S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

08/20/2017 - 23:28

మూషికవాహనరూపా
ముల్లోకాలకు అధినేతా
మానవజీవిత మర్మాన్ని
ఒక్క వాహనరూపుతో
ఎరుక పరిచి
ముక్కోటి దేవతలకు
ఆదిదేవునివయ్యావు

విఘ్నాలను హరియంచి
లగ్నాలను నడిపించి
ముప్పతిప్పలు పడే మాకు
ముందుచూపు నేర్పావు

గరిక ప్రియుడివి నీవు
గణాథ్యక్షునివి నీవు
గమ్యం చేరడానికి దిక్చూచి నీవు
గండాలకు అధిదేవుడివే నీవు

08/20/2017 - 23:26

గణనాధా
గణాంకాల కూడికలు
తీసివేతలతో
కాలయాపన చేస్తూ
ఎప్పుడో మంచికాలం వస్తుందని
ఎదురుచూస్తున్న అమాయకులం

ఒక్కటి ఎక్కువైతే తప్పు
ఒక్కటి తక్కువైతే ముప్పు
ఇలా ముప్పతిప్పలు పడుతున్న మాకు
నీ రాక ఎంత ఆనందమో చెప్పలేము

గరిక తీసికొని
గిరినెక్కించే దేవుడా
నిరంతరమూ నిన్ను తలచుకున్నా

08/20/2017 - 23:23

ఋగ్వేదంలో గణపతి వేదాలకు, జ్ఞానములకు, కర్మిష్టులకు, సర్వ వ్యాపక శక్తులకు ప్రభువని సర్వగణాలకు అధిదేవతని, సర్వాహ్లాదకరుడని సర్వులకు జ్యేష్టుడని, అధినాయకుడని, ఉత్తమ కీర్తి సంపన్నుడని కీర్తించబడ్డాడు.

08/20/2017 - 23:21

గణపతికి ప్రీతికరమైన సంఖ్య 21. అందుకే మనం ఆయనను 21 రకాల పత్రాలతో పూజిస్తాము. ఆధ్యాత్మిక పరంగా పంచభూతాలు ఐదు, పంచజ్ఞానేంద్రియాలు ఐదు, పంచ కర్ణేంద్రియాలు ఐదు, పంచ తన్మాత్రలు ఐదు, మనస్సు ఒకటి. మొత్తం 21. వీటితో కూడిన శరీరాన్ని వినాయక రూపమగు పరబ్రహ్మకు సమర్పించుటయే 21 రకాల పత్రములతో మనం వినాయకునకు చేసే పత్ర పూజ అర్థం. అంతేకాదు, ఈ 21 పత్రాలలో ఔషధీ మహిమ అపారం.

08/20/2017 - 23:19

మ్రాన్పడి చూస్తున్న మహేంద్రుని మరణం గూర్చి నేనుభయపడడం లేదు వీరునివై మెలుగు మరొకసారి ప్రోత్సహించాడు. నా ఈశూలాగ్రంతో నిన్నుపొడిచి నీ మాంసాన్ని కాకులకు గ్రద్ధలకు వేస్తాను. ఒకవేళ నన్ను నిగ్రహించి నీవు నీ వజ్రాయుధంతో నన్ను యమసదనానికి పంపిస్తే ఈ పంచభూతాల్లో శాంతియుతంగా కలసిపోతాను అని అంటూనే తన మనసును మహావిష్ణువుపై నిలిపాడు.

08/20/2017 - 23:14

పూతనకు ప్రాణాలు లాగివేస్తున్నట్టు అనిపించింది కూర్చున్న చోటునుంచి వీధిలోకి పరుగెత్తింది. అంతలో పరమాత్మ ప్రాణాలు తోడివేశాడు గట్టిగా ఆర్తనాదం చేస్తూ పుడమిపై పడిపోయింది పూతన. సౌందర్యరాశిగా చిన్ని వయస్సులోని ముగ్ధయైన గోపికగా ఉన్న పూతన భారీకాయంతో, కోరలతో, వికృతాకారంతో నేలపై పడి ప్రాణాలు విడిచింది. ఆ వికృత శరీరిణిపై కూర్చుని ఏమి తెలియని చిన్నారి బాలునిలాగా కృష్ణయ్య చేతులు కాళ్లు ఆడిస్తున్నాడు.

08/13/2017 - 21:48

శ్రీకృష్ణపరమాత్మ శ్రీమహావిష్ణువు పదహారు కళల్లో మూర్త్భీవించిన పూర్ణావతారం. పుట్టిన నాటి నుంచి మరణించేంతవరకూ అడుగడుగునా భక్త సంరక్షణార్థం, లోక కళ్యాణార్థం ఎనె్నన్నో మహిమలు చూపుతున్నట్టుగా ఎన్నో సంస్కరణలు చేశాడా కృష్ణమూర్తి.
శ్రీరాముడు నవమినాడు జన్మిస్తే, శ్రీకృష్ణుడు అష్టమినాడు జన్మించాడు. నలుగురికోసం మంచి కోసం ధర్మసంస్థాపన కోసం ఆ ఇద్దరూ ఎన్నో అవస్థలు పడ్డారు.

08/13/2017 - 21:39

లీలామానుషవేషధారి నందుని కుమారుడుగా నందవ్రజంలో అందరికీ పరిచయం అయ్యాడు. యశోదమ్మ గారాల తనయుడుగా అందరికీ ముద్దుబిడ్డడైనాడు. దేవకీ వసుదేవులకు పుణ్యాల పంటగా, కంసునికి యమవదనంగా చెరసాలలో పుట్టాడు. పుట్టిన తొలినాటి నుంచి అద్భుతసంఘటనలను తెరదీస్తునే ఉన్నాడు. దుష్టులకు కంటిమీద కునుకు లేకుండా చేశాడు.

08/13/2017 - 21:29

యశోదమ్మ చిన్ని కుమారుడు నందవ్రజానికే తలమానికమైనాడు. ఆబాలగోపాలాన్ని అలరిస్తుండేవాడు. గోపికలను ఆటపట్టించేవాడు. తన తోడి సంగడీలకు ఇంట్లోని వెన్నమీగడలు పెట్టేవాడు. వారంతా కృష్ణయ్యతో ఆడుకోవడానికే మక్కువ చూపేవారు. తన బృందాన్నంతా తీసుకొని రేపల్లె అంతాతిరుగుతూ అందరి ఇండ్లల్లోని వెన్నమీగడలు దొంగలించుకుంటూ తిరుగుతు తిరిగేవాడు. అట్లాంటి కృష్ణయ్య ఎన్నో చిలిపిపనులు చేసేవాడు.

08/13/2017 - 21:27

యోగమాయ చెప్పింది వినిన కంసుడు దేవకీవసుదేవులను కారాగార విముక్తులను చేశాడు. వసుదేవుని పాదాలపై బడి బావా! నేను మూర్ఖత్వంతో మిమ్మల్నిద్దరినీ బాధపెట్టాను. నేను ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్నా కూడా ఆ మహావిష్ణువు ఎక్కడో పుట్టాడట. మీకే పుడతాడని చెప్పిన ఆకాశవాణి పలుకులు నేనునమ్మాను. అందుకే మీకీ చెరచాలవాసం విధించాను. కాని ఆ ఆకాశవాణి మాటలు కూడా నేడు కల్లలని తెలిసాయి కదా.

Pages