క్రీడాభూమి

చిన్నపిల్లలా ప్రవర్తించినందుకు సిగ్గుపడుతున్నా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, జనవరి 25: పెద్దగా అరుస్తూ, బంతిని కాలితో తంతూ, ర్యాకెట్‌ను నేలకు విసురుతూ చిన్నపిల్లలా ప్రవర్తించినందుకు తాను సిగ్గుపడుతున్నానని ఆస్ట్రేలియా సంచలన క్రీడాకారిణి డరియా గవ్రిలోవా తెలిపింది. ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్‌లో మహిళల నాలుగో రౌండ్ మ్యాచ్‌లో స్పెయిన్‌కు చెందిన కార్లా సౌరెజ్‌ను గవ్రిలోవా ఢీ కొంది. మాస్కో (రష్యా)లో జన్మించిన ఆమె కొన్ని వారాల క్రితమే ఆస్ట్రేలియా పాస్‌పోర్టును సంపాదించింది. ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఆస్ట్రేలియా తరఫున ఆడుతూ మొదటి మూడు రౌండ్లలో చక్కటి నైపుణ్యాన్ని ప్రదర్శించి ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంది. అయితే, నాలుగో రౌండ్‌లో సౌరెజ్‌ను ఎదుర్కోలేక డీలాపడింది. మొదటి సెట్‌ను 6-0 తేడాతో గెల్చుకున్నప్పటికీ, ఆ ఆధిక్యాన్ని నిలబెట్టుకోలేక, తర్వాతి రెండు సెట్లను చేజార్చుకుంది. ఈ సెట్లు జరుగుతున్నంత సేపు ఆమె తీవ్ర అసహనాన్ని ప్రదర్శించింది. అయితే, తాను చేసిన పొరపాటును గుర్తించినట్టు గవ్రిలోవా ప్రకటించింది. గతంలో గ్రాండ్ శ్లామ్ టోర్నీని ఆడలేదని, అందుకే తీవ్రమైన ఒత్తిడికి గురయ్యానని ఈ 21 ఏళ్ల క్రీడాకారిణి తెలిపింది. తనమీద తనకే కోపం పెరిగిందని, అందుకే ప్రతి పాయింట్ వద్ద తాను చాలా విపరీతంగా స్పందించానని చెప్పింది. ఈ టోర్నీలో చాలా పాఠాలు నేర్చుకున్ననని, భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకుంటానని చెప్పింది.