S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
నేర్చుకుందాం
రాజ్యంబు గలిగెనేనియు
బూజ్యులకు యాచకులకు భూమిసురులకున్
భాజ్యముగ బ్రతుకడేనియు
ద్యాజ్యంబులు వాని జన్మ ధనగేహంబుల్
భావము: బలి చక్రవర్తితో వామనుడు ‘‘మహారాజా! ఇంక్కొక్క సంగతి, రాజ్యాధికారం కలిగినపుడు గౌరవింపదగినవారికీ, తిరిపెమెత్తేవారికి, బ్రాహ్మణులకూ ధనాన్ని పంచిపెట్టి బ్రతకాలి. అట్లా చేయనివారి బ్రతుకు, ధనము, మేడలు నిరర్థకాలు. అవి పరిత్యజింపదగినవి’’ అని హితవు పలికాడు.
ఏలితివి మూడు జగములు
దోలితి వింద్రాది సురుల దొల్లిటి వారిం
బోలితివి దాన గుణముల
సోలితివి పిశాచ రాక్షసుల రక్షించన్
భిక్షాపాత్రిక నిచ్చెను
యక్షేశుడు వామనునకు, నక్షయ మనుచున్
సాక్షాత్కరించి పెట్టెను
భిక్షునకు భవాని పూర్ణ భిక్ష నరేంద్రా!
శుద్ధ బ్రహ్మర్షి సమా
రాద్ధుండై విహిత మంత్రరాజి చదువుచుం
ప్రోద్ధంబగు ననలంలంబున
వృద్ధాచారమున వటుడు వేల్చెం గడకన్
భావము:పరమ పవిత్రులైన బ్రహ్మఋషులు వామనుని ఆదరంగా ఆశీర్వదించారు. అటుపిమ్మట ఆ బ్రహ్మచారి సంప్రదాయం ప్రకారంగా వేద మంత్రాలను చదువుతూ, వెలిగే అగ్నిహోత్రంతో, ఉత్సాహంతో హోమం చేసేవాడు.
దిక్కుల కావిరి వాసెను
నెక్కువ నిర్మలత నొందె నేడు పయోధుల్
నిక్కమెయి నిలిచె ధరణియు
జుక్కల త్రోవయును విప్రసుర సేవ్యములై
భావము: వామనుని ఆవిర్భావంతో ప్రకృతి కూడా పులకించిపోయింది. దిక్కులలోని కావిరంగు కరిగిపోయింది. సప్త సముద్రములన్నీ నిర్మలములుగా మారిపోయినాయి. భూమి పొంగి పులకించింది. బ్రాహ్మణులతో, దేవతలతో అలరారింది.
చింతం బాసిరి యక్ష తార్ఖ్య సుమనస్సిద్ధోరగా దీశ్వరుల్
సంతోషించిరి సాధ్యచారణ మునీశ బ్రహ్మ విద్యాధరుల్
గాంతిం చెందిరి భాను చంద్రములు, రంగద్గీత వాద్యంబులన్
గంతుల్ వైచిరి మింటకింపురుషులున్ గంధర్వలున్ కిన్నరుల్
రవి మధ్యాహ్నమునం జరింప గ్రహతారా చంద్ర భద్రస్థితిన్
శ్రవణ ద్వాదశి నాడు శ్రోణ నభిజిత్సం జ్ఞాతలగ్నంబునన్
భువనాధీశుడు పుట్టె వామనగతిం పుణ్యవ్రతోపేతకున్
దివిజాధీశ్వరు మాతకుం బరమ పాతివ్రత్య విఖ్యాతకున్
సగుణ నిర్గుణ కార్యముల్ సలుపు సుమతి
సేత పరిణతి గడు ప్రతీక్షింపదగును
బరుష కర్మ విపాకంబు ఫలముదనుక
హృదయము దహించు శల్యంబు రీతి జగతి
భావము: పండితుడైనవాడు ఒక పనిని మంచిదో, చెడ్డదో చేయదలచుకున్నప్పుడు ఆ పని పర్యవసానాన్ని బాగా ఆలోచించవలసి వుంటుంది. తొందరపడి ఏదైనా చెడు పనిని చేస్తే దాని ఫలితం బాణం మాదిరిగా హదృయాన్ని మరణ పర్యంతమూ దహించివేస్తూనే ఉంటుంది.
లలితనికేతన ప్రియ విలాసవతీ ధవళాత పత్రస
ద్ద్విలసిత వైభవంబనుభవింపబడున్ సుకృతాను వృత్తిచే
జెలువగు పుణ్యకర్మము నశించిన నంగజ సంగరత్రుట
త్కలిత గుణోరు వౌక్తిక నికాయములట్లు దొలంగు సంపదల్
ఖలునిన్ సజ్జనుగాగ, మూర్ఖజను సంఖ్యావంతునింగాగ, దా
యల సన్మిత్రులగా, నగోచరము ప్రత్యక్షంబుగా, బ్రాణ హృ
త్కలనంబైన మహావిషం బమృతముంగా జేయు సత్కర్మము
జ్జ్వల నిష్ఠానిధివై భజింపుము వయస్యా వాంఛితార్థాప్తికిన్