S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

12/04/2016 - 21:51

గర్గ మహర్షికి స్వయంగా శివుడే గురువు. గర్గుడికి అన్ని విద్యలు శివుడే నేర్పించాడు. గర్గుడు బ్రహ్మ మానస పుత్రుడు. అనేకమంది రాజులు గర్గుడిని కుల గురువుగా పెట్టుకున్నారు. ఒకసారి గర్గుడు శిష్యుల్ని తీసుకుని దేవకీ వసుదేవుల కోరిక ప్రకారం రేపల్లె వచ్చాడు. శిష్యులతో వచ్చిన గర్గ మహర్షిని చూసి యశోద సత్కారంచేసి కూర్చోమని చెప్పి.. ‘మహర్షీ మీరెవరో గొప్ప తేజస్సుతో విష్ణుమూర్తిలా ఉన్నారు.

11/27/2016 - 21:01

ప్రపంచం చాలా విశాలమైనది. అంతులేని కోరికలు, వాటిని సాధించుకోవటానికి చేసే ప్రయత్నాలు జీవన గమనానే్న శాసిస్తుంటాయి. ఎన్నో ప్రలోభాలకు గురిచేస్తుంటాయి. మనిషికి కావలసింది తను ఏదైతే కోరుకున్నాడో అదే. అప్పుడు అతడు తృప్తిపడతాడు. తృప్తి కలగనపుడు ఆశాభంగం చెందుతాడు. అందువలన చాలా విలువైన కాలం గంగపాలౌతుంది. వాస్తవాలను కూడా విడిచిపెడతారు.

11/27/2016 - 20:48

నేను-నేను అంటూ ఒక నేను తలంపు స్వానుభవంలో ఉండుట అందరికి సహజ ప్రమాణమే. ఈ నేనుయే నేనును తెలుసుకొనుటకు ఆలంబనము. కనుక ఈ స్వీయ గమనికలో తర్కవాద సాధన విశ్వాసము శాస్తమ్రుల ప్రసక్తి అవసరం లేదు.

11/20/2016 - 21:45

‘నాకు ఆత్మసాక్షాత్కారం అయింది’, ‘నేను బ్రహ్మమును తెలిసికొన్నాను’ అని ఎవరైనా చెబితే అట్టి వ్యక్తి ఆత్మను ఇంకా తెలిసికోలేదనే అర్థం. ఎందుకంటే ఆత్మను తెలిసికొన్న నేను వేఱు అనీ, తెలియబడిన వస్తువుగా ఆత్మవేఱు అనీ ఏర్పడుతుంది.

11/20/2016 - 21:40

మనం నిత్య జీవితంలో దేవాలయానికి వెళ్ళి దైవదర్శనం చేసుకోవటం ఒక దైనందిన జీవిత చర్యగా ఏర్పరచుకుంటాం. అలా దేవాలయంలో దైవదర్శనం చేసుకుంటూ మనం కొన్ని నియమాలు పాటిస్తుంటాం. కానీ వాటిని అలా ఎందుకు పాటిస్తున్నామో వాటివెనుక వున్న అంతరార్ధ పరమార్థాలేమిటో మనకు అన్నీ తెలియవు. అవేంటో అందరూ తెలుసుకుంటే బాగుంటుంది.

11/13/2016 - 23:31

‘స్వామియే శరణం అయ్యప్ప’ అంటూ కార్తికంలో స్వామి అయ్యప్ప పూజలు చేస్తారు. మణికంఠుడు, పందళరాజకుమారుడు, హరిహరపుత్రన్, అయ్యన్, అర్యన్, పూరణైకళ్వన్, పుట్కళైమణాళన్, అరతె్తైక్కాప్పోన్, కోయికొడియోన్, శాత్తన్, వెల్లైయానైవాహనన్, కారి, చెండాయుధన్, యోగి, కడల్‌నిరవణ్ణన్ అను పలు నామమలు స్వామికి ఉన్నా అయ్యప్ప నామమే ప్రసిద్ధి. ఒకానొక కాలంలో పందళరాజుకు అడవిలో మణిహారముతో అయ్యప్పస్వామి కనిపించాడట.

11/13/2016 - 23:23

ఏ విధమైన చాంచల్యము లేక మనస్సును నిర్మలంగా ఉంచుకొని దేవుని మదిలో తలచుటయే ధ్యానము. ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ. ధ్యానమనేది యాంత్రిక జీవన ప్రక్రియ కాకూడదు. ధ్యానము నిత్యనూతన సముజ్వల కాంతి పుంజమై భాసించాలి. మనసు మనలను యాతనకు గురిచేస్తుంది. మనో నిగ్రహము లేని మానవుడు, ధ్యానమును ఎంత మాత్రము కొనసాగించలేడు. మనకు స్వాధీనమైన మనస్సు స్వాత్మదర్శనానికి సహకరిస్తుంది.

11/06/2016 - 22:16

కౌరవ పాండవ యుద్ధం ముగిసింది. కౌరవ పక్షం వారు మరణించారు. ఇక మిగిలింది ధృతరాష్ట్ర గాంధారీలు మాత్రమే. వారిద్దరూ ధర్మరాజు పంచన బతుకుతున్నారు. ధృతరాష్ట్రుడు దుష్టుడు. ఆయనకు రాత్రులు నిద్రపట్టటంలేదు. చెడు సంకల్పం ఉన్నవాడికి అన్నం, నీళ్లు సహించవు, నిద్ర రాదు. మొదటినుంచి ధృతరాష్ట్రుడివల్లే ధర్మపథాన నడిచే పాండవులకు కష్టాలు. భగవంతుడు వారి పక్షం ఉన్నా, కాలం కలిసి రావాలని చూశారు. ధర్మం గెలిచింది.

10/23/2016 - 21:26

‘‘కీ టాః పతంగాః మశకాశ్చ వృక్షాః
జలే స్థలే యే నివసంతి జీవాః
దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగిః
భవన్తి నిత్యాంశ్చ పచాహి విప్రాః’’

10/23/2016 - 21:23

కార్తీకమాసము శక్తివంతమైనది. స్నానము, అభిషేకము, అర్చన, ప్రదక్షిణ, దీపారాధన, అన్నసంతర్పణ ఈ మాస విశిష్టతలు. పాపనివృత్తికి మార్గాలు. శతృవులను జయించి, విజయలక్ష్మిని వరించటానికి చక్కటి సాధనము శుభప్రదమైన కార్తీకమాసమని ‘బహులోర్జౌ కార్తీకో’ అనే అమరవాణి సందేశం ద్వారా తెలియజేయబడింది.

Pages