S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

04/24/2016 - 22:40

దేవాలయ దర్శనంతోపాటుగా ధ్వజ స్తంభ దర్శనం సాధారణమే. అయతే ఈ ధ్వజస్తంభంఈ దేవాలయాల్లో ఎందుకు నిలుపుతారు అని తరిచిచూస్తే ఎన్నో ఆసక్తికరమైన విషయాలు మనకు తెలుస్తాయ.. అవి ఏంటంటే
‘్ధ్వజ’మనగా పతాక. అనగా జనసామాన్య భాషలో జండా. స్తంభమనగా కంభం. అది కర్రదైనా కావచ్చు. లోహంతో చేసిందైనా కావచ్చు. లేక రాతిదైనా కావచ్చు.

04/24/2016 - 22:37

అనాది నుండి ఐతిహ్యాలయిన రామాయణ, భారత, భాగవతాలకు వాటికి అనుబంధమైన కావ్యరచనలకు జనపదాలు ఎంతగానో ద్యోతకం చేశాయి. కవుల వర్ణనలకు, కీకారణ్యాలలో వెల్లివిరిసిన వృక్షజాలలకు, లతికాపరమైన పుష్ప సుగంధాలకు ఆలవాలమై ప్రకృతిని ప్రసిద్ధంగా వాడుకున్న కవుల యాదృచ్ఛిక వర్ణనలకు ఆలంబాలయ్యాయి. కావ్య మనోహర తత్వానికి ఆ అటవి సంపదే అలంకార ప్రాయమయ్యాయి.

04/17/2016 - 21:43

నమస్కారం అనే పదానికి అర్ధం ‘అయ్యా! అమ్మా! మీలోని ఉత్తమ లక్షణాలను గౌరవిస్తున్నాం. మేము కూడా ఆ ఉత్తమ లక్షణాలను పొందగోరుతున్నాము’ అని.

04/17/2016 - 21:40

ప్రదక్షిణము అనే పదము మన ఆధ్యాత్మిక వారసత్వ సంపదతో ముడివడి వుంది. ప్రదక్షిణము అంటే పరిభ్రమణము. అసలు ప్రదక్షిణ ఎందుకు చేయాలి ఎలా చేయాలి ప్రదక్షిణ అంటే కుడినుండి ఎడమకు తిరుగుట. మరి అప్రదిక్షణ అంటే ఎడమనుండి కుడికి తిరుగుట. అప్రదక్షిణ ఎందుకు చేస్తారు. ఏఏ సందర్భాల్లో చేస్తారు అంటే ఎక్కువగా పితృసంబంధిత కార్యములపుడు చేస్తారు. భగవంతునికి నేను వంద ప్రదక్షిణలు చేసాను, మండలం రోజులు చేసాను అంటారు.

04/11/2016 - 00:02

పారుష్యం లేని వాక్కు, పెద్దలను గౌరవించడం, పిన్నలను అభిమానించడం, ఎవరినీ నొప్పించక పోవడం, సర్వశాస్త్ర పారంగత్యం... పూర్వభాషి మితభాషిగా పేరుతెచ్చుకున్న శ్రీరాముడు అందరిచేత రాజుగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడినా తండ్రి మాటకారణంగా 14ఏండ్లు వనవాసానికై పెద్దపీట వేశాడు.

04/10/2016 - 23:49

ఫాఠ్యే గేయేచ మధురం....... అన్నట్టుగానే రామాయణం సాహిత్యంలో ఎన్ని ప్రక్రియలున్నవో వాటినన్నింటాకుదురుకున్నది. అసలు రాముడు దశరథుని కొడుకును మాత్రమే అని చెప్పినా దానివెనుక శ్రీమహావిష్ణువే తన్నుతాను దాశరథిగా సృజించుకున్నాడని తెలుస్తుంది. అట్లా అయి నా ఈ రామకథ పురాణాల్లోను, ఇతిహాసాల్లోను, సంగీతంలోను, వచనంలోను అసలు రాముడు లేని వస్తువంటూ లేదు అని చెప్పడానికి ఏమాత్రం జంకులేకుండా ఉంటుంది.

04/04/2016 - 01:05

యుగాది వచ్చిందటే మనకందరికీ మొట్ట మొదట గుర్తువచ్చేది దాశరథినే. ఉగాది వెళ్లిన వారంలోనే శ్రీరామ నవమి. త్రేతాయుగపు రాముడైనా సరే నిత్యమూ ఆయన స్మరణతోనే కాలం గడుపుతుండడం తెలుగువారికి సాధారణం. మనిషి, ఊరు, రాష్ట్రం, దేశం ఇవేకాదు ఆఖరికి పెంపుడు జంతువులకు కూడా రామ అన్న పేరును పెట్టుకొని ఆనందించడం భారతీయుల ప్రత్యేక లక్షణం.

03/27/2016 - 23:30

అన్ని మతాల సారం, దేశభక్తి మాతృసమానం. ‘మాతృదేవోభవ’ అని మన వేద వాఙ్మయం. ఎవరి ధర్మం ప్రకారం వారు వాక్కుస్వాతంత్య్రం, భావ ప్రకటనను నిర్దేశించుకున్నారు. మన దేశ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం మనం ధర్మచక్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం.

03/27/2016 - 23:27

గోవర్థనగిరిని ఎత్తి గోపాలకృష్ణుడు ప్రళయ వర్షం నుండి వేల వేల గోవులను రక్షించాడు. గోవులంటే గోపాలకృష్ణునికి అమితమైన ప్రేమ. గోమాతను గౌరవించడం ప్రాచీన కాల సాంప్రదాయం. ‘గోవు’ అనగానే భారతీయులలో ఎక్కడాలేని పవిత్రభావం కలుగక మానదు. దాదాపు ఐదు వేల సంవత్సరాల కాలం నాడే కృష్ణ్భగవానుడు గోవులను కాసేవాడు. పూజనీయమైనవి. పవిత్రమైనటువంటివి గోమాతలు. గోమాతను పూజించడం, గోమాతను గౌరవించడం మన విధి.

03/20/2016 - 23:08

వేదాలు మాతృదేవోభవ, పితృదేవోభవ అని ఘోషిస్తున్నాయి. తల్లినే మొదటి దేవతగా, గురువుగా ఆరాధించుమని పెద్దలు సెలవిచ్చారు. ప్రపంచంలో నిస్వార్థమైన ప్రేమ కేవలం తల్లికే ఉంది. సంతానానికై కడుపులో పెరుగుతున్న బిడ్డకై ఆమె పడే తపన ఆరాటం మాటలకందని విషయం. సంతానానికై స్ర్తి ఎన్నో వ్రతాలు, పూజలు ఆచరిస్తుంది. ముక్కోటి దేవతలకు మ్రొక్కుతుంది. తన బిడ్డ సౌఖ్యానికై ఎంతటి త్యాగానికైనా వెనుదీయని ప్రేమమూర్తి తల్లి.

Pages