S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేర్చుకుందాం

03/04/2016 - 23:49

ఆ. మొదలి పెక్కు జన్మములఁ బుణ్య కర్మముల్
పరఁగఁ బెక్కు సేసె వడయఁబడిన
యట్టి యెఱుక జనుల కాక్షణ మాతన
చెఱుచు మద్యసేవ సేయ నగునె?

03/04/2016 - 05:36

క. వగవక సంజీవని పెం
పగథిలో గర్వమున నసురు లా కచుతోడం
బగఁగాని చంపెద రాతఁడు
సుగతికిఁ జనుఁగాక యేల శోకింపంగన్
భావం: సంజీవని విద్య గొప్పతనాన్ని ఆలోచించక రాక్షసులు అధికగర్వంతో ఆ కచుడితో వైరం పూని అతడిని చంపుతారు. అతడు ఉత్తమ గతికి వెళ్లుగాక. దీనికి దుఃఖించట మెందుకు?

03/03/2016 - 06:46

క. అడవికిఁ బువ్వులు దేరఁగ
వడి నరిగిన కచుని ఁ జంపి వారక దనుజుల్
పొడవు సెడఁగాల్చి సురతోఁ
దడయక యబ్బూది శుక్రుఁద్రావించి రొగిన్

03/02/2016 - 04:11

ఉ. వాఁడి మయూఖముల్ గలుగు వాఁ దపరాంబుధిఁ గ్రుంకె ధేనువుల్
నేఁ డిట వచ్చె నేకతను, నిష్టమెయిన్ భవదగ్ని హోత్రముల్
పోఁడిగ వేల్వఁగాఁ బడియెఁ బ్రొద్దును బోయెఁ గచుండు నేనియున్
రాఁడు నవంబులోని మృగరాక్షసపన్నగ బాధ నొందెనో!

02/28/2016 - 19:20

నేర్చుకుందాం

02/28/2016 - 04:22

క. ఏను గచుండనువాఁడ మ
హానియమ సమన్వితుఁడ బృహస్పతి సుతుఁడన్
మానుగ వచ్చితి నీకును
భానునిభా! శిష్యవృత్తిఁ బని సేయంగన్

02/26/2016 - 20:17

క. కావున మృత సంజీవని
దేవలయును శుక్రుశలన ధృతి ఁ బదసి తన
శ్రీ్మవిభవ దాని బలమునఁ
గావంగావలయు సురనికాయబలంబున్

02/26/2016 - 07:57

క. పోరను మృతసంజీవని
కారణమున నిహతులయ్యుఁగా ననురవరుల్
వారల నోర్వఁగ మన కతి
భారము దుర్వార వీర్యబలయుతు లగుటన్

02/25/2016 - 20:43

క. మనుజాధిప! వృషపర్వుం
డను దావనపతికి శుక్రుఁడాచార్యుండై
యనిమిషవిరోధులకు ఁ బ్రియ
మొనరించుచు వివిధ విధినయోపాయములన్

02/24/2016 - 08:20

తే. వర్ణ్ధర్మముల్ గాచుచచు వసుధ యెట్ల
ననఘచరితుఁడై యేలిన యయ్యయాతి
భూసురోత్తమ భార్గవపుత్రి యైన
దేవయానిని రాదా నెట్లు దేవి ఁజేసి?
భావం: వర్ణాశ్రమ ధర్మాలను సంరక్షిస్తూ పుణ్యవర్తనుడైన భూమండలాన్ని ఏలిన ఆ యాయాతి ఏలిన ఆ యయాతి మహారాజు బ్రాహ్మణోత్తముడైన శుక్రుడి కూతురును దేవయానిని భార్యగా చేసికొన్నాడో ఓ వైశంపాయన మహర్షీ! తెలుపవలసింది.

Pages