S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/23/2016 - 21:13

మనకు ఆకలేస్తే వేడి వేడి అన్నంలో పప్పు, నెయ్యి, పచ్చడి, కూర కలుపుకొని కడుపునిండా తింటాం. పదార్థాలు రుచిగా ఉంటే మరో నాలుగు ముద్దలు లాగించేస్తాం. ఇవీ దొరక్కపోతే దోశ, ఇడ్లీ, ఉప్పా వంటి అల్పాహారాలను తింటాం. కాని ఈ 92ఏళ్ల సుదామాదేవి మాత్రం ఇసుక తినేస్తోంది. రోజుకు కిలో చొప్పున ఇసుక తిని తన ఆకలి తీర్చుకుంటుంది. పేదరికం కారణంగా అన్నం లభించక సుదామాదేవి ఈ పని చేయటం లేదు. ఆమె ఆహారమే ఇసుక.

11/23/2016 - 21:11

చలికాలంలో సౌందర్యం ఇనుమడించేలా ఆరోగ్యంగా ఉండాలంటే అభ్యంగన స్నానం ఆచరించక తప్పదు. అభ్యంగన స్నానం తరతరాల నుంచి వస్తున్న సంప్రదాయమే. అయినా, ఆసక్తి తరిగిపోవడానికి కారణం సమయం సరిపోడకనో! నివాస స్థలంలో వీలు పడకనో! చర్మ సౌందర్యానికి ఎంతో ఖర్చుతో కూడుకున్న కాస్మొటిక్స్ వాడి సైడ్ ఎఫెక్ట్స్ చేతులారా కొనితెచ్చుకునే బదులు సహజమైన అభ్యంగనస్నానం చేయడం మంచిది.

11/23/2016 - 04:52

పరవాడ, నవంబర్ 22: సంక్రాంతి దినాల్లో కనిపించే హరిదాసులు కార్తీకమాసంలో వీధుల్లో సంచరిస్తున్నారు. సంక్రాంతి సమయంలోనే హరిదాసులు గ్రామాల్లో కనిపించడంతో పాటు ప్రజలు ఇచ్చే కానుకలను స్వీకరించే వారు. నేడు దీనికి బిన్నంగా కార్తీకమాసంలో హరిదాసులు పరవాడ పరిసర గ్రామాల్లో సంచరించడం జరుగుతుంది. కార్తీకమాసం నెల రోజులు గ్రామాల్లో హరిదాసులు తిరుగుతూ ప్రజలు ఇచ్చే కానుకులను స్వీకరించడం జరుగుతుంది.

11/23/2016 - 04:51

విశాఖపట్నం (కల్చరల్), ఆరిలోవ, నవంబర్ 22: ప్రఖ్యాత కర్నాటక సంగీత విద్వాంసుడు, నటుడు, గాయకుడు మంగళంపల్లి బాల మురళీకృష్ణ ఆకస్మిక మరణం సంగీతాభిమానులను హతాశులను చేసింది. తెలుగు సంగీత ప్రియుల గుండెల్లో చిరస్మరణీయులై ఎన్నో భక్తి గీతాలు, 25వేలకు పైగా కచేరీలు చేసిన బాలమురళి కర్నాటక సంగీతంతో పాటు పలు సినీ గీతాలను ఆలపించారు. భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ బిరుదులతో ఆయన్ను గౌరవించింది.

11/23/2016 - 04:50

నర్సీపట్నం, నవంబర్ 22: మైదాన ప్రాంత గిరిజనులు సాగు చేసుకున్న భూములకు సాగు పట్టాలు తక్షణమే పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ సి.పి. ఎం. ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. డివిజన్‌లోని పలు మండలాల నుండి తరలివచ్చిన సాగుదారులు, పేద రైతులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి ఆర్డీవో సూర్యారావుకు వినతి పత్రం అందజేసారు.

11/23/2016 - 04:49

విశాఖపట్నం (స్పోర్ట్స్), నవంబర్ 22: ఈనెల 25 నుంచి మూడు రోజుల పాటు కల్నల్ సికే నాయుడు స్టేడియంలో జరగనున్న జాతీయ అంతర్ జిల్లా జూనియర్ అథ్లెటిక్స్ (నిడ్‌జామ్) ఏర్పాట్లను కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్ అధికారులతో మాట్లాడుతూ క్రీడా పోటీలను విజయవంతం చేసేందుకు కమిటీలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

11/23/2016 - 04:48

చోడవరం, నవంబర్ 22: గోవాడ షుగర్స్ పరిధిలోని చెరకును లారీలపై ఇతర జిల్లాలకు తీసుకెళుతుండగా ఫ్యాక్టరీ సిబ్బంది ఆ లారీలను అడ్డుకున్న సంఘటన మంగళవారం స్థానిక గోవాడ షుగర్స్ కేన్‌యార్డు వద్ద చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలావున్నాయి. గోవాడ సహకార చక్కెర కర్మాగారం పరిధిలోని చెరకు గత కొన్నిరోజులుగా శ్రీకాకుళం జిల్లా పాలకొండకు తరలిపోతున్న సంగతి తెలిసిందే.

11/23/2016 - 04:47

కొయ్యూరు,నవంబర్ 22: దశాబ్దాల కాలంగా సాగులో ఉన్న పోడు, బంజరు భూములకు వెంటనే పట్టాలు మంజూరు చేయాలని సి.పి. ఐ. జిల్లా కార్యదర్శి ఎ.జె.స్టాలిన్ డిమాండ్ చేసారు. మంగళవారం సి.పి. ఐ. ఆధ్వర్యంలో పోడు భూములకు పట్టాలివ్వాలని డిమాండ్ చేస్తూ రాజేంద్రపాలెం నుండి తహశీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆక్కడ కొద్ది సేపు ధర్నా నిర్వహించారు.

11/23/2016 - 04:46

అనకాపల్లి, నవంబర్ 22: గ్రామాల్లో వౌలిక వసతుల మెరుగుకు పుష్కలంగా నిధులు సమకూర్చనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ తెలిపారు. జనచైతన్య యాత్రలో భాగంగా మండలంలోని సుందరయ్యపేట, వెంకుపాలెం, సీతానగరం, రొంగలివానిపాలెం, మొండిపాలెం తదితర గ్రామాల్లో ఎమ్మెల్యే మంగళవారం విస్తృతంగా పర్యటించి ఆయా ప్రాంతాల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

11/23/2016 - 04:46

గూడెంకొత్తవీధి, నవంబర్ 22: విశాఖ మన్యంలో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. వరుసగా మూడు రోజుల నుండి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో బయటకు వచ్చేందుకు ప్రజలు భయపడుతున్నారు. చలితో కూడిన గాలులు , పొగ మంచు దట్టంగా ఉండడంతో ప్రజలు వ్యవసాయ పనులకు వెళ్ళేందుకు ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్ళేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 10 గంటలు దాటితే కాని పొగ మంచు వీడడం లేదు.

Pages