S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

11/19/2017 - 21:17

సమయం చూసి శ్రీకృష్ణుడు కూడా గోపబాలలూ ఈ దూడ ఎంత మంచిదో చూడండి అంటూ వెనుక నుంచి వెళ్లి ఆ దూడ రెండు కాళ్లు పట్టుకొని పైకెత్తి వెలగచెట్టుకేసి మోదాడు. ఆ దెబ్బకు దూడ లోని వత్సాసురుడు కేకలు పెడుతూ చనిపోయి కిందపడ్డాడు. బాలకులందరూ కృష్ణుని బలాన్ని మెచ్చుకుంటూ అతడిపై పూవులను ఆకులను చల్లారు. ఆకాశం నుంచి దేవతలు పుష్పవృష్టి కురింపించారు.

11/19/2017 - 21:13

నవంబరు 23 సత్యసాయ జన్మదిన సందర్భంగా ..
*
‘‘బంగారు’’ అనే ప్రేమతో పిలిచే పుటపర్తి సాయి పిలుపు అందరినీ ఆకర్షించేది. బాబాకు దగ్గర చేసేది. ఎదుటివారిలో ప్రేమను నింపేది ఆ బంగారు అన్న పదమే.‘‘ నీవు ఇతరులకు సాయం చేసే గుణంతో జీవించు. ఒకవేళ నీకు ఆపదలు వస్తే భగవంతుడు వేయి చేతులతోనిన్ను కాపాడుతాడు ’’ అని సాయి బోధన సాగేది.

11/19/2017 - 21:11

నే ను కాసేపు విశ్రమిస్తున్నా సరే ఆ హరిణాన్ని నా గుండెలపై ఆడుకోనిచ్చేవాడిని. నా పక్కనే నిద్రపోయేది. నేను జోల పాట పాడితేనే కనులు మూసుకొని పడుకునేది.నేను మాత్రం ఒకవేళ పూర్తిగా నిద్రపోతే ఆ హరిణానికి ఎవరైనా కీడు తలపెడుతారేమోనని ఆదమరిచి నిద్రపోయేవాడినే కాదు.

11/13/2017 - 00:42

పరుగుపరుగన వచ్చి తన ప్రతిబింబాన్ని చూపిస్తున్న కృష్ణయ్యను చూచి అయ్యో ఎంత అమాయకుడో నా కుమారుడు. అనుకొంటూ నా తండ్రీ! ఇది నీ బింబమేనురా నాయనా. ఇది బూచాడు కదా.. నీవు అల్లరి చేస్తూ పొరుగిండ్లకు పోతే అక్కడ బూచాడు ఉండి నిన్ను పట్టుకుపోతాడు. అందుకే నీవు ఎక్కడికి పోవద్దు కన్నా అంటూ యశోదమ్మ ముద్దుచేస్తోంది. కృష్ణయ్య ఆ తల్లి అనురాగానికి తన్మయుడై చిన్నవాడై ఆనందాన్ని అనుభవిస్తున్నాడు.

11/13/2017 - 00:41

హిమాలయ పర్వత ప్రాంతాలల్లో నేపాల్, అస్సాం, జావా, మలయా, నీలగిరి, ఆనెమల, పళని, బెంగాల్, ఉత్తరప్రదేశ్, మైసూరు ప్రాంతములలో రుద్రాక్షలు విరివిగా వివిధ ముఖాలలో లభిస్తాయి.

11/13/2017 - 00:39

ఈ పుట్టుక గిట్టుక మధ్యలో నిత్యమూ సత్యమూ అయన భగవంతుని గూర్చి ఆలోచించాలి. తెలుసుకోవాలి. ఆయన్ను అనే్వషించాలి అనుకొనేవాణ్ణి. ఇన్నివిషయాల పట్ల వ్యతిరిక్తమైన నా మనసు మాత్రం శ్రీమన్నారాయణుని నామంతో పులకించిపోయేది. కేవలం శ్రీహరి నామం తప్ప మరో ధ్యాస లేకుండా నా జీవితాన్ని గడుపాలని నిశ్చయంచుకుని రోజుల్ను గడుపుతున్నాను. నా నోరు శ్రీహరి నామం తప్ప మరొకటి పలుకకుండా చేసుకొన్నాను.

11/05/2017 - 21:42

అంతా వింటునే ఉన్నా ఆ బోయివానిలో కాస్తయినా చలనం లేదు. మాట కూడా లేదు. రహూగణునికి ఆశ్చర్యం వేసింది. అంతలో అతని తమ్ములమని చెప్పిన వారు మహారాజా ! మేము కూడా ఇతనిని బహుకష్టాల పాలు చేశాము కాని కాస్తయినా కష్టం పడినట్టుగా కనిపించడితడు. ఎపుడూ దేనికోసమో ఎదురుచూస్తుంటాడు. మనమెంతా ఎన్ని మాట్లాడినా జవాబు ఇవ్వడు. అతను మాట్లాడాలనుకొన్నపుడే మాట్లాడుతాడు అని చెప్పాడు.

11/05/2017 - 21:30

నమస్కారము. హృదయ సంస్కారానికి సంకేతము - (రెండు చేతులు జోడించి) ముకుళిత హస్తములతో హృదయానికి దగ్గరగా నుంచి ఎదుటి వారిని గౌరవించుటలో చేయు ఒక ప్రక్రియ - నమస్కారము చేయటమనేది మన భారతీయ సంప్రదాయాలలోని అంతరంగము - పెద్దలకు పిన్నలు నమస్కరించి ఆశీస్సులు తీసుకోవటం ఒక సత్ సంప్రదాయం - నమస్కరించే విధానమునుబట్టి అవతలి వారి వ్యక్తిత్వమును అంచనా వేయవచ్చు.

11/05/2017 - 21:30

ఆ కృష్ణ పాద స్పర్శ తగిలీ తగలగానే మద్దిచెట్లు కూకటి వేళ్లతో విరుచుకు పడిపోయాయి. అందుండి దివ్యశరీర ధారులైన నలకూబర, మణిగ్రీవులు బయలుపడ్డారు. చేతులెత్తి ఓ మహానుభావా! నీవు చిన్న బాలకుమారునివా! నీవు నందనందనుని బిడ్డనివా అంటూ ఆశ్చర్యానందాలతో కళ్లప్పగించి చూస్తున్నారు.

10/29/2017 - 20:12

అభిషేకాలు, పూజలు, వ్రతాలు, పారాయణాలు, నోములు, దీపదానాలు, ఇట్లాంటి వాటితో గృహాలు, దేవాలయాలు కళకళలాడే సమయం, శుద్ధ ఏకాదశి, ద్వాదశి తిధులలో సువాసినులు తులసి పూజ చేసి తులసీవ్రతాలు, పున్నమినాడు 365 వత్తులతో దీపాలను వెలిగించి ముప్ఫయి మూడు నోముల వ్రతాలు, ‘్ధత్రీలక్ష్మి’ పూజలు, వనమహోత్సవాలు ఇట్లాంటివాటిని నిర్వహించే మాసమే కార్తికం.

Pages