S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పర్యాటకం

11/20/2016 - 21:43

భవరోగహరుడైన శివుడు దైహిక, దైవిక, భౌతిక తాపాలను దరిచేరనీయడు. పరమ శాంతిదాయకమైన శివలోకప్రాప్తిని కలిగించేవాడు. రోగశోక బాధలను నశింపచేసేవాడు. అటువంటి వైద్యనాథేశ్వరుని దర్శన భాగ్యంతో సమస్త పాపాలూ నశించిపోతాయని పురాణాలు చెబుతున్నాయి.

11/13/2016 - 23:38

విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవద్‌ప్రభుః
భూతకృద్ భూతభృద్భావో భూతాత్మా భూతభావనః

11/13/2016 - 23:34

ప్రతి ఏటా కార్తీకమాసంలో ఆదివేంకటేశ్వరస్వామి ఆలయంలో బ్రహోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఏటా జరిగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా 2016 నవంబర్ 14 నుండి 20 వరకు అంటే ఏడు రోజుల పాటు బ్రహోత్సవాలు నిర్వహిస్తున్నామని ఆలయ ప్రధాన అర్చకులు వేదుల శేష వెంకట వరదాచార్యులు తెలిపారు. 14 న విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, అంకురారోపణ ఉంటుంది. 15 న ఉదయం యాగశాల ప్రవేశం, అగ్నిప్రతిష్ట, ధ్వజారోహణ, పూర్ణాహుతి ఉంటుంది.

11/06/2016 - 22:24

ఆశ్వీజంలో అమ్మను పూజించిన భక్తులంతా కార్తికం రాగానే హరహర శంభో శంకరా అంటూ నినదిస్తారు. శివశక్తుల కలయికనే సృష్టి కనుక శివశక్తుల ఆరాధన అనాదిగా వస్తున్నదే. శివ అన్నా శివానీ అన్నా తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులు ఓ అని పలుకుతారు. బోళాశంకరుడైన పరమేశ్వరుడు తన భక్తుల ఈప్సితాలను ఈడేర్చడంలో ముందే ఉంటాడు. ఆ మహదేవుడు కొలువైన శైవక్షేత్రాలన్నీ ఈ కార్తికంలో శోభాయమానంగా వెలుగొందుతుంటాయి.

11/06/2016 - 22:06

వేంకటాద్రితో సమానమైన స్థలం కానీ, వేంకటేశ్వరునితో సమానమైన దైవం గానీ బ్రహ్మాండంలో ఇంతకుముందు లేరు, ఇక భవిష్యత్తులోను ఉండబోరు. అంతటి మహాపురుషుడు, విశేషం కలిగిన శ్రీ వేంకటేశ్వరుడు పిలిచిన భక్తలకు, ఆపన్నులకు కొంగుబంగారమై వెలుగొందుతు అందరి కోరికలను తీరుస్తున్నారు. చిన్న, పెద్ద, ధనిక, పేద, కులం అనే తారతమ్యాలు మనుషులమైన మనకు వున్నాయేమో కానీ, సర్వాంతర్యామి అయిన స్వామివారికి భక్తులందరూ సమానమే.

10/16/2016 - 21:44

సాక్షాత్తూ శ్రీమహావిష్ణువు శయనించిన ఆదిశేష భగవానుని ఏడు పడగలే తిరుమల-తిరుపతి ప్రాంతంలో కొలువై అలరారుతున్న శ్రీ శ్రీనివాసుని సప్తగిరులు అని పురాణాలు చెబుతున్నాయి. ఆ ఏడు సప్తగిరులూ ఇవి- శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, మరియూ వేంకటాద్రి.
శేషాద్రి

10/09/2016 - 21:14

సర్వానికి కారణభూతురాలైన ఆదిపరాశక్తి తన్ను తానే అనేకవిధాలుగా సృజియించుకుంది. ఆ తల్లి గ్రామదేవతగా, ఇంటివేల్పుగా జగాలనేలే తల్లిగా ప్రఖ్యాతిగాంచింది. సర్వసృష్టి ఆమెదే అయినా సజ్జనులను చిరునవ్వుతోను, ఆహ్లాదపరిచే కనుల కాంతితోను రక్షించినట్లే కాళరాత్రిగా మహాకాళిగా రౌద్రస్వరూపిణిగా ఎర్రనైన కనులుక్రోధంతో ఎగిసిపడే రొప్పుతో దుర్జనులు దునుమాడుతుంది. దుర్గగా కీర్తినందుతుంది.

10/03/2016 - 05:12

తె లంగాణలోనే అతి పెద్ద శైవక్షేత్రం వేముల వాడ. శ్రీ ఠాజరాజేశ్వరుడు త్రిపురసుందరీ దేవి కొలువైన చారిత్రాతక, ఆధ్యాత్మిక సుక్షేత్రం. కరీంనగర్ జిల్లాలో నెలకొన్న ఈ క్షేత్రం దక్షిణ భారతదేశంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటి. చాళుక్య రాజుల శైవభక్తికి సాక్షీభూతంవేముల వాడ నిలిచిందంటారు.

09/25/2016 - 21:57

ఆదిదంపతులైన శివపార్వతుల కుమారుడు కుమారస్వామి. ఇతని పుట్టుక గురించి రామాయణంలో విశేషమైన కథ ఉంది. పూర్వం మానవులు, దేవతలు, సిద్దులు, సాధ్యులు కలసి మహాదేవుని ప్రార్థించి తమకు ఆటంకాలు కలిగించేవాడు, హింసించేవాడు అయన తారకా సురుని సంహరించడానికి శివకుమారుడిని ప్రసాదించమని వేడుకున్నారు. ఆ మహాదేవుని ప్రసాదం వలన శివకుమారుడు జన్మించాడు.

09/19/2016 - 01:38

కృష్ణాజిల్లా నెమలి గ్రామంలో అత్యంత ప్రసిద్ధి పొందిన దేవాలయాల్లో వేణుగోపాల స్వామి ఆలయం ఒకటి. ఇక్కడి వేణుగోపాల స్వామి స్వయంభువుగా చెప్తారు. ఒకసారి సీతారామయ్య కొత్తగా కొనుగోలు చేసిన ఇంటిలో మట్టికావాల్సి తమ పనివానికి పెరట్లో కాస్త తవ్వి మట్టి తీసుకొని రమ్మని చెప్పాడు. ఆ నౌఖరు మట్టి తవ్వుతుండగా భూమిలోంచి పిల్లన గ్రోవి ని పట్టుకొన్న స్వామివిగ్రహం పారకు తగిలిందట.

Pages