S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/23/2016 - 04:47

బార్సిలోనా, సెప్టెంబర్ 22: బార్సిలోనా సాకర్ క్లబ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అర్జెంటీనా సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీ గాయం తిరగబెట్టింది. ఫలితంగా అతనికి మూడు వారాలు విశ్రాంతి అవసరమని వైద్యులు ప్రకటించారు. స్పానిష్ సాకర్ చాంపియన్‌షిప్ లా లిగాలో భాగంగా అట్లెటిక్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడుతున్నప్పుడు కాలి కండరాలు బెణకడంతో అతను మైదానాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది.

09/23/2016 - 04:46

రియో పారాలింపిక్స్‌లో పాల్గొని గురువారం స్వదేశానికి తిరిగి వచ్చిన జావెలిన్ త్రోయర్ దేవేంద్ర ఝజారియా. జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించిన దేవేంద్రతోపాటు, పారాలింపిక్స్ విజేతలకు విమానాశ్రయంలో కేంద్ర క్రీడా మంత్రి విజయ్ గోయల్ తదితరులు ఘన స్వాగతం పలికారు

09/23/2016 - 04:40

హైదరాబాద్, సెప్టెంబర్ 22: మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి సురక్షితమైన మంచినీటిని అందించడం ద్వారా నీటి సంబంధిత వ్యాధులు తగ్గుతాయని మిషన్ భగీరథ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశం గురువారం జరిగింది. సమావేశంలో మిషన్ కాకతీయ పనుల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేసింది.

09/23/2016 - 04:39

హైదరాబాద్, సెప్టెంబర్ 22: హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండిఏ) పరిధిలో ఏకీకృత జోనింగ్ రెగ్యులేషన్స్ విధానాలను త్వరలో తేనున్నట్లు ఆ సంస్థ కమిషనర్ టి చిరంజీవులు ప్రకటించారు. ప్రస్తుతం హెచ్‌ఎండిఏ పరిధిలో ఐదు రకరకాల మాస్టర్ ప్లాన్స్ అమలులో ఉన్నాయని, వీటిని అనుసంధానం చేసేందుకు మూడు అంచెల ప్రణాళికను రూపొందించామన్నారు.

09/23/2016 - 04:36

మిర్యాలగూడ, సెప్టెంబర్ 22: శిక్షణ పూర్తిచేసుకుని, నియామకం కోసం ఎదురుచూస్తున్న సబ్ ఇన్‌స్పెక్టర్ అనూహ్యంగా ఆత్మహత్య చేసుకున్న సంఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగింది. పోలీసుల కథనం తమ్మడబోయిన కిరణ్ (28) 2012లో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికై, ఉద్యోగం చేస్తూనే రైల్వే పోలీస్ ఎస్‌ఐ ఉద్యోగానికి ఎంపికై, దేహ దారుఢ్య పరీక్షల్లో నెగ్గి ఉద్యోగం సాధించాడు.

09/23/2016 - 04:33

హైదరాబాద్, సెప్టెంబర్ 22: కండిషన్ బస్సులతో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించనున్నట్టు ఆర్టీసి చైర్మన్ సోమారపు సత్యనారాయణ తెలిపారు. ఆర్టీసిలో ప్రమాదాలు జరుగకుండా ఉండాలంటే డ్రైవర్లు, మెకానిక్‌ల పాత్ర కీలకమన్నారు. గురువారం మిధాని డిపోను సందర్శించిన సందర్భంగా ఆయన కార్మికులకు పలు సూచనలు చేశారు.

09/23/2016 - 04:31

హైదరాబాద్, సెప్టెంబర్ 22: తెలంగాణ శాసనసభలో టిడిఎల్‌పి, టిఆర్‌ఎస్ శాసనసభాపక్షంలో విలీనమైనట్లు స్పీకర్ ప్రకటించడం రాజ్యాంగ విరుద్ధమని, ఈ విషయమై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్వాగతిస్తున్నట్లు మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి, టిపిసిసి అధికార ప్రతినిధి మల్లురవి ఆరోపించారు. రాజ్యాంగ విధులను నిర్వహించడంలో స్పీకర్ విఫలమయ్యారన్నారు. నైతికత, రాజ్యాంగం, న్యాయపరంగా స్పీకర్ విఫలమయ్యారని వారు పేర్కొన్నారు.

09/23/2016 - 04:30

హైదరాబాద్, సెప్టెంబర్ 22: మెదక్ జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న ఎస్‌ఐ వి రామకృష్ణారెడ్డి కేసులో డిఎస్పీ, సర్కిల్ ఇనెస్పెక్టర్ పేర్లను కూడా ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. తన భర్త ఆత్మహత్య కేసును సిబిఐ చేత విచారించాలని మరణించిన ఎస్సై భార్య ధనలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు జడ్జి జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు విచారించారు.

09/23/2016 - 04:28

హైదరాబాద్, సెప్టెంబర్ 22: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పాటు, జిల్లా కేంద్రాలు, రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో వేలాది మంది చిన్నపిల్లలు బిచ్చగాళ్లుగా జీవితం కొనసాగిస్తున్నారు. కొంతమందిని వారి తల్లిదండ్రులే యాచక వృత్తిలోకి దింపుతుండగా, మరికొందరు అనాధలు దిక్కులేక ఈ వృత్తిని చేపడుతున్నారు.

09/23/2016 - 04:25

హైదరాబాద్, సెప్టెంబర్ 22: తాము చేస్తున్న దోపిడీ బయటి ప్రపంచానికి తెలుస్తుందన్న ఉద్దేశ్యంతోనే కెసిఆర్, హరీష్‌రావులు కృష్ణా నదీ జలాల నిర్వహణ బోర్డుకు పాలమూరు, డిండి ప్రాజెక్టుల డిపిఆర్‌లు ఇవ్వడం లేదని తెలుగుదేశం పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. నీటి లభ్యత లేకుండానే కమిషన్లకు కక్కుర్తిపడి అడ్డగోలుగా ప్రాజెక్టులు నిర్మిస్తే ఎవరూ ఊరుకోరని వ్యాఖ్యానించారు.

Pages