S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పర్యాటకం

04/24/2017 - 03:19

భగవంతుడు ఒక్కడే అయనా ఎవరి విశ్వాసా నికి తగ్గట్టు వారు భగవంతుణ్ణి శివునిగాను, విష్ణువుగాను, బ్రహ్మగాను, పరాశక్తిగాను అభి వర్ణిస్తారు. వారి భక్తి సామ్రాజ్యంలో మహా విష్ణువును సర్వాంతర్యామిగా భావించి ఆయన దశావతారాలను వర్ణిస్తూ కొందరు ఎన్నో కావ్యాలు కథలు అల్లారు. మరికొందరు వైష్ణవాలయాలను వారి అభిరుచికి తగ్గట్టుగా కట్టారు. మహాశివుని పూజించేవారు శివుని అవతారాలను వర్ణిస్తూ శివాలయాలను నిర్మించారు.

04/09/2017 - 21:51

భగవంతుని గూర్చి పలువురు పలుతీరుల చెప్తుంటారు. ఉన్నది ఒకడే దైవం అయనా జిహ్వకోరుచి అన్నట్టుగా ఎవరికిష్టమొచ్చిన తీరులో వారు ఆదైవం గురించి చెప్తారు. గుణాతీతుడు, నిరాకారుడు అయన దైవం భక్తుల కోరిక మేరకు వారు కోరుకున్న రూపాల్లో వ్యక్తమవుతుంటాడు. అవ్యక్తుడైన భగవంతునికి రూపాన్ని, నామాన్ని కల్పించుకుని పూజించి తన్మయుడౌతాడు భక్తుడు.

04/02/2017 - 22:02

రాముని ఆలయాలు, మారుతి వీక్షణలు ప్రపంచంలో ఏ మూల చూసినా కనిపిస్తాయి. అందులో ఆ రామునిపై ప్రేమ, భక్తి ఉన్న వారిలో తెలుగు రాష్ట్రాలవారే ముందంజలో ఉంటారు. ఆ తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలన్నీ ఉగాది నుంచి చైత్ర శుద్ధ నవమినాడు జరుగబోయే శ్రీరామ జననం, సీతారాముల కల్యాణ బ్రహ్మోత్సవాలతో అంకురార్పణ చేశారు. వసంత నవరాత్రుల పేరిట ధార్మికులంతా రామునికథను ఉగాది నుంచే పఠనం సాగిస్తున్నారు.

03/19/2017 - 23:28

బ్రహ్మ విష్ణువుల మధ్య ఏర్పడ్డస్పర్థ ను దూరం చేయడానికి నిర్గుణుడు, నిరాకారుడు, నిరంజనుడు అయిన పరమేశ్వరుడు లింగరూపం ధరించాడు. అగ్నితేజస్సుతో ప్రజర్విల్లే ఈ లింగం యొక్క ఆది అంతాలను కనుగొనడంలో అబద్ధమాడిన పంచముఖ బ్రహ్మ చతుర్ముఖుడయ్యాడు. అజ్ఞానాన్ని , అహంకారాన్ని తొలగించుకుని సర్వమూ నీవే నని నమ్మిన మహావిష్ణువు సర్వలోకారాధ్యుడయ్యాడు.

03/12/2017 - 22:56

ఆగమ శాస్త్రాలలో గ్రామదేవత ఆరాధనకు ఒక ప్రాశస్త్యం వుంది. గ్రామదేవతలంతా స్ర్తిమూర్తులే కావటం విశేషం. ఆదిపరాశక్తి కళాంశ రూపంగా గ్రామదేవతలు వెలిశారని వేదశాస్త్రాలు పేర్కొంటున్నాయి. స్ర్తిని శక్తిస్వరూపిణిగా భావించి ఆరాధించటం అనూచానంగా వస్తున్న సాంప్రదాయం. నాగరికత ఎంత అభివృద్ధి చెందినా గ్రామదేవతారాధన మాత్రం నిరంతరం కొనసాగుతూనే వుంది.

03/05/2017 - 21:35

శ్రీ ఆదిశంకరులు అద్వైత మత వ్యాప్తికోసం దేశం నలుదిక్కులా ప్రతిష్టించిన చతురామ్నాయ పీఠాలలో శ్రీ శృంగేరీ శారదా పీఠం ప్రముఖమైంది. ఆచార్యులవారు తమ ముఖ్య శిష్యులలో ఒకరైన శ్రీ సురేశ్వరాచార్యులవారిని ప్రప్రథమ పీఠాధిపతిగా నియుక్తుల్ని చేసారు. శ్రీసురేశ్వరాచార్యులు సాక్షాత్తు బ్రహ్మ అంశతో జన్మించారు. స్కందావతారుడైన కుమారిలభట్టు శిష్యులలో అగ్రగణ్యుడు.

02/26/2017 - 21:37

శ నీశ్వరుడు తెలియని వారుండరు. శనీశ్వరుడంటే భయపడని వారు అరుదే. ప్రతివారి గ్రహరాశిలోను శనీశ్వరుని మహిమ ఉండనే ఉంటుంది. శని బాధ తప్పించుకోవాలని ప్రతివారు శనేశ్వర పూజలు చేస్తుంటారు. స్వామి అయ్యప్ప మాల ధరించినవారికి ఈ శనేశ్వరుడు తాను వారిక ఏ ఆపదలు కలిగించనని మాట ఇచ్చాడట.

02/19/2017 - 22:40

పేరులోనే శివశక్తుల సమన్వయ స్వరూపం నిక్షిప్తమై ఉంది. దివ్యాతి దివ్యమైన నామం స్మరించినంత మాత్రమునే ముక్తిని ప్రసాదించే దివ్యక్షేత్రం అరుణాచలం.
తమిళనాడులో ఈ పర్వతాన్ని ‘అణ్ణామలై’ అంటారు. ఈ పేరుతోనే ‘తిరువణ్ణామలై’ పట్టణం పిలువబడుతున్నది. జిల్లాకు కూడా అదే పేరు ‘తిరు’ అంటే ’శ్రీ’. ‘శ్రీ’తో కూడి (పార్వతితో) ఉన్న అచలుడు (శివుడు) ఉండడం చేత ‘తిరువణ్ణామలై’గా ప్రసిద్ధి పొందింది.

02/12/2017 - 22:02

పంచారామాలలో ఒకటైన క్షీరారామం (పాలకొల్లు)లోని శివలింగం శ్రీ మహావిష్ణువుచే ప్రతిష్ఠింపబడి, పూజించబడినట్టిది కావున ఈ క్షేత్రం అత్యంత విశిష్ఠమైనది. భారతదేశంలో అత్యంత ప్రాచీన కాలంనుండి ఆది దేవుడు, మహాదేవుడు అయిన ఆ ఉమాపతిని భారతీయులు ఆరాధిస్తున్నారు. అందుకే ఆ పరమేశ్వరుని కాశ్మీరంనుండి కన్యాకుమారి వరకు పలు దేవాలయాలు వున్నాయి. మన ఆంధ్ర రాష్ట్రంలోని పంచారామాలు పరమేశ్వరుని పంచముఖాల వలె భాసిల్లుతున్నాయి.

02/12/2017 - 21:56

తిరుపతి అనగానే శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న క్షేత్రమని మనస్సులో మెదలుతుంది. తిరుమలలో హనుమంతుని ఆలయాలూ ఉన్నాయి. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించినవారు ఆంజనేయస్వామిని కూడా దర్శించుకుంటారు. తిరుపతి కొండల్లో ఓ కొండపేరు అంజనాద్రి. రామభక్త ఆంజనేయుడు తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి ఎదురుగా ఉన్న సన్నిధి వీధిలో కొలువుతీరి భక్తులకు ధర్మాచరణపై మక్కువ పెంచుకోమని చెప్తుంటారు.

Pages