S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేర్చుకుందాం

02/05/2019 - 19:52

సీ అడవి పక్షులకెవ్వఁడా హారమిచ్చెను
మృగజాతికెవ్వఁడు మేత పెట్టె?
జలచరాదులకు భోజనమెవ్వఁడి ప్పించె?
చెట్లకెవ్వఁడు నీరు చేది పోసె?
స్ర్తిల గర్భంబులన్ శిశులనెవ్వఁడు బెంచె?
ఫణుల కెవ్వఁడు పోసెఁ బరగవిషము
మధుపాళికెవ్వండు మకరందమొనరించె?
పశుల కెవ్వఁడొసంగెఁ బచ్చిపూరి?
తే జీవకోట్లను బోషింపనీవెకాని
వెఱె యొక దాత లేఁడయ్య వెదకి చూడ!

02/04/2019 - 19:50

సీ ధరణిలోపల నేను తల్లి గర్భమునందుఁ
బుట్టినప్పటినుండి పుణ్యమెరుఁగ
ఏకాదశీ వ్రతంబెన్నడుండఁగ లేదు
తీర్థయాత్రలకైనఁ దిరుగలేదు
పారమార్థికమైన పనులు సేయఁగ లేదు
భిక్షమొక్కనికైనఁ బెట్టలేదు
జ్ఞానవలంతులకైనఁబూని మ్రొక్కఁగలేదు
ఇతర దానములైన నియ్యలేదు
తే నళినదళనేత్ర! నిన్నునే నమ్మినాను
జేరి రక్షింపవే నన్ను శీఘ్రముగను

02/03/2019 - 22:35

సీ తాపసార్చిత! నేను పాపకర్ముఁడనంచు
నాకు వంకలు పెట్టఁబోకు సుమ్మి
నాటికి శిక్షలు నన్నుఁజేయుటకంటె
నేడు సేయము నీవు నేస్తమనక
అతిభయంకరులైన యమదూతలకు నన్ను
నొప్పగింపకుమయ్య యురగశయన!
నీ దాసులను బట్టి నీవు దండింపంగ
వద్దు వద్దెనరెంత పెద్దలైన
తే తండ్రివై నీవు పరపీడఁ దగులఁజేయ
వాసిగల పేరుకపకీర్తి వచ్చునయ్య!

02/01/2019 - 19:27

సీ తాపసార్చిత! నేను పాపకర్ముఁడనంచు
నాకు వంకలు పెట్టఁబోకు సుమ్మి
నాటికి శిక్షలు నన్నుఁజేయుటకంటె
నేడు సేయము నీవు నేస్తమనక
అతిభయంకరులైన యమదూతలకు నన్ను
నొప్పగింపకుమయ్య యురగశయన!
నీ దాసులను బట్టి నీవు దండింపంగ
వద్దు వద్దనరెంత పెద్దలైన
తే తండ్రివై నీవు పరపీడఁ దగులఁజేయ
వాసిగల పేరు కపకీర్తి వచ్చునయ్య!

01/31/2019 - 19:43

సీ ఇలలోననే జన్మమెత్తినప్పటినుండి
పలుగడించితి నయ్య పాతకములు
తెలిసిచేసితిఁ గొన్ని తెలియఁజాలక చేసి
బాధ నొందితినయ్య పద్మనాభ!
అనుభవించెడు నప్పుడుతిప్రయాసంబంచుఁ
బ్రజలు చెప్పఁగఁ జాల భయము గలిగె
ఎగిరిపోవుటకునై ఏయుపాయంబైనఁ
జేసి చూతమటన్నఁ జేత కాదు
తే సూర్యశశినేత్ర! నీచాటుఁ జొచ్చినాడఁ
గలుషములు ద్రుంచి ననే్నలు కష్టమనక

01/30/2019 - 19:01

సీ దేహమున్నవఱకు మోహసాగరమందు
మునుఁగుచుందురు శుద్ధ మూఢజనులు
సలలితైశ్వరముల్ - శాశ్వతంబనుకొని
షడ్భ్రమలను మానఁజాలరెవరు
సర్వకాలము మాయ సంసారబద్ధులై
గురుని కారుణ్యంబు గోరుకొనరు
జ్ఞానభక్తి విరక్తులైన పెద్దలఁజూచి
నిందఁజేయక తాము నిలువలేరు
తే మత్తులైనట్టి దుర్జాతిమనుజులెల్ల
నిన్నుఁగనలేరు మొదటికే నీరజాక్ష!

01/29/2019 - 19:51

సీ నరసింహ! నిన్నునే నమ్మినందుకు చాల
నెనరు నాయందుంచు నెమ్మనమున
నన్ని వస్తువులు నిన్నడిగి వేసట పుట్టె
నిఁకనైన ననుఁ గటాక్షింపవయ్య
సంతసంబున నన్ను స్వర్గమందే యుంచు
భూమియందే యుంచు భోగిశయన!
నయముగా వైకుంఠ నగరమందే యుంచు
నరకమందే యుంచు నళిననాభ!
తే ఎచట నన్నుంచినను గాని యెపుడు నిన్ను
మఱచిపోకుండ నీ నామస్మరణ నొసఁగు

01/28/2019 - 20:07

సీ జందెమింపుగ వేసి సంధ్య వార్చిననేమి
బ్రహ్మమందక కాడు బ్రాహ్మణుండు
తిరుమణి శ్రీ చూర్ణ గురురేఖలిడినను
విష్ణునొందక కాడువైష్ణవుండు
బూదిని నుదుటను బూసికొనిన నేమి
శంభు నొందక కాఁడు శైవజనుఁడు
కాషాయవస్త్రాలు గట్టి కప్పిన నేమి
యాస పోవక కాఁడు యతివరుండు
తే ఇట్టి లౌకిక వేషాలు గొట్టుకొనిన
గురునిఁ జెందక సన్ముక్తి, దొరకఁబోదు

01/27/2019 - 22:33

సీ కాయమెంత భయానఁ గాపాడినను గాని
ధాత్రిలోనది చూడఁదక్కఁబోదు
నీ వేళ నే రోగ మేమరించునొ సత్త్వ
మొందంగఁజేయ నేచందమునను
ఔషధంబులు మంచి ననుభవించినఁగాని
కర్మక్షీణంబైనఁ గాకవిడదు.
కోటివైద్యులు గుంపుగూడి వచ్చినఁగాని
మరణమయ్యెడి వ్యాధి మాన్పలేరు.
*
తే జీవుని ప్రయాణకాలంబు సిద్ధమైన
నిలుచునా దేహమిందొక్క నిముషమైన

01/25/2019 - 18:39

సీ ఆయురారోగ్యపు త్రార్థ సంపదలన్ని
గలుగఁజేసెడి కార్యకర్తవీవె
చదువులెస్సగ నేర్పి సభలో గరిష్ఠ్ధా
కార మొందించెడి ఘనుఁడవీవె
నడక మంచిది పెట్టి నరులు మెచ్చెడునట్టి
పేరు రప్పించెడి పెద్దవీవె
బలుపైన వైరాగ్య భక్తిజ్ఞానములబ్బి
ముక్తిఁ బొందించెడి మూర్తివీవె
తే అవనిలో మానవులకెల్ల నాసలిచ్చి
వ్యర్థులను జేసి తెలిపెడి వాఁడవీవె

Pages