S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/18/2016 - 02:03

కాకినాడ, జూలై 17: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలోని షన్ని గ్రామ పంచాయతీల్లో మీ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని జెసి ఎస్ సత్యనారాయణ తెలిపారు. ఇప్పటికే మీ సేవా కేంద్రాలు పనిచేస్తున్న గ్రామాలు మినహా మిగిలిన పంచాయతీల్లో మీ సేవా కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 23వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

07/18/2016 - 02:02

ఆలమూరు, జూలై 17: మండల కేంద్రం ఆలమూరులోని ప్రాథమిక హెల్త్ న్యూట్రిన్ సెంటర్ (పిహెచ్‌ఎన్‌సి)ను ఆదివారం నుండి తొలగించినట్లు ఆ కేంద్రానికి ఉత్తర్వులు అందాయి. ఈ కేంద్రం గత రెండు సంవత్సరాల క్రితం ప్రారంభించారు. గ్రామీణులకు ఆరోగ్యాన్ని అందించే లక్ష్యంగా ప్రారంభించిన ఈ కేంద్రం ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించలేకపోవడంతో అందులో పనిచేస్తున్న సిబ్బందిని పలు ప్రాంతాలకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

07/18/2016 - 02:02

కాకినాడ, జూలై 17: జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించే డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని రద్దుచేశామని జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ తెలిపారు. ప్రజావాణిలో యధావిధిగా ఉదయం 10 గంటల నుండి విజ్ఞాపనలు స్వీకరిస్తామని కలెక్టర్ తెలిపారు.

07/18/2016 - 02:01

అయినవిల్లి, జూలై 17: ప్రతి విషయం కార్యకర్తలకు చెప్పి చేయాలంటే ఏ పనికి పూర్తిగా న్యాయం చేయలేమని పి గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి అన్నారు. ఆదివారం ముక్తేశ్వరంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే దృష్టికి కార్యకర్తలు కొన్ని సమస్యలు తీసుకొచ్చారు. స్థానిక కార్యకర్తలకు తెలియకుండా బయట కార్యకర్తల ద్వారా కొన్ని పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యేను నిలదీశారు.

07/18/2016 - 02:00

మదనపల్లె, జూలై 17 : మదనపల్లె మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా చెత్తను తరలించే వాహనాలు మూలనపడి తుప్పుపడుతూ ఎందుకూ పనికిరాని దుస్థితిలో ఉన్నాయి. వివరాలిలా ఉన్నాయి. మదనపల్లె పట్టణంలోని 35 వార్డులలో 2.40 లక్షల మంది జనాభా ఉన్నారు. మున్సిపల్ పారిశుద్ధ్య శాఖ పట్టణంలోని చెత్తాచెదారాన్ని తొలగించేందుకు ట్రాక్టర్లు, మినీ జెసిబి, రిక్షాలు, ఐషర్ వాహనాలు, జెసిఎంలు, ఆటోరిక్షాలు ఏర్పాటు చేసింది.

07/18/2016 - 01:59

తిరుపతి, జూలై 17: చనిపోయిన వారి పేర్లతో అనర్హులైన వారికి పింఛన్లు ఇచ్చామంటూ పెద్దతిప్ప సముద్రం కార్యదర్శులు తమ చేతి వాటం ప్రదర్శించి రూ.3.50 లక్షలు గోల్ మాల్ చేశారని వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి వందవాసి నాగరాజు, ఉపాధ్యక్షురాలు జి.అరుణలు ఆరోపించారు.

07/18/2016 - 01:59

తిరుమల, జూలై 17: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామికి మంగళవారం నిర్వహించే అర్చన సేవా టిక్కెట్లను టిటిడి జారీ చేయనుంది. శ్రీవారికి బుధవారం నిర్వహించనున్న సేవకు సంబంధించి టిక్కెట్లను భక్తులకు కేటాయించనుంది. ఈ మేరకు అర్చన (18) టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి.

07/18/2016 - 01:58

శ్రీ కాళహస్తి, జూలై 17: వ్యవసాయం చేసే రైతులకు అన్ని విధాలా సహాయపడతామని రాష్ట్ర అటవీశాఖామంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఆదివారం హామీ ఇచ్చారు. ఆదివారం తొట్టంబేడు మండలంలో జరిగిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ వరి పంటేకాకుండా ఇతర పంటలను కూడా పండించాలని రైతులకు సూచించారు. వ్యవసాయానికి సంబంధించిన యంత్రసామగ్రి, పనిముట్లను ప్రభుత్వం ద్వారా అందజేస్తామన్నారు.

07/18/2016 - 01:57

తిరుపతి, జూలై 17: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఆదివారం స్వామివారికి కవచ సమర్పణతో జ్యేష్ఠ్భాషేకం ఘనంగా ముగిసింది. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారు కల్యాణ మండపంలోని వేంచేపే చేశారు. ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు శతకలశ స్నపనం వైభవంగా నిర్వహించారు.

07/18/2016 - 01:57

తిరుమల, జూలై 17: తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తుల సౌకర్యార్థం మొత్తం 2వేల ర్యాక్‌లతో అదనంగా లగేజి, పాదరక్షల డిపాజిట్ కౌంటర్లు ఏర్పాటుచేయాలని టిటిడి కార్యనిర్వాహణాధికారి డాక్టర్ డి సాంబశివరావు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. తిరుమలలో ఆదివారం ఇ ఓ కల్యాణకట్ట, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, పి ఏసి -4, తదితర ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.

Pages