క్రీడాభూమి

వోగ్స్ డబుల్ సెంచరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్లింగ్టన్, ఫిబ్రవరి 14: న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్‌పై ఆస్ట్రేలియా పట్టు సంపాదించింది. ఆడం వోగ్స్ డబుల్ సెంచరీతో రాణించగా, మొదటి ఇన్నింగ్స్‌లో 562 పరుగుల భారీ స్కోరును సాధించిన ఈ జట్టు 379 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన కివీస్ మూడో రోజు, ఆదివారం ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ఓటమిని తప్పించుకోవాలంటే న్యూజిలాండ్ ఇంకా 201 పరుగులు చేయాలి. ఆరు వికెట్లు చేతిలో ఉన్నాయి. కివీస్ మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 183 పరుగులకే కుప్పకూలగా, ఆస్ట్రేలియా శనివారం ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్లకు 463 పరుగులు చేసింది. ఈ ఓవర్‌నైట్ స్కోరుతో ఆటను కొనసాగించి మరో 99 పరుగులు జోడించి, నాలుగు వికెట్లు చేజార్చుకుంది. వోగ్స్ డబుల్ సెంచరీ పూర్తి చేయడం మూడో రోజు ఆటలో ప్రధానాంశం. 364 బంతులు ఎదుర్కొన్న అతను 30 ఫోర్లు, 3 సిక్సర్లతో 239 పరుగులు సాధించాడు. అంతకు ముందు ఉస్మాన్ ఖాజా (140) శతకాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. పీటర్ సిడిల్ 49 పరుగులు చేయగా, కివీస్ బౌలర్లలో టిమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్, డౌగ్ బ్రాస్‌వెల్, కొరీ ఆందర్సన్, మార్క్ క్రెగ్ తలా రెండేసి వికెట్లు కూల్చారు. కాగా, తొలి ఇన్నింగ్స్‌లో 379 పరుగులు వెనుకంజలో ఉన్న న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టి, ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్లకు 178 పరుగులు చేసింది. లాథమ్ 63, గుప్టిన్ 45, కేన్ విలియమ్‌సన్ 22 పరుగులు చేసి అవుటయ్యారు. హెన్రీ నికోలస్ 31 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు.