S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

09/17/2017 - 21:06

మానవ జన్మ పొందిన ప్రతి జీవికి ఋణత్రయ బంధం ముడిపడి వుంటుంది. భగవంతుడు మనకు ప్రసాదించిన బుద్ధి జ్ఞానాల ద్వారా మనం ఋణ త్రయ విముక్తి పొందటానికి చేయవలసిన కర్మను పూర్వులు నిర్దేశించారు. ఋణ త్రయాలు -1.ఋషి ఋణము, 2. దేవ ఋణము, 3. పితృ ఋణము.

09/10/2017 - 22:29

నమోస్తు వేద వ్యాస నిర్మిత ప్రతిష్ఠతాయై
నమోస్తు మహలక్ష్మీ, మహాకాళి సమేతాయై
నమోస్తు అష్ట తీర్థ జల మహోమాన్వితాయై
నమోస్తు బాసర క్షేత్ర విలసితాయై

09/03/2017 - 22:38

భగవంతునికి ఆకారం లేదు. పేరు లేదు. కాని భక్తుడు ఏవిధంగా కోరుకుంటాడో ఆవిధంగానే తన్ను తాను సృజియంచుకోగల శక్తిసంపన్నుడు ఆ భగవంతుడు. సత్యధర్మాలకు ఆ భగవం తుడు వెన్నుదన్నుగా ఉంటాడు. ఎపుడైతే తాను సృష్టించిన లోకంలో అధర్మం పెచ్చుమీరుతుందో అన్యాయం ప్రబల రూపం పొందుతుందో అపుడే తన్ను తాను రూపున్న వానిగా రూపుదిద్దుకుని నామరూపాలతో అందరికీ అగుపడు తాడు. దుష్టులను దునుమాడుతాడు.

08/27/2017 - 22:45

భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో వినాయకునికి ఒక ప్రత్యేకమైన స్థానం వుంది. తలపెట్టిన కార్యాలన్నీ ఎలాంటి అడ్డంకులు లేకుండా నిర్విఘ్నంగా ముగించడం కోసం మొదటగా వినాయకుడ్ని పూజించడం అనాదిగా వస్తున్న ఆచారం. ప్రతి శుభ కార్యానికి ముందు పూజలు అందుకుంటున్నా, ప్రత్యేకంగా భాద్రపద శుద్ధ చవితి రోజున వినాయక చవితిగా స్వామిని ఇంటింటా, వాడవాడలా ఘనంగా పూజించుకుంటున్నాం.

08/20/2017 - 23:32

న లుగుపిండితో బొమ్మచేసి ప్రాణం పోసుకొని పార్వతీ నందనుడిగా కనులు తెరిచిన వినాయకుడు ముక్కంటినే ఎదరించి తండ్రి అనురాగాన్ని సంపాదించాడు. తల్లిదండ్రుల అనురాగం సంపా దించి వారిని అలరించి వారిచేత దీవనలు పొందిన ఈ గణపతి విఘ్నాలకు అధిపతిగా ఈశ్వరుని చేత నియమించబడ్డాడు. విఘ్నహరునిగా లోక ప్రసిద్ధుడయ్యాడు.

08/20/2017 - 23:17

ఓం కారమే గణపతిగా ఆవిర్భవించిందంటారు. గణపతిని ప్రథమారాధ్యునిగా గౌరవిస్తారు. ప్రణవ తేజస్వునిగా, విశ్వరూపదైవంగా వేదం గణపతిని స్తుతించమని చెబుతుంది. సర్వసృష్టికి ఆధారం గణేశుడని ఋగ్వేదం చెబుతుంది.

08/13/2017 - 21:43

త్వష్టప్రజాపతి కుమారుడు యజ్ఞప్రసాదంగా లభించిన వృత్రాసురుడు ఆకాశమంత నోటితో మహా భయంకరంగా ఇంద్రుణ్ణి అమాంతంగా మింగివేస్తాడా అన్నట్టు ఉరిమి చూశాడు. ఆ చూపుకే చిమ్మచీకట్లు ప్రపంచం అంతా వ్యాపించాయా అన్నట్టుగాకదనరంగం మసకబారింది. మా అన్న విశ్వరూపుణ్ణి దుర్బుద్ధితో నిర్జించిన ఓ ఇంద్రా! ఓ జంభారి ఇంకా ఎందుకు సందేహిస్తున్నావు. నా సంగతి నీకు తెలియదు కదా.

08/06/2017 - 21:02

విశాఖపట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో సింహగిరిపై 800 అడుగుల ఎత్తున పుష్ప, ఫలవృక్ష శీతలచ్ఛాయల్లో, ప్రశాంత వాతావరణంలో అరుదైన శిల్ప కళానైపుణ్యంతో అలరారే ఆస్థాన, భోగ, నవరత్న మండప, ప్రహ్లాద మండపాల్లో కొలువై సుగంధ పరిమళ భరిత చందనాచ్ఛ్ధాతుడై, లక్ష్మీ సమేతుడై వెలసిన స్వామియే శ్రీ వరహా లక్ష్మీ నృసింహస్వామి.

07/30/2017 - 22:27

హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజత స్రజామ్
చంద్రాం హిరణ్మరుూమ్ లక్ష్మీం జాతవేదో మమావహ
శుద్ధలక్ష్మీ మోక్ష లక్ష్మీ జయలక్ష్మీ సరస్వతీ
శ్రీలక్ష్మీ వరలక్ష్మీచ ప్రసన్న మమ సర్వదా

07/23/2017 - 21:45

పిల్లల ప్రవర్తన పెద్దలను బట్టి ఉంటుంది. మొక్కై వంగనిది మానై వంగుతుందా అన్నట్టు మంచి బుద్ధులన్నీ చిన్నపుడే నేర్పించాలి అంటారు. ఇది అన్నివేళలో నిజమే అయనా అన్ని వేళలా నిజం కాకపోవచ్చు.ప్రహ్లాదుడు తన తల్లి కడుపులో ఉన్నపుడే నారదాశ్రమంలో నారాయణ మంత్రం నేర్చుకున్నాడు. తల్లి కడుపులోనుంచే విష్ణుకథలను విన్నాడు. వాటిపైన మక్కువ ఏర్పరుచుకున్నాడు.

Pages