S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేర్చుకుందాం

06/18/2017 - 21:31

ముదమున కాటపట్టు భవమోహ మదద్విరదాంకుశంబు సం
పదల కొటారు, కోరికల పంట, పరంబునకాది, వైరుల
న్నదన జయించు త్రోవ, విపదబ్ధికి నావ గదా సదా భవ
త్సదమల నామ సంస్మరణ దాశరథీ కరుణా పయోనిధీ

06/17/2017 - 21:24

మనమున నూహపోహణలు మర్వకమునె్న, కఫాదిరోగముల్
దనువునంటి మేని బిగి దప్పకమునె్న నరుండు మోక్ష సా
ధనమొనరింపగా వలయు దత్త్వవిచారము మానియుండుటల్
తనువునకున్ విరోధమది దాశరథీ కరుణా పయోనిధీ

06/18/2017 - 21:32

సంకర దుర్గమై దురిత సంకులయైన జగము జూచి స
ర్వంకషలీల నుత్తమ తురంగము నెక్కి- కరాసి బూని నీ
రాంక విలాస మొప్ప గలికాకృతి సజ్జన కోటికిన్ నిరా
తంకమొనర్చె తీవె కద! దాశరథీ కరుణా పయోనిధీ!

06/16/2017 - 01:56

అనుపమ యాదవాన్వయ సుధాబ్ధి సుధానిధి కృష్ణమూర్తి నీ
కనుజుడుగా జనించి కుజనావళి నెల్ల నడంచి రోహిణీ
తనయుడనంగ బహుబల దర్పమునన్ బలరామమూర్తివై
తనరిన వేల్పనీవెగద, దాశరథీ కరుణాపయోనిధీ!

06/16/2017 - 01:56

సురలు నుతింపగా త్రిపుర సుందరులన్ వరియింప బుద్ధ రూ
పరయగ దాల్చితీవు త్రిపురాసుర కోటి హరించునపుడా
హరునకు దోడుగా వరశరాసన బాణముఖోగ్ర సాధనో
త్కరమొనరించి తీవె కద, దాశరథీ కరుణాపయోనిధీ

06/16/2017 - 01:57

ఇరువది యొక్క మారు ధరణీశులనెల్ల వధించి తత్కళే
బర రుధిర ప్రవాహమున బైతృక తర్పణమొప్పజేసి భూ
సురవర కోటికిన్ ముదము సొప్పడ భార్గవ రామమూర్తివై
ధరణి నొసంగితీవె కద, దాశరథీ కరుణాపయోనిధీ!

06/11/2017 - 22:39

పదయుగళంబు భూగగన భాగములన్ వెసనూని విక్రయా
స్పదుడగు నబ్బలీంద్రునొక పాదమునందల క్రింద నొత్తియే
లొదవ జగత్త్రయంబు బురుహూతున కియ్య వటుండవైన చి
త్సదమల మూర్తి నీవె కదా, దాశరథీ, కరుణాపయోనిధీ

06/10/2017 - 22:40

పెటపెట నుక్కు కంబమున భీకర దంత నఖాంకుర ప్రభా
పటలముగప్ప నుప్పతిలి భండన వీధి నృసింహ భీకర
స్ఫుట పటుశక్తి హేమకశిపున్ విదళించి సురారి పట్టి ను
త్కటకృప జూచి తీవెగదా,, దాశరధీ కరుణా పయోనిధీ

06/09/2017 - 21:14

ధారుణి జాప జుట్టిన విధంబున గైకొని ఏమ నేత్రుడ
వ్వారిధిలోన డాగినను, వాని వధించి వరాహమూర్తిలై
ధారుణి దొంటికైవడిని దక్షిణ శృంగమును ధరించి, ని
స్తారమొనర్చి తీవెగద దారథీ కరుణా పయోనిధీ

06/08/2017 - 22:48

కరమను రక్తి మందము కవ్వముగా, నహిరాజు త్రాడుగా
దొరకొని దేవదానవులు దుగ్ధ పయోధి మధించుచున్నచో
ధరణి చలింప లోకములు తల్లడమందగ, గూర్మమై ధరా
ధరము ధరించితీవె కద, దాశరధీ కరుణాపయోనిధీ

Pages