S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

09/24/2018 - 17:37

న్యూఢిల్లీ: రాఫెల్ స్కామ్‌కు సంబంధించి డాక్యుమెంట్లు, ఫైల్స్ సీజ్ చేయాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ అన్నారు. రాఫెల్ స్కామ్‌పై కాంగ్రెస్ ప్రతినిధులు సీవీసీకి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆనంద్‌శర్మ విలేకరులతో మాట్లాడుతూ తాము అందజేసిన వివరాలను పరిగణనలోకి తీసుకుని ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరినట్లు వెల్లడించారు.

09/24/2018 - 17:37

న్యూఢిల్లీ: రాఫెల్ కుంభకోణంలో వాస్తవాలు వెలుగుచూస్తుండటంతో మోదీ సర్కార్ దిక్కుతోచని స్థితిలో పడిందని కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాలా అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రాఫెల్ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు మోదీ పాక్ అంశాన్ని ముందుకు తీసుకువస్తుందని అన్నారు. పాక్ ప్రజలు మన సైనికులను చంపుతుంటే మీరు చీర-శాలువా దౌత్యం నడిపారని విమర్శించారు.

09/24/2018 - 17:34

న్యూఢిల్లీ: హిందూ మహా సముద్రంలో చిక్కుకుపోయిన నావీ అధికారి అభిలాష్ టోమీని నావికా సిబ్బంది రక్షించారు. దాదాపు కదలలేని స్థితిలో ఉన్న ఆయనను రక్షించి ప్రాధమిక చికిత్స అందిస్తున్నారు. టోమీ ప్రస్తుతం కోలుకుంటున్నాడని తండ్రి తెలియజేశారు. గోల్డెన్ గ్లోబ్ రేస్‌లో భాగంగా ఎస్.వి ధురియా దేశీయ నౌకలో బయలుదేరిన ఆయన 1900 మైళ్ల దూరంలో ఆయన పడవ ప్రమాదానికి గురైంది.

09/24/2018 - 13:08

శ్రీనగర్‌ : జమ్మూ-కాశ్మీర్‌లోని కతువా జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీగా వరద నీరు చేరుకోవడంతో నదులన్నీ పొంగిపొర్లుతున్నాయి. దీంతో లోతట్లు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వరద నీటిలో చిక్కుకున్న 29 మందిని రక్షించినట్లు సోమవారం పోలీసు అధికారులు తెలిపారు.

09/24/2018 - 13:07

గ్యాంగ్‌టక్‌: సిక్కింలోని తొలి, ఏకైక విమానాశ్రయాన్ని ఆరంభించడానికి వెళ్లిన ప్రధాని మోదీ అక్కడున్న ప్రకృతి అందాలను చూసి తనను తాను మైమరిచిపోయారు. సిక్కింకు వెళుతున్న దారిలో పర్వత శ్రేణుల్లోని ప్రకృతి అందాలను మెచ్చి ఫోటోలు తీసి ట్వీట్టర్‌లో పోస్టు చేశారు. మోదీ ఈ రాష్ట్రాన్ని ప్రశాంతమైన, అద్భుతమైనదిగా పిలుస్తూ ఫోటోలను ఇన్‌క్రెడిబుల్‌ ఇండియా హ్యాష్‌ టాగ్‌తో జత చేసి పోస్ట్‌ చేశారు.

09/24/2018 - 13:07

పనాజీ : గోవాలో మనోహర్‌ పారికర్‌ క్యాబినేట్‌ నుండి ఇద్దరు మంత్రులను తొలగించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం (సిఎంఒ) సోమవారం వెల్లడించింది. బిజెపి నేతలు ప్రాన్సిస్‌ డిసౌజా, పాండురంగ్‌ మదకైకర్‌లు గత కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది.

09/24/2018 - 13:06

కోల్‌కతా : పశ్చిమబెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలోని కక్డ్విప్‌ ప్రాంతంలోని నిర్మాణంలో ఉన్న వంతెన సోమవారం కూలిపోయింది. ఈ సంఘటనపై దర్యాప్తు జరిపేందుకు ఒక బృందాన్ని సంఘటనాస్థలానికి తరలించామని అధికారులు తెలిపారు.

09/24/2018 - 12:42

జమ్మూకాశ్మీర్: జమ్మూకాశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదులను సైనికులు కాల్చిచంపారు. కుప్పారా జిల్లాలోని తంగ్దార్ సెక్టార్ వద్ద ఉగ్రవాదులు చొరబాటుకు ప్రయత్నించగా సైనికులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదలు హతమయ్యారు. ఉగ్రవాదులు అక్కడ తలదాచుకున్నట్లు సమాచారం అందటంతో సైనికులు గస్తీని ముమ్మరం చేశారు.

09/24/2018 - 12:40

న్యూఢిల్లీ: తొమ్మిదేళ్ల నిరీక్షణ అనంతరం సిక్కింలో తొలి విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారంనాడు ప్రారంభించారు. సిక్కింలో ఏకైక విమానాశ్రయం అయిన పాక్యాంగ్ ఎయిర్‌పోర్టుకు ఈ రోజు ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. సముద్రమట్టానికి 4500 అడుగులు ఎత్తులో 201 ఎకరాల విస్తీర్ణంలో దీనిని నిర్మించారు.

09/24/2018 - 04:32

న్యూఢిల్లీ: తమ పార్టీ వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో అక్రమంగా చొరబడిన శరణార్థులను గుర్తించి తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ప్రకటించారు. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీపార్టీలు మాత్రం ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయని, చొరబాటుదారుల కొమ్ముకాసేవిధంగా వ్యవహరిస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు.

Pages