S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

01/28/2018 - 20:56

యమునానదిలో ఒక చోట కాళీయుడు తన నివాసాన్ని ఏర్పరుచుకున్నాడు. ఉండగా ఉండగా స్థానబలిమి పెరుగుతున్నట్లుగా కాళీయునికి బలం పెరిగింది. తనకే విషము అనే బలాన్ని పరమేశ్వరుడిచ్చినట్లు అది తన గొప్పతనం అనుకొనేస్థాయికి ఎదిగాడు. తన భార్యలతో, బిడ్డలతో ఆ నివాసాన్ని మరొకరు కాలు పెట్టకుండా చేశాడు.విషపు జ్వాలలతో యయున నీటినంతా కలుషితం చేసేశాడు.

01/28/2018 - 20:54

పరమేశ్వరుని పతిగా పొందిన సతి పరదైవంగా సేవించేది. సతి తండ్రి యైన దక్షుడు ఒకానొక కాలంలో అహంకారానికి లోనైనాడు. నాకన్నా గొప్ప వారెవరూ లేరని అహంకరించడం మొదలు పెట్టాడు. ఆఖరికి శివుడు కూడా తన తరువాతనే నేనే పోనీలే అని నా అల్లుడిని చేసుకొన్నాను కనుక ఈ మాత్రమైనా ఆయనకు పేరు వచ్చింది అనేవాడు. ఇలా క్రమంగా శివదూషణ చేయడానికి కూడా ముందు కురికాడు. యజ్ఞం చేయాలని అనుకొన్నాడు.

01/21/2018 - 21:00

‘ధ్రువా! ఎందుకంత ఆవేదనతో ముందుకు వెళ్లుతున్నావు. పాలుకారే ఆ బుగ్గలు ఎండవేడిమి తట్టుకోలేక ఎర్రబారిపోతున్నాయి’అన్నాడు.

01/21/2018 - 20:59

కొద్ది కాలం గడిచింది.

01/14/2018 - 18:47

కేవలం పాపకర్మవల్లనే జననమరణచక్రంలో బంధీలు అవుతామని అనుకోనక్కర్లేదు. కోరిక అనేది ఉంటే చాలు మళ్లీ జన్మ తప్పకవస్తుంది. మనం ఎన్ని పుణ్యకార్యాలు చేసినా కూడా ఆ పుణ్యఫలాన్ని అందుకోవడానికి కూడా జన్మలు వస్తూనే ఉంటాయి. ఇక కోరికలు ఉంటే అవి తీరేదాకా జన్మల పరంపర కొనసాగుతూనే ఉంటుంది. అట్లాంటి కథే ధ్రువుని కథ. సునీతి ఉత్తానపాదుల ముద్దుల కుమారుడు ధ్రువుడు. ఉత్తానపాదులకు సురుచి అను మరో భార్యకూడా ఉండేది.

01/14/2018 - 18:41

పార్వతీ తనయ నమోస్తుతే
ప్రథమ పూజలందు పార్వతి తనయుండు
విఘ్నములను బాపి విద్య నొసగ
వక్రతుండ రూప వరసిద్ధి గణపతీ
చేరికొలుతు నిన్ను శివకుమార

శతకపద్య విద్య సంప్రాప్త మందగ
రచన జేసినాడ రమ్యమొప్ప
భక్తి సుమములిడుతు బ్రహ్మపురంధ్రికి
నాదు కవిత క్రియ నవ్యదీప్తి

01/14/2018 - 18:39

ఉత్తర శ్రీరంగంగా కీర్తిపొందిన నెల్లూరు శ్రీరంగనాయకుల ఆలయం కధాసారాంశం స్కాంద పురాణంలో ప్రస్తుతించారు. పెన్నానదీ ప్రాంతమైన పినాకిని నదీ తీరాన కొలువైన రంగనాథస్వామికి శయన నారాయణుడు (పళ్లికొండ పెరుమాళ్ళు)గాను ఈ ప్రాంతాన్ని శ్రీ వైకుంఠం (చిత్తరమేళ విణగళ్)గా చరిత్ర ప్రసిద్ధి చెందింది.

01/14/2018 - 18:35

‘‘ఆగండి ఆగండి ముందుకు వెళ్లకండి. ఇక్కడికి దగ్గరలోనే తాటివనం ఉంది. అందులోనుండి ఈ పండ్ల వాసన వస్తోంది. కాని మనం అక్కడికి వెళ్లవద్దు. అక్కడ ఒక గొప్ప రాక్షసుడు వున్నాడు. వాని పేరు ధేనుకాసురుడు. అందుకే మనం అక్కడికి వెళ్లవద్దు. అసలే మన పెద్దవాళ్లు ఆపదలదగ్గరకు వెళ్లవద్దు అని చెప్పి పంపారు కదా’అన్నారు.

01/07/2018 - 22:55

విల్లిపుత్తూరులోని విష్ణుచిత్తుని తనయ ఆనాడు చేసిన తిరుప్పావై వ్రతాన్ని పురస్కరించుకుంటూ వైష్ణవాలయాలన్నీ తిరుప్పావై వ్రతాన్ని ఆచరిస్తాయి. భక్తులంతా తండోపతండాలుగా ప్రాతఃకాలంలో వెళ్లి ఆ గోదాదేవిని స్మరించుకుంటూ తాముకూడా ఆ తిరుప్పావై పాశురాలను అనుసంధానించుకుంటారు. ఆ తర్వాత శ్రీరంగాగోదాదేవులను పూజించుకొంటారు. ఇలా నెలరోజులూ వ్రతాన్ని ఆచరిస్తారు.

01/07/2018 - 22:54

వాళ్లందరినీ చూసి బ్రహ్మాది దేవతలు పుష్పవృష్టి కురిపించారు. ఆహా ఈ గోపాలుర అదృష్టమే అదృష్టం. పరమాత్మకు వీరికి ఏమాత్రం భేదం లేదు సుమా అనుకొన్నారు. రంభాదులు ఆనందంతో నృత్యం చేస్తున్నారు.

Pages