S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేర్చుకుందాం

07/12/2016 - 21:17

క. విను గార్హపత్యమను న
య్యనలము బహరింపఁబడి తలాహవనీయం
బున వెలుఁగునట్ల వెలుఁగును
జనకుఁడు దాఁ బుత్రు డై నిజద్యుతి తోడన్

07/10/2016 - 21:20

సీ. ధర్మార్థ కామ సాధన కుపకరణంబు గృహనీతివిద్యకు గృహము విమల
చారిత్ర శిక్ష కాచార్యకం బన్వయ స్థితికి మూలంబు పద్ధతికి మాఁత
గౌరవంబున కేకకాణం బున్నత స్థిర గుణ మణుల కాకరము హృదయ
సంతోషమునను సంజనకంబు భార్యయ చూవె భర్తకు నొండ్లు గావు ప్రియము
ఆ. లెట్టి ఘట్టములను నెట్టి యాపదలను
నెట్టి తీరములను ముట్టబడిన
వంతలెల్లఁ బాయు నింతులఁ బ్రజలను

07/09/2016 - 22:38

క. సంతత గృహమేధి ఫలం
బంతయుంగ నోపు సమగుణ భార్యా
నంతుండగువాఁడు క్రియా
వంతుఁడు దాంతుండుఁ బుత్రవంతుండు నగున్

07/08/2016 - 21:09

క. నా యెఱిఁగినట్ల యిన్నియు
నీ యిచ్చిన వరము ధారుణీ వర యెఱుఁగున్
నాయందు ఁ దొంటి యట్టుల
చేయు మను గ్రహ మవజ్ఞ సేయం దగునే!
భావం: ఓ రాజా! నీ విచ్చిన వరాన్ని గురించి నా కెట్లా తెలియునో ఆ విధంగానే వేదాలు మొదలైన మహాపదార్థాలకు కూడా తెలియును. కాబట్టి నా పట్ల వెనుకటి వలెనే అనురాగాన్ని ప్రసాదించుము. నన్ను అవమానించటంతగునా? తగదని శకుంతల చెప్తోంది.

07/07/2016 - 21:17

చ. విమలయశోనిధి! పురుషవృత్త మెఱుంగుచునుండు ఁ జూవె వే
దములును బంచభూతములు ధర్మువు సంధ్యలు నంతరాత్మయున్
యముఁడును జంద్రసూర్యులు సహంబును రాత్రియు న న్మహాపదా
ర్థము లివి యుండగా నరుఁడు దక్కొన నేర్చునె తన్ను మ్రుచ్చిలన్

07/07/2016 - 04:45

క ఏ నెఱుఁక నిన్ను నెక్కడి
దానవు? మిన్నకయ యను చితంబులు పలుకం
గానేల యరుగు మంబురు హాసన
యెందుండి వచ్చి తందులకు వడిన్
భావం: పద్మముఖీ! నిన్ను నేను ఎరుగను. నీ వసలు ఎవరవుః ఊరకే ఒప్పని మాటలు మాటలాడుతావెందుకు? ఎక్కడ నండి వచ్చావో అక్కడికి తిరిగి వెళ్లుము.
ఆ. ఏల యెఱుక లేని యితరుల యట్ల నీ
నెఱుఁగ ననుచుఁ బలికె దెఱిఁగి యెఱిఁగి

07/05/2016 - 21:35

క. జననాథ! వేఁట నెపమున
గొనకొని కణ్వాశ్రమమునకున్ వచ్చి ముదం
బున నందు నాకు నీయి
చ్చిన వరము దలంపవలయుఁ జిత్తములోనన్
భావం: ఓ రాజా! వేట అనే మిషతో కావాలని సప్రయత్నంగా కణ్వమహాముని ఆశ్రమానికి వచ్చి అక్కడ నీవు సంతోషంగా నాకు ఇచ్చిన వరాన్ని మనసులో జ్ఞాపకం చేసికొమ్ము.
క. బాలార్క తేజుఁ డగు నీ
బాలుఁడు నీకొడుకు వీనిఁ బౌరవకుల ర
త్నాలంకారు నుదార గు

07/03/2016 - 21:22

చ. తలఁపగ నాఁడు పల్కిన విధం బెటఁ దప్పఁగ వీడె నొక్కొ చూ
డ్కులు విరసంబులై కరము క్రూరము లైన నిమిత్త మేమియో?
కలయఁగఁ బల్కరించి రుపకారులు నైరని నమ్మి యుండఁగా
వలవదు బుద్ధిమంతులు నవప్రియులైన ధరాధినాథులన్

07/03/2016 - 00:59

క. మఱచినఁ దలఁ పెండఁగ నగు
నెఱుఁగని నాఁ డెల్లపాట నెఱిఁగింప నగున్
మఱి యెఱిఁగి యెఱుఁగ నొల్లని
కఱటిం దెలుపంగ ఁ గమల గర్భుని వశమే

07/01/2016 - 21:31

క. ఎఱుఁగ డొకొ నన్ను నెఱిఁగియు
నెఱుఁగని యట్లుండునొక్కొ యెడ దవ్వగుడున్
మఱచెనొకొ ముగ్ధు లధిపులు
మఱువరె బహుకార్యభారమగ్నులు కారే

Pages