S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/14/2020 - 03:53

పాడేరు, ఏప్రిల్ 13: ప్రపంచాన్ని గడగడలాడిస్తూ కరోనా వైరస్ విశాఖ మన్యం దరి చేరలేదు. కరోనాను కట్డడి చేసేందుకు పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి డి.కె.బాలాజీ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలతో ఈ భయంకర రక్కసి గిరిజన ప్రాంతంలో అడుగు పెట్టకపోవడంతో ఈ ప్రాంతవాసులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

04/14/2020 - 03:51

ముంబయి: కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో, లాక్ డౌన్‌ను కేంద్రం కనీసం మరో వారం రోజులు పొడిగిస్తుందన్న వార్తల నేపథ్యంలో, సోమవారం కూడా భారత స్టాక్ మార్కెట్లలో పతనం తప్పలేదు. కేంద్ర విధించిన లాక్ డౌన్ ఈనెల 14వ తేదీతో ముగుస్తుంది. అయితే, మరో వారం లేదా రెండు వారాలు కొనసాగించే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

04/14/2020 - 03:50

శ్రీశైలం: శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీ భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లకు పరోక్ష ఆర్జిత సేవలను ప్రవేశపెట్టినట్లు ఈఓ రామారావు తెలిపారు. సోమవారం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, ఈఓ పరోక్ష ఆర్జితసేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ స్వామివారి దర్శనానికి స్వయంగా రాలేని భక్తులు అన్‌లైన్‌లో సేవా రుసుం చెల్లించి ఆర్జిత సేవలను పరోక్షంగా జరిపించుకోవచ్చుని తెలిపారు.

04/14/2020 - 03:47

విజయవాడ పశ్చిమ, ఏప్రిల్ 13: కష్టకాలంలో ప్రతి ఒక్కరూ కాపు కాసి యూతనివ్వాలని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. సోమవారం చిట్టినగర్‌లోని శ్రీగౌతమ్ విద్యాలయం స్మార్ట్ క్యాంపస్‌లో మంత్రి చేతుల మీదుగా బియ్యం, నిత్యావసర సరుకుల పంపిణీ జరిగింది. గౌతమ్ విద్యాసంస్థల అధినేత ఎన్ సూర్యారావు ఆధ్వర్యంలో 300 కుటుంబాలకు ఈ కిట్‌లు అందించారు.

04/14/2020 - 03:35

మచిలీపట్నం : గత ఐదు రోజులుగా స్థిరంగా ఉన్న కరోనా పాజిటివ్ కేసుల్లో మళ్లీ పెరుగుదల కనిపించింది. ఐదు రోజులుగా 35 పాజిటివ్ కేసులకే పరిమితమైన జిల్లాలో సోమవారం ఒకే ఒక్క పాజిటివ్ కేసు నమోదైంది. అది కూడా విజయవాడ నగరంలో కావడం విశేషం. గతంలో పాజిటివ్ వచ్చిన భర్త నుండి భార్యకు వ్యాధి సంక్రమించింది. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 36కు చేరింది.

04/14/2020 - 03:33

గుంటూరు, ఏప్రిల్ 13: గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకూ విస్తరిస్తోంది. ఢిల్లీలో ప్రార్థనలకు వెళ్లివచ్చిన వారందరూ ఐసోలేషన్, క్వారంటైన్‌లకు పంపిన అనంతరం కూడా రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే జిల్లాలో సోమవారం నాటికి 93 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇందులో సోమవారం ఒక్కరోజే 8 పాజిటివ్ కేసులు నిర్ధారణ కావడంతో బాధితుల సంఖ్య వందకు చేరుతోంది.

04/14/2020 - 03:32

గుంటూరు (అరండల్‌పేట), ఏప్రిల్ 13: గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు కరోనా సెగ తగిలింది. వైద్యశాలలోని గుండె శస్త్ర చికిత్స విభాగంలో ఇటీవల చికిత్స పొందిన తెలంగాణకు చెందిన ఓ వ్యక్తికి ఆదివారం సాయంత్రం కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో అతనికి చికిత్స అందించిన వైద్యులు, నర్సులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి తన పనుల నిమిత్తం ఈనెల 8వ తేదీన విజయవాడకు వచ్చారు.

04/14/2020 - 03:31

గుంటూరు, ఏప్రిల్ 13: ప్రాణాంతక మహమ్మారి కోవిడ్-19 విస్తరిస్తున్నప్పటికీ రాజధాని ఉద్యమం పేరిట బయట తిరుగుతూ, ఒకరినొకరు కలుసుకోవడాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణించారు. సోమవారం ఈ మేరకు రాజధాని పరిధిలోని వెంకటపాలెం గ్రామస్తులకు పోలీసులు నోటీసులు జారీచేశారు.

04/14/2020 - 03:31

గుంటూరు, ఏప్రిల్ 13: కోవిడ్-19 నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలో అమలవుతున్న లాక్‌డౌన్ సమయంలో అత్యవసర సేవలకు అంతరాయం లేకుండా ఉండేందుకు పోలీసుల నుండి పాస్‌లు మంజూరు చేయనున్నట్లు రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోందని, లాక్‌డౌన్ సమయంలో ప్రజల నుండి పూర్తి సహాయ సహకారాలు అందుతున్నాయని తెలిపారు.

04/14/2020 - 03:30

విజయవాడ(సిటీ), ఏప్రిల్ 13: ప్రపంచ దేశాలన్నింటిని గడగడలాడిస్తున్న కరోనాను కూడా రాజకీయ లబ్దికి వాడుకోవడం ఒక్క వైసీపీకే చెల్లిందని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ విమర్శించారు. జై అమరావతి అన్న రైతులపై కరోనా నిబంధనలను అంటూ నోటీసులు ఇస్తున్న పోలీసులు, వైసీపీ నేతలకు మాత్రం నిబంధనలు పట్టవా అంటూ సోమవారం ట్విట్టర్‌లో ఆరోపించారు.

Pages