S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పర్యాటకం

01/15/2017 - 21:43

ఆద్యంతాలకు కారణభూతురాలు, సర్వసృష్టి నియంత, తన కనుసన్నల్లోనే ముల్లోకాలను ఆజమాయిషీ చేస్తూ చల్లగా చూచే తల్లిగా కీర్తింపబడే ఆదిపరాశక్తినే అనేక రూపాలతో, అనేక నామాలతో తన్ను తాను సృజించుకొంది.

01/01/2017 - 21:49

విష్ణుచిత్తుని భాగ్యాన్ని విల్లివిరియచేసిన విల్లిపుత్తూరు తమిళనాడు మధురై జిల్లా రామనాధపురం తాలూకాలో ఉంది. ధనుర్మాసం ఎపుడు వస్తుందా అని, తన చెలులతో కలసి తాను కూడా ఆ కాత్యాయని వ్రతం చేసుకొందామని ఎదురుచూసిందా తల్లి ఆనాడు. ఆ మాసం రానేవచ్చింది. అసలు చిన్ననాటినుంచి రంగని కొలువున ఉన్న తండ్రి పొందే ఆనందాన్ని తాను చవిచూడాలనుకొంది.

12/25/2016 - 22:35

శ్రీ దత్తాత్రేయుల వారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపం. వారి అవతారాల్లో ప్రథమావతారమే శ్రీపాద శ్రీవల్లభులు. అంతటి విశిష్టమైన ఈ ప్రథమావతారానికి మన తెలుగునేల శ్రీ పీఠికారపుర క్షేత్రం (నేటి పిఠాపురం) జన్మస్థలం కావడం అత్యంత అద్భుతం. 1320లో (14వ శతాబ్దం) శ్రీపాద శ్రీవల్లభుడు అవతరించారు.

12/25/2016 - 22:38

బెంగుళూరుకు చెందిన శ్రీ దేవదాయ కులకర్ణి దత్తాత్రేయ ఉపాసకులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనలో భాగంగా ఆయన పిఠాపురం పట్టణానికి విచ్చేసి గురు చరిత్రలో పేర్కొన్న శ్రీపాదుల వారి ఆలయం కోసం ఆరా తీశారు. ఇక్కడ ప్రత్యేకంగా శ్రీపాదులవారి దేవస్థానం లేదని తెలిసి ఆయన తీవ్ర విస్మయానికి లోనయ్యారు.

12/18/2016 - 21:47

ఆపదుద్దారకస్వామిగా నరసింహాస్వామిని కొనియాడుతారు. ఆనాడు ప్రహ్లాదుడిని రక్షించ డానికి స్వామి నారసింహుడుగా రూపమెత్తి స్తంభంలోనుంచి ఉద్భవించాడు. అట్లానే ఏభక్తుడు ఏవిధంగా తన్ను దర్శించాలని అనుకొంటే ఆ రూపంలో తన్నుతాను సృజించుకునేస్వామి నే నరసింహావతారుడు. ఒకానొక కాలంలో వేదాలను సోమకాసురుడను రాక్షసుడు దొంగలించాడు. వాటిని తీసుకెళ్లి సముద్రంలో దాచాడు.

12/04/2016 - 21:59

కృష్ణా జిల్లా దివిసీమలో వెలసిన శ్రీ దుర్గా పార్వతీ సమేత నాగేశ్వరస్వామివారి ఆలయం కృష్ణా నదీ తీరాన పెద్దకళ్ళేపల్లిలో దివ్యక్షేత్రంగా విలసిల్లుతోంది. సాధారణంగా పవిత్ర నదీ తీరాల్లో సిద్ధపురుషులు, యోగులు, మహర్షులు చిరకాల తపస్సుచేసిన కారణంగా సమీప ఆలయాలు మహిమాన్వితమైన కారణంగా వేలాది మంది యాత్రికులు ఆ క్షేత్రమును దర్శించుకుంటారు.

11/27/2016 - 21:08

కలియుగ దైవంగా పేరొందిన కేరళ రాష్ట్రంలోని శబరిమలలో హరిహరసుతుడు కొలువై భక్తులకోరికలను ఈడేరుస్తున్నాడు. నేటికీ వయోభేదం లేకుండా చాలామంది అయ్యప్పమాలాధారణ పట్ల ఎక్కువ ఆకర్షితులై, దీక్షమాలను ధరిస్తున్నారు. కార్తికమాసంలో కుల, మత, జాతి, బేదాలు లేకుండా మాలధారణ చేసినవారు నల్లవస్త్రాలు ధరించి నుదుట విభూతి, చందన, కుంకుమ రేఖలతో దర్శనమిస్తున్నారు.

11/20/2016 - 21:43

భవరోగహరుడైన శివుడు దైహిక, దైవిక, భౌతిక తాపాలను దరిచేరనీయడు. పరమ శాంతిదాయకమైన శివలోకప్రాప్తిని కలిగించేవాడు. రోగశోక బాధలను నశింపచేసేవాడు. అటువంటి వైద్యనాథేశ్వరుని దర్శన భాగ్యంతో సమస్త పాపాలూ నశించిపోతాయని పురాణాలు చెబుతున్నాయి.

11/13/2016 - 23:38

విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవద్‌ప్రభుః
భూతకృద్ భూతభృద్భావో భూతాత్మా భూతభావనః

11/13/2016 - 23:34

ప్రతి ఏటా కార్తీకమాసంలో ఆదివేంకటేశ్వరస్వామి ఆలయంలో బ్రహోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఏటా జరిగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా 2016 నవంబర్ 14 నుండి 20 వరకు అంటే ఏడు రోజుల పాటు బ్రహోత్సవాలు నిర్వహిస్తున్నామని ఆలయ ప్రధాన అర్చకులు వేదుల శేష వెంకట వరదాచార్యులు తెలిపారు. 14 న విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, అంకురారోపణ ఉంటుంది. 15 న ఉదయం యాగశాల ప్రవేశం, అగ్నిప్రతిష్ట, ధ్వజారోహణ, పూర్ణాహుతి ఉంటుంది.

Pages