S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/03/2016 - 08:07

శ్రీకాకుళం(కల్చరల్), జూలై 2: శ్రీకాకుళం రంగస్థలం కళాకారులు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ పేద కళాకారులకు పింఛన్లు అందించడం మంచి సేవా కార్యక్రమంగా చేస్తున్నారని విశ్రాంతి సి ఇవో సురంగి మోహనరావు అన్నారు. శనివారం స్థానిక బాపూజీకళామందిర్‌లో శ్రీకాకుళం రంగ స్థల కళాకారుల సమాఖ్య ఆధ్వర్యంలో 201వ నెల సంస్కృతిక కార్యక్రమం జరిగింది.

07/03/2016 - 08:07

శ్రీకాకుళం(రూరల్), జూలై 2: రక్తదానం మరొకరికి ప్రాణదానం వంటిదని జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం అన్నారు. శనివారం పెద్దపాడు రోడ్డులోని స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీసులో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రక్తంలేక మరణాలే సంభవించకుడదని రక్తదానాన్ని ఒక ఉద్యమంలా చేపట్టాలన్నారు.

07/03/2016 - 08:06

శ్రీకాకుళం(రూరల్), జూలై 2: పుష్కరాల నెపంతో విజయవాడ నగరంలో వందల సంవత్సరాల నాటి అత్యంత ప్రాచీనమైన 45 హిందూ దేవాలయాలను రాష్ట్ర ప్రభుత్వం కూల్చి వేయడంపై విశ్వ హిందూ పరిషత్ జిల్లా శాఖ ఆందోళన వ్యక్తంచేశారు.

07/03/2016 - 08:04

శ్రీకాకుళం(టౌన్), జూలై 2: జిల్లాలో అర్హులైన వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు అందజేస్తున్న పింఛను బట్వాడాలో ఎంపిడివోలు జిల్లా కలెక్టర్‌ను సైతం మభ్యపెడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హైపవర్ కమిటీ రాష్ట్ర సభ్యులు తమ్మినేని సీతారాం విమర్శించారు.

07/03/2016 - 08:04

(ఆంధ్రభూమి బ్యూరో - శ్రీకాకుళం)

07/03/2016 - 08:00

నెల్లూరు రూరల్, జూలై 2: తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు విడతలవారీగా రుణమాఫీ చేస్తుంటే ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు రుణమాఫీ జరగడం లేదంటూ దుష్ప్రచారం చేయడం తగదని ఆదాల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. శనివారం నెల్లూరు మండల పరిధిలోని ములుముడి గ్రామంలో ఆయన పర్యటించారు.

07/03/2016 - 07:59

నెల్లూరు, జూలై 2: విద్యార్థులు తమకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటేనే భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని నగర డిఎస్‌పి జివి రాముడు పిలుపునిచ్చారు. మన ఊరు - మన పోలీసు కార్యక్రమంలో భాగంగా రెండవ నగర పోలీసులు తమ పరిధిలోని బోడిగాడితోట, వైకుంఠపురం చుట్టుపక్కల ప్రాంతాలను దత్తత తీసుకున్నారు.

07/03/2016 - 07:57

నెల్లూరు, జూలై 2 : ఆరుగాలం కష్టించే రైతుల కళ్లల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందుకోసం రైతుల జీవితాలకు భరోసా కల్పిస్తూ అధికారం చేపట్టగానే ప్రకటించిన రైతు రుణమాఫీని ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలుకు శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి ప్రకటించిన ఈ బృహత్తర పథకం ప్రభుత్వానికి భారమైనా చిత్తశుద్ధితో అమలుకు ప్రభుత్వం కట్టుబడింది. ఫలితంగా రైతుల జీవితాలకు రుణమాఫీతో భరోసా కల్పించింది.

07/03/2016 - 07:56

ఒంగోలు, జూలై 2:జిల్లాలోని వెనుకబడిన గ్రామాలను ఎన్‌ఆర్‌ఐలు దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని ఒంగోలు పార్లమెంటుసభ్యుడు వైవి సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం అమెరికాలోని చికాగో నగరంలో జరిగిన ఆటా సదస్సులో ఎంపి సుబ్బారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. జిల్లాలో అనేక వెనుకబడిన గ్రామాలు ఉన్నాయని వాటి మీద ఎన్‌ఆర్‌ఐలు దృష్టిసారించి అభివృద్ధికి సహకరించాలని కోరారు.

07/03/2016 - 07:56

ఒంగోలు, జూలై 2: రాష్ట్రంలోని తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, అమరావతి, గుంటూరు, ఖమ్మం జిల్లాల్లో త్వరలో మంచిరోజులు చూసుకుని పాలను విక్రయించనున్నట్లు ఒంగోలు డెయిరీ చైర్మన్ చల్లా శ్రీనివాసరావు వెల్లడించారు. శనివారం రాత్రి వరకు సాగిన బోర్డుమీటింగ్ వివరాలను విలేఖర్లకు వెల్లడించారు. ఈ జిల్లాల్లో పాలను విక్రయించేందుకు ప్రత్యేకంగా జనరల్ మేనేజరును నియమించినట్లు చెప్పారు.

Pages