S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పర్యాటకం

06/26/2016 - 21:54

ద్వాదశ జ్యోతిర్లింగాలలో ప్రతిష్టలింగాలు లేనే లేవు. అన్నీ స్వయంభూలింగాలు. వాటంతట అవే వెలసిన లింగాలు. స్వయంభూలింగాలనే జ్యోతిర్లింగాలు అని కూడా అంటారు. సర్వం జ్యోతిమయం. జ్యోతిమయ స్వరూపుడైన మహాశివుని దర్శనం కోసం జ్యోతిర్లింగాల క్షేత్రాలకు వెళ్లినపుడు పరమ పవిత్ర శివతీర్థాలలో స్నానం అత్యంత ఉత్తేజభరితం, సర్వపాపరహితం.

06/19/2016 - 22:11

స్ఫటికలింగ దర్శనం అనేక వేల జన్మల్లో చేసిన పాపరాశిని భస్మీపటలం చేస్తుందని, అపారధనరాసులకు అధిపతులను చేస్తుందని శివగీత బోధిస్తుంది. ఆ స్ఫటికలింగాన్ని శైవమహాపీఠాధిపతులు సద్గురు శివానందమూర్తిగారు హైదరాబాదు నగరంలోని నాగోలు దగ్గర శ్రీ కాశీ విశే్వశ్వరాలయంలో 2006సం॥ ప్రతిష్ఠించారు. అప్పటినుంచి ఆ కాశీ విశే్వశ్వరుడు భక్తులను కాపాడుతున్నాడు.

,
06/12/2016 - 21:28

నీరు లేని మానవ జీవితాన్ని ఊహించలేము. అసలు మానవ జీవితమే కాదు ఏ ప్రాణి కూడా గాలి, నీరు , తిండి లాంటివి లేకుండా జీవించడం కష్టమే. నీళ్లతోనే నాగరికత అభివృద్ధి చెందింది. కర్మలకైనా అపరకర్మలకైనా నీరు తప్పనిసరిగా అవసరమే. మానవుని అభివృద్ధి మానవ వికాసాలకు మూల కారణం నీరే. మానవులే కాదు దేవతలు సైతం - మహావిష్ణువు గంగలోనే నివాసం ఉన్నాడు. పరమశివుడు గంగనునెత్తి కెత్తుకుని పూజిస్తున్నాడు.

06/05/2016 - 23:41

చిదంబరంలోని తిల్లయ్ నటరాజ మందిరం, చిదానంద స్వరూపుడైన పరమేశ్వరుని పావన నిలయం. అనాది అద్భుత నర్తక నాయకుడైన, అందాల నటరాజస్వామి రమ్య రంగ స్థలం. రమణీయ రత్నసభ. చిదంబర నటరాజస్వామి ‘ఆనంద నటరాజ’స్వామి.

05/30/2016 - 23:49

భోగము, మోక్షము రెండునూ కోరుకున్నవారికి లభింపచేయు స్వామి శ్రీ ఆంజనేయస్వామి.
అట్టి దివ్య మహిమాన్వితుడైన శ్రీ ఆంజనేయస్వామి వారిని పూజించే సుదినమే హనుమజ్జయంతి. మంగళవారం, శనివారం ఆంజనేయునికి ప్రీతికరాలు. వైశాఖ బహుళ దశమి, పూర్వాబాద్ర నక్షత్రం వైధృతి యోగంలో ఆ స్వామి జన్మించినట్లు ‘‘పరాశర సంహిత’’లో కలదు.

05/22/2016 - 22:03

చక్కని ప్రశాంత వాతావరణం, చల్లని ఆహ్లాదకరమైన పంటచేలు, తూర్పున ఉదయించే ఉదయభానుని తొలి సంధ్యా కిరణాల వెలుగులో పాల రాతిలా తెల్లగా మెరిసిపోయే నిండైన దృశ్యం.

05/15/2016 - 23:18

ఓ రెండు మూడు రోజులక్రితం మరోమారు తిరుమల వెళ్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని వచ్చాం. భగవంతుడి దయవల్ల ఈసారి కూడా వసతి, అతి చేరువనుంచి స్వామివారి దర్శనం చక్కగ జరిగాయి. అలమేలు మంగాపురంలో అమ్మవారి దర్శనం కూడా బాగానే జరిగింది. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో చేరడానికి రెండేళ్ల క్రితం ఒకసారి చేరిన తరువాత ఏడాది క్రితం మరోసారి దర్శనం చేసుకున్నాం. అవీ బాగానే జరిగాయి.

05/08/2016 - 21:51

అఖిల భువనాలను పాలించేది, లాలించేది, అనురాగాన్ని చూపించేది కార్యకారణులైన అమ్మనే. కడుపుచూచి అన్నం పెట్టే అమ్మే పెడదోవను పట్టిన తన బిడ్డలను కనె్నర్ర చేసి, కట్టిడి చేస్తుంది. ఆ అమ్మే కంటనీరు పెట్టుకుంటే చూడలేక తానే వివిధావతారాలను ఎత్తి తన బిడ్డలకు కావలసినట్టుగా మారుతుంది. బాధలనుభవించే తన పిల్లలను తన ఒడిలోకి తీసుకుని అపారమైన కరుణను కురిపిస్తుంది.

05/08/2016 - 21:39

అక్షయం అంటే తరగనిది అని, ఎప్పుడూ సమృద్దిగా ఉండేది అనే అర్థాలున్నాయి. పూర్వకాలంలో అక్షయ తృతీయ రోజున ఒక వైశ్యుడు యవలు, గోధుమలు, శనగలు, నీళ్ళతో కూడిన కుండలను బ్రాహ్మణులకు దానం చేశాడు. మరు జన్మలో అతడు క్షత్రియునిగా పుట్టి అనేక రెట్ల అధిక సంపదలకు యజమాని అయ్యాడు. పూర్వ జన్మలో చేసిన దానం వల్లనే నేనీ జన్మలో లక్షలకు అధికారిని అయ్యానని ఈజన్మలోనూ పుణ్యకార్యా లు చేయడం మొదలుపెట్టాడా క్షత్రియుడు.

05/02/2016 - 03:31

కరీంనగర్ పట్టణానికి నలభై కిలోమీటర్లు దూరంలో ఓదెల ప్రాంతంలో కొలువుదీరిన మల్లికార్జునుడు భక్తవత్సలుడు. ఈ ప్రదేశమంతా ప్రకృతి శోభాయమానంగా ఉంటుంది. ఆహ్లాదపరిచే వాతావరణంలో పరమేశ్వరుని పూజ నిరాటంకంగా ఏకాగ్రతతో సాగుతుండడంతో భక్తుల కోరి మరీ వచ్చి ఈ ఓదెల మల్లికార్జునుని దీవెనలందుకుంటారు. ఈ ఓదెల మల్లి కార్జునినునికి ఏటా మాఘ బహుళ ద్వాదశి నుంచి ఆషాడ బహుళ అష్టమివరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.

Pages