S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

10/23/2016 - 21:19

ప్రాగ్జ్యోతిష్య పురాన్ని ఏలే దానవేశ్వరుడు నరకుడు. ఇతడు బ్రహ్మ వరగర్వి. పూర్వకాలాన సత్యాదేవికి(్భదేవి) పుట్టిన బిడ్డ. కాని ఈ ద్వాపరయుగంలో నరకుడు నరకంటకుడుగా మారాడు. సాధువులను సజ్జనులను హింసించేవాడు. వారినే కాక అబలలైన స్ర్తిలను కూడా సాధించేవాడు. అంతేకాక అదితి కుండలాలను, వరుణుడి ఛత్రాన్ని చివరకు మణిమయమైన మేరుశిఖరాన్ని కూడా తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. ముల్లోకాలకు ముచ్చెమటలు పట్టించేవాడు.

10/16/2016 - 21:47

నారద భక్తిసూత్రాలల్లో చెప్పినట్లు అపారమైన అచంచలమైన ప్రేమే భక్తి. భక్తిరేవ గరీయసి - భగవంతుని చేరడానికి ఉన్న అన్ని మార్గాల్లో అతిశ్రేష్ఠమైనది సులభమైనది భక్తి ఒక్కటే. ప్రతి ప్రాణి కూడా భగవంతుని చేరడానికి యత్నిస్తుంటుంది అన్న భక్తుల భావనకు అద్దం పట్టినట్లుగా అక్కడక్కడ కొన్ని జంతువులు భగవంతుని నీడకు చేరుతుంటాయ.

10/16/2016 - 21:36

నీతిసుధావాహిని
రచయిత: వెల్దండ పూరి బాలస్వామిగుప్త
మూల్యం: రూ.60/-లు
ప్రతులు దొరుకుచోటు
సంస్థాపకులు:
హనుమాన్
జ్ఞానయజ్ఞ సమితి,
మండల పరిషత్
కార్యాలయం ముందు,
వివేకానంద నగర్ , కల్వకుర్తి
మహబూబ్‌నగర్ జిల్లా, తెలంగాణ
సెల్ నెం: 9052430492

10/09/2016 - 21:07

ఏమూల ఉన్నా తన భక్తులను పిచ్చుక కాలికి దారం కట్టి దగ్గరకు లాకొన్నట్టుగా తన దరికి చేర్చుకుంటానని సాయిబాబా చెప్పాడు. కులమతాలు కాని హెచ్చుతగ్గులు కాని లెక్కలోకి తీసుకోకుండా అందరినీ సమానంగా చూచే సద్గురువు సాయిబాబా. ప్రతివీధిలోను, ప్రతి ఇంట్లోను కొలువైన సాయిబాబా అందరి మనసుల్లో సుప్రతిష్టుడైనాడు. సాయిబాబా ఆదిభిక్షువులాగా భిక్షాటన చేసే సాయి అందరికీ త్యాగమే మహోన్నత గుణమని బోధించాడు.

10/03/2016 - 05:08

‘‘నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ’’ అని సంబోధించి ‘‘్భక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ’’ కాశీ క్షేత్ర నివాసినీ, కమలలోచన విశాలినీ, విశే్వశ మనోల్లాసినీ అని అన్నపూర్ణాదేవిని ఉపాసించినా మోక్షాన్ని ఇవ్వ మని, జ్ఞాన విజ్ఞాలను ప్రసాదించమని వేడు కునే తల్లి గాయత్రీగా చెప్తారు. సంధ్యాదేవతగా ఆరాధించబడే ఈ తల్లి వల్లే లోకాలన్నీ రక్షించ బడుతున్నాయ. గాయత్రీని ఉపాసించినవారికి అపజయం ఉండదు.

10/03/2016 - 05:07

నవచంపక పుష్పాభనాసాదండ విరాజితా
తారాకాంతి తిరస్కారి నాసాభరణభూషితా

09/25/2016 - 21:55

విశ్వమంతా వ్యాపించినవాడిని ఈశ్వరుడని మనం పిలుస్తాం. ఈ ఈశ్వరుడే పరమేశ్వరునిగా కీర్తిస్తాం. ఈ పరమేశుడు అందరికి దగ్గరగా ఉంటాడు. దూరంగాను ఉంటాడు. అందరిలోను ఉంటాడు. అందరిలో చైతన్యరూపుడై వెలిగేవాడే ఈశ్వరుడు. భక్తికి వశమయ్యే భగవానుడుగా కీర్తినొందినవాడు. అన్నింటికి కర్త ఒక్కడే అన్న జ్ఞానాన్ని కలిగినవాడు మనిషి. నిష్కామభావంతో కర్మలను చేయమంటుంథి ఈశావాస్యోపనిషత్తు.

09/25/2016 - 21:54

మానవుడు జనన మరణ పరంపర నుండి విముక్తి పొంద గోరినప్పుడు ధ్యానము పూజ జపము మొదలైన సాధన మార్గములు భక్తిశ్రద్ధలతో ఆచరించాలి. కాని ఎన్ని సాధనాలు చేసినా గురుకృపను పొందగలిగినప్పుడే ముక్తి లభిస్తుంది. కనుక ధ్యానిస్తే గురుదేవుని స్వరూపమునే ధ్యానించాలి. లౌకిక విద్యలు నేర్పే గురువులు విద్యాగురువులు వీరు పునర్జన్మ రాహిత్యం చేసే ఆత్మవిద్యను ప్రసాదించలేరు.

09/25/2016 - 21:49

భ గవంతుడు గుణాతీతుడు.నిర్గుణుడు. గుణాల చేత ప్రేరింపబడేవాడు మానవుడు. మానవుడు సత్వగుణం వృద్ధిపొందితే సత్యప్రకాశుడు అవుతాడు. నిస్వార్థంతో నలుగురి కల్యాణం కోసం శ్రమించే తత్వంగుణ సంపన్నుడుగా కీర్తించబడుతాడు. పరమాత్మస్వరూపునిగా సంభావించబడుతాడు. రజోగుణం వృద్ధి చెందించుకున్నవారు కోరికలతో సతమతవౌతారు. కర్మలనాశ్రయిస్తారు. కోరికలను తీర్చుకోవడానికి కాలాన్ని వెచ్చించి భగవంతునికి దూరవౌతుంటాడు.

09/19/2016 - 01:33

ఎంతటి గొప్ప వారికైనా సరే వారు సురులు కావచ్చు అసురులు కావచ్చు. ఒక పర్యాయం గర్వం ఆవహించింది అంటే అది నెత్తిమీద నుంచి దిగేదాకా నెత్తిమీదే కళ్ళుంటాయి అంటే అతిశయోక్తి కాదు. సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మకు కూడా ఈ విషయం నుండి మినహాయింపు లేదు.

Pages