీకృష్ణ శతకములోని పద్యము

09/28/2017 - 17:31

వేదంబులు గన నేరని
ఆది పరబ్రహ్మమూర్తి వనఘ మురారీ
నా దిక్కు చూచి కావుము
నీ దిక్కే నమ్మినాడ నిజముగ కృష్ణా!

భావం: పుణ్యాత్ముడా! మురాసురునికి శత్రువై అతనిని వధించినవాడవు, వేదములకు కూడా అంతుబట్టని వాడివి, జగత్తుకు ఆదియైన పరబ్రహ్మవు, నీవు నాదిక్కు చూచి నన్ను కావుము. నా మీద దయతో నన్ను చూచి సంరక్షింపుము. నాకు నీవే దిక్కు.

శ్రీకృష్ణ శతకములోని పద్యము

09/27/2017 - 16:40

నందుని ముద్దుల పట్టిని
మందర గిరి ధరుని హరిని మాధవు విష్ణున్
సుందర రూపుని మునిగణ
వందితు నినుదలతు భక్తవత్సల కృష్ణా!

భావం: భక్తులయందు అపారమైన వాత్సల్యము గలవాడు, నందుని గారాల తనయుడు, మందరమను పర్వతమును ధరించినవాడు, పాపములను హరించువాడు, లక్ష్మీదేవికి భర్తయైన వాడు. సర్వవ్యాపకుడు, మునుల సమూహం చేత స్తుతించబడు వాడు ఐన కృష్ణుని నేను స్మరిస్తున్నాను.

09/26/2017 - 20:50

అక్రూర వరద! మాధవ
చక్రాయుధ! ఖడ్గపాణి! శౌరి!ముకుందా!
శక్రాది దివిజసన్నుత
శుక్రార్చిత ! నన్ను కరుణ జూడుము కృష్ణా!

09/24/2017 - 21:37

చిలుక నొక రమణి ముద్దుల
చిలుకను శ్రీరామ యనుచు శ్రీపతి పేరం
బిలిచిన మోక్షము నిచ్చితి
వలరగ మిము దలచు జనులకరుదా కృష్ణా!

09/23/2017 - 17:46

హరియను రెండక్షరములు
హరియించును పాతకముల నంబుజనాభా!
హరి నీ నామ మహత్త్వము
హరి హరి పొగడంగ వశమె హరి శ్రీకృష్ణా!

భావం: పద్మము నాభిగా గలిగినా ఓ కృష్ణా! హరి అనే రెండు అక్షరాలే పాపములను హరిస్తాయి. హరి హరి అని రెండు సార్లు నీ నామాన్ని పలికిన వారికి ఇక కొదువ ఏముంటుంది. నీ మాహాత్మ్యాన్ని చెప్పడానికి బ్రహ్మకైనా వశము కాదు.

శ్రీకృష్ణ శతకములోని పద్యము

Pages