S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేర్చుకుందాం

08/26/2016 - 21:44

భారతదేశంలో పూర్వం మత అలజడులు వస్తే భారతీయ ఆధ్యాత్మిక సంపదను పరిరక్షించి పునఃప్రతిష్ఠం చేసిన మహిమాన్వితులు, భగవదాంశ సంభూతుడు, భారతీయ సమైక్యతా మూర్తి ఆదిశంకరులు. హిందూ మతంలో సమైక్యతను సాధించటానికి ముమ్మారులు భారతదేశం నలుదిశలా పాదయాత్ర చేసి, తన అమోఘ పాండీత ప్రకర్షతో శైవ, విష్ణు అభేద తత్వాన్ని ప్రబోధించి అద్వైత తత్వాన్ని పండితులకు పూర్ణావహగాహన చేసిన కారణజన్ముడు శ్రీ శంకరాచార్యులు.

08/26/2016 - 21:20

మ. తన కాజ్ఞావశవర్తులై మహి సమస్తకత్త్రవం శేశు లె
ల్లను భక్తిం బనిసేయుచుండఁగ విశాలం బైన సత్కీర్తి ది
గ్వనితా వౌక్తిక దామ లీల వెలుఁగన్ వారాశిపర్యంత భూ
జన రక్షాపరుఁడయ్యె శంతనుఁడు రాజద్రాజ ధర్మస్థితిన్

08/25/2016 - 21:20

ఆ. ‘మనుజయోనిఁ బుట్టుఁ’డని వారి కప్పుడు
కోప మడర మునియు శాపమిచ్చె
భయము వొంది వివశులయి వచ్చి వారును
వినయ మొనర నిట్టు లనిరి మునికి

08/24/2016 - 23:32

ఆ. దీని పాలు ద్రావి మానవుల్ పదియువే
లేండ్లు జరయు రుజయు నెఱుఁగ కమర
భావమున సుఖంబు జీవింతు రటె!;దీని
నేలఁ గనిన వాఁడ యెందుఁ బెద్ద

08/23/2016 - 21:26

చ. అతులతవంబునన్ వరుణు ఁ డన్మునిచే బహుపుణ్యకర్మసు
స్థితి బ్రభవింపగాఁబడిన దివ్య మునీందుఁ డశేష లోక పూ
జితుఁడు వసిష్ఠు డాశ్రమము ఁ జేసి తపం బొనరించి బ్రహ్మస
మ్మితుఁ డురురత్నరాజిత సుమేరు మహీధర కందరంబునన్

08/21/2016 - 21:27

క. వసువు లనువా రపేత
వ్యసనులు , దేవతలు, లోకవంద్యులు : వారిన్
వసుమతిఁ బుట్టఁగ శాపము
వసిష్ఠముని యేల యిచ్చెవారిజ నేత్రా!

08/20/2016 - 21:22

క. పడయంగ రాని కొడుకుల ఁ
గడుఁబలవువురఁ బడసి పుత్త్రఘాతినివై తీ
కొడుకు నుదయార్క తేజుని
విడువఁగ నే నోప ననుచు వేడుకతోడన్

08/19/2016 - 22:27

చ. కని ‘వనకన్యయో దనుజకన్యకయో భుజగేంద్ర కన్యయో
యనిమిషకన్యయో యిదివియచ్చరకన్యకయో యపూర్వ మీ
వనమున కిట్టు లేకతమ వచ్చునె మానవకన్య యంచు న
య్యనఘుఁడు దానిఁ జిత్తమున నాదట వోవక చూచెఁబ్రీతితోన్

08/18/2016 - 21:13

తరళాయతలోచన
త్యురుకుచఁ దేజోభిరామ మత్తమదివ్యాం
బరమాల్య మణిమయాలం
కరణోజ్జ్వలవేష నొక్కకన్యకఁ గనియెన్

08/17/2016 - 23:06

మధ్యాక్కర
తనుమధ్య దానొక్కకన్య సురనదీతటమున నన్నుఁ
గనిన నక్కన్యకఁ జూచి ‘నీ విట్టి కమనీయ రూప
వొనర నా సుతునకు భార్యవగు మన్న నొడఁబడి యియ్య
కొనియెఁ గావున దానిఁ దగ వివాహ మగుము నెయ్యమునను’

Pages