S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

10/01/2017 - 20:25

ఓరోజు ఓ గోపకాంత తన విభుని కోసం ఎదురు చూస్తూ కూర్చుని ఉంది. ఆమె దగ్గరకు వెళ్లాడు కృష్ణయ్య! ‘ఎవరికోసం చూస్తున్నావు ’అని ఆ యువతి అడిగాడు. తన మగని కోసం అంటే వాడు అంత మంచివాడు కాడు నన్ను మగనిగా చేసుకోరాదా? అంటూ ఆ అమ్మాయిని ఏడిపించాడు. ముద్దులు మూటగట్టే యశోదానందుడు గోపకాంతలు వారి వారి పాలుపెరుగు కుండలను పగులగొట్టి వారిని ఏడిపించేవాడు.

10/01/2017 - 20:22

పరమశివుడు తపస్సుకు మెచ్చి ప్రత్యక్షం అయ్యాడు. నీకేమి వరం కావాలి అని అడిగితే కాశీరాజు కుమార్తె ఐదుసార్లు పతి అని అడిగిందట. దానితో పరమశివుడు నీకు మరుజన్మలో ఐదుగురు భర్తలు లభిస్తారని వరం ఇచ్చాడు. ఇలాంటి వరం ఏమిటా అని బాధపడే కాశీరాజు కుమార్తె ను పరమశివుడే ఓదార్చి మరేం ఫర్లేదు. నీవు ధర్మయుతంగానే ఐదుగురి భర్తలకు భార్యగా మెలుగుతావు. పరమ పతివ్రతగా పేరు పొందుతావు అని కైలాస వాసుడు వరం ఇచ్చాడు.

10/01/2017 - 20:18

మానవ జీవితంలో శరీరాన్ని పోషించుకోవడానికి, కుటుంబ పరివార పోషణకు ఆవశ్యకమైన ధనార్జన కొరకు వృత్తి, ఉద్యోగ వ్యాపారాదులు ప్రతి ఒక్కరూ చేయక తప్పదు. కానిభగవద్గీత మానవుడు కర్మచేయకుండా ఒక్క క్షణమైనా ఉండలేడని అంటుంది. అదే భగవద్గీత కర్మను నీ ప్రమేయం లేకుండా అంటే చేసేవాడు చేయంచేవాడు కూడా భగవంతుడే అని నమ్మి చేస్తే కర్మఫలం నిన్ను అంటదు అని చెప్తుంది.

09/24/2017 - 22:02

శ రన్నవరాత్రుల్లో ప్రధానమైంది శక్తిపూజ. తెలంగాణా ప్రాంతంలో శక్తినే బతుకమ్మగా ఆరాధిస్తారు. తెలంగాణా సంస్కృతిసంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ. కాకతీయుల సామ్రాజ్య కాలంనుంచి కూడా ఈ బతుకమ్మ వేడుకలు ఘనంగాజరిగేవి. భాద్రపద బహుళ అమావాస్య నాడు ప్రారంభమై ఆశ్వయుజ శుక్లఅష్టమి తో ముగుస్తాయి. దుర్గాష్టమితో పరిసమాప్తం అవుతాయి.

09/24/2017 - 21:58

వ చ్చింది ఎవరో కూడా చూడకుండానే యశోద కనిపించగానే ‘‘ ఇపుడు ఏమి చెబుతావో నీవే చెప్పు ఇదిగో ఈ నీ చిన్ని కుమారుని పట్టుకొచ్చాను. నేను చెప్పేదంతా కల్లలన్నావు కదా. చూడమ్మా నీ చిన్ని కృష్ణుణ్ణి’’ అంటూ తన వెనుక దాచుకుని పట్టి తెచ్చిన పిల్లవాణ్ణి ముందుకు ఈడ్చింది. వాడు కళ్లను నలుపుకుంటూ బుడి బుడి రాగాలు తీస్తూ ముందుకు వచ్చి నిల్చున్నాడు.

09/24/2017 - 21:53

దేవతలంతా కలసి నహుషుడిని ఇంద్రుడుగా చేసారు. నహుషుడు కూడా ఎంతో ఆనందంతో ఇంద్ర పదవిని తీసుకొన్నాడు. కాని కొన్నాళ్లల్లోనే నహుషుడికి అహంకారం పెరిగింది. ఇపుడు నేను ఇంద్రుణ్ణి కనుక ఇంద్రుని భార్య ఇంద్రాణి కూడా నాకే చెందాలని ఆమెకు కబురు పెట్టాడు. దీనికి ఇంద్రాణి కలత చెందింది. ఆమె ఇంద్రుని తప్ప మరొకరిని చూడనని ఈ నహుషుడి బారినుంచి తప్పించమని బృహస్పతిని వేడుకుంది.

09/24/2017 - 21:51

‘‘త స్మద్వాఏతస్మాదాత్మనః ఆకాశస్సంభూతః ఆకాశాద్వాయుః వాయోరగ్నిః అగ్నేరాపః అద్భ్యః పృథివీ పృథివ్యా ఓషధయః ఓషధీభోన్నం అన్నాత్పురుషః సవా ఏష పురుషోన్నరసమయః’’ పరబ్రహ్మతత్త్వం నుండి ఆకాశము ఉద్భవించింది. ఆకాశము నుండి వాయువు, వాయువునుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలము నుండి భూమి, భూమి నుండి ఓషధులు, ఓషధులనుండి అన్నము (ఆహారము), అన్నము నుండి ప్రాణి పుడుతున్నాయి. పురుషాది ప్రాణికోటి అంతా అన్నరసమయము.

09/17/2017 - 21:19

శ్రీ దేవీ భాగవతము, శ్రీదేవీ సప్తశతి, మహావిద్యా, ఆదిశంకరుల సౌందర్యలహరి, త్రిపుర సుందరీ మానస పూజాస్తోత్రం, మంత్ర మాతృకాపుష్ప మాలాస్తవం, లలితా సహస్రనామం వంటి గ్రంథాలన్నీ ఏకకంఠంతో కీర్తించే ఆదిపరాశక్తిని అఖిలాండేశ్వరీ అఖిల భువనభాండాగారాలను తన కన్ను సన్నులలో వీక్షించి లక్షించే జగదంబను వివిధ రూపాలలో అర్చించడం ఆశ్వీజమాసంలో సంప్రదాయం.
మొదటి రోజు బాలాత్రిపుర సుందరిదేవి

09/17/2017 - 21:17

ఏది ఏమైనా ఎవరి ధీశక్తి వారిదే అనుకోండి. కాని ఈ దమయంతి ఇలా ఉండడానికి పూర్వజన్మ గురించి తెలుసుకోవాలన్న జిజ్ఞాస కలుగుతుంది. అది సరే. ఇప్పటిమాట - ద్రౌపది పంచభర్తృక అని కర్ణుని లాంటి వాళ్ల చేత పరిహసించబడింది. ఈ స్థితికి కారణం మాత్రం ఆమె పూర్వజన్మనే.

09/17/2017 - 21:13

ప్రభావతి చేతికి కృష్ణయ్యనే దొరికాడు. అతడిని పట్టుకుని కోపంతో కనులెర్ర చేసి ఇంకోసారి మా ఇంటి పాలుపెరుగు మననివ్వకపోతే మీ అమ్మతో చెప్పి దండిస్తానని బెదరించింది. మాయా మానుష వేషధారి కృష్ణయ్య ఆమెకు భయపడుతూ ‘ఇంకోసారి మీ ఇంట రానులే.. ’ అంటూ ఆమె నుంచి తప్పించుకుని వెళ్లిపోయాడు.

Pages