మీ వ్యూస్

ఆకట్టుకోలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌతమ్‌మీనన్, నాగచైతన్య కాంబినేషన్‌లో వచ్చిన సాహసం శ్వాసగా సాగిపో నిరాశ పర్చింది. ఎంతో ఆలస్యంగా విడుదలైన ఈ చిత్రం ఆకట్టుకోలేదు. రొమాన్స్, ప్రేమలతో మొదటి సగం పేలవంగా సాగింది. హీరోయిన్ పెద్ద నెగిటివ్ పాయింట్. రెండో భాగంలో యాక్షన్ సన్నివేశాలతో నింపి బోర్ కొట్టించారు. క్లైమాక్స్‌కు, కథకు ఏం సంబంధం లేదు. ఫొటోగ్రఫీ, సంగీతం బాగున్నాయి. బాగా నానిన కథతోనే యాక్షన్, రొమాన్స్ కలిపి కొత్తగా చెప్పాలన్న ప్రయత్నం బెడిసి కొట్టింది. స్క్రీన్‌ప్లే, కామెడీలాంటి కమర్షియల్ అంశాలపై దర్శకుడు దృష్టిపెడితే బాగుండేది.
-సి ప్రతాప్, శ్రీకాకుళం
అభినందన
ప్రతి మంగళవారం వెనె్నల ఫ్లాష్‌బ్యాక్‌లో ‘ఇంటిగుట్టు’ సినిమా గురించి చదివాము. సివిఆర్ మాణిక్యేశ్వరి అందించిన సమాచారం బావుంది. గత ప్రాచీన చిత్ర వైభవాన్ని గుర్తు చేస్తున్నందుకు ధన్యవాదాలు. ఈ చిత్రంలో ఆర్ నాగేశ్వరరావు విలన్ పాత్ర గురించి రాయడం బావుంది. అప్పట్లో విలనిజాన్ని పండించటంలో ఆర్ నాగేశ్వరరావును మించిన వాళ్లు లేరు. ప్రత్యేకంగా ఎఎం రాజా గానం చేసిన ‘ఆడువారి మాటలు’ ప్రశంసనీయం. మల్లాది పాటలు హృద్యములు.
-శ్రీష్ట శ్రీనివాసశర్మ, వినుకొండ
గొప్పకాదు
ఏవీ అంత గొప్ప సినిమాలు వ్యాసం బాగుంది. హీలీవుడ్ సినిమాలు చూసే వారికి బాహుబలి సాధారణ సినిమానే. చైనా, కొరియా నుంచి వస్తున్న చిత్రాల్లాంటిదే బాహుబలి కూడా. అందుకే చైనా భాషలోకి అనువదించినా బాహుబలి ప్లాప్ అయ్యింది. జపాన్, జర్మనీల్లోనూ ప్లాపే. సింగిల్ స్టార్ రేటింగ్ మాత్రమే అయినా మనవాళ్లు హాలీవుడ్ స్థాయి సాధించినందుకు అభినందించాలి. మన దేశంలో కూడా బాహుబలి మూడు స్టార్ల చిత్రం తప్ప గొప్ప సినిమా మాత్రం కాదు.
-సదాప్రసాద్, గొడారిగుంట
ఫ్లాష్‌బ్యాక్
50 ఏళ్ల క్రితం వచ్చిన సినిమా సమీక్షలను తప్పనిసరిగా చదివి, అప్పటి విషయాలు తెలుసుకుంటున్నాం. 1965లో వచ్చిన ‘పక్కలోబల్లెం’ సినిమా గురించి ప్రచురించాలని కోరుతున్నాం. టాలీవుడ్ ఛానల్‌లో ఈ సినిమాను ప్రసారం చేశారు. కానీ కథంతా ‘సప్తస్వరాలు’ సినిమాలా ఉంది. ఇది 1969లో విడుదలైంది. పక్కలోబల్లెం 1965లో విడుదలైంది. చెప్పిన పేరొకటి ప్రదర్శించిన సినిమా మరొకటి. అందుకే పక్కలోబల్లెం సినిమా సమీక్షను కావాలని కోరుతున్నాం. అలాగే నాగేశ్వరరావు నటించిన ‘వసంతసేన’ సినిమా గురించి కూడా రాయాలని విజ్ఞప్తి.
-సుజాత,
ఉరుము ఉరిమి..!
ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు పెద్ద నోట్ల రద్దువల్ల ఎక్కువ నష్టం చిత్ర రంగానికే. ఈ పరిస్థితికి కారణం ప్రభుత్వం తగినన్ని చిన్న నోట్లు సరఫరా చేయలేకపోవడం. హాలీవుడ్‌లో చిన్నా పెద్దా అందరికీ పారితోషికాలను చెక్కుల రూపంలో ఇచ్చే సంప్రదాయం ఉంది. అయితే మన తెలుగు రంగంలో మాత్రం భారీగా నల్లధనంతో నడుస్తున్న వ్యవస్థ కనుక వైట్ మనీ చెక్కులుగా ఇచ్చినా బ్లాక్‌మనీకి అలా కుదరదు. అందుకే ఈ చిల్లర సమస్యతో టాలీవుడ్ కుదేలైంది. నల్లధనంతో ఎన్నాళ్లు నెట్టుకొస్తారు. చెత్త చిత్రాలను తీస్తారు?
-జె ధర్మతేజ, కొణిదలపేట
అచ్చిరాదు
తెలుగు సినిమాలకు సీక్వెల్ అచ్చిరాదు అన్న మాట నిజం. దోషం రచయిత, దర్శకులదే. సీక్వెల్‌లో మొదటి భాగంలోనే కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు, పాత్రలు రెండో భాగంలోకి చొచ్చుకురావాలి. రెండో భాగంలో సన్నివేశాల మూలాలు మొదటి భాగంలోవే ఉండాలి. సీక్వెల్ సినిమా చూస్తున్నంతసేపు మొదటి భాగం జ్ఞాపకం వస్తూ వుండాలి. ఈ ముఖ్య విషయాలు పట్టించుకోకుండా తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదం అన్నట్టు రెండు సినిమాలు వేరువేరుగా ఉంటున్నాయి. అందుకే సీక్వెల్స్ రాణించడం లేదు.
-పి శాండిల్య, కాకినాడ
పెద్దల ఆశీర్వాదం
పూర్వం రామాయణ, భారత, భాగవత కథలను సినిమాలుగా రూపొందించారు కాబట్టి పామరులకు సైతం వీటి మీద మక్కువ పెరిగింది. వేమన చిత్రం చూసి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమవాసి బాలయోగిగా మారిపోయాడు. లలాటాన పుట్టుకలోనే లిఖించబడ్డ నిర్ణయాలు భక్తితత్పరతవల్ల, పెద్దల ఎడ గౌరవం, మర్యాద ఉండడం వల్ల నుదుటి రాతను మార్చవచ్చునని ‘్భక్తమార్కండేయ’ ఒక ఉదాహరణ. పదహారేళ్ళకే మరణమని తెలియనివాడు, నారదుడు మొదలగు సత్పురుషులు ఇంటికి వచ్చినప్పుడు సాష్టాంగ దండం చేసిన మార్కండేయుణ్ణి ‘చిరంజీవ’ అని దీవించారు. వారి వాక్కు వేదవాక్కయి జన్మరీత్యా జరగవలసిన అకాల మరణం తొలగిపోయింది. అందుచేతనే పెద్దలకు, గౌరవనీయులకు నమస్కరించిన ఎడల వారి ఆశీర్వచనం ఎప్పటికి వమ్ముకాదనే సత్యాన్ని భక్తమార్కండేయ కథను వివరిస్తూ చిత్రాన్ని నిర్మించారు. ఇటువంటి సినిమాలను నేటి యువత చూసి తీరాలి.
-ఎన్ రామలక్ష్మి, సికిందరాబాద్
శరత్‌కాలం
ఆనాటి హాస్య నటుడు పద్మనాభాన్ని ఓ అభిమాని సన్మానించి గౌరవించిన విధానాన్ని అభిమానులు తోటి పాఠకులతో పంచుకోవడం సంతోషంగా వుంది. ఇలాంటి మధురమైన జ్ఞాపకాలు మరెన్నో శరత్‌కాలంలో అందించాలని కోరుతున్నాం.
-గొల్లపూడి శివయ్య, అంగలకుదురు
అజరామరం
శరత్‌కాలంలో మేకప్ కళాకారుల ప్రతిభ గురించి చక్కగా వివరించారు. పౌరాణిక, జానపదాల్లో వారి ప్రాముఖ్యం ఎక్కువే. నర్తనశాలలో బృహన్నల రూపకల్పనకు ఎన్నో శిల్పాలు, గ్రంథాలు పరిశీలించారు. అందుకే ఆ పాత్ర చిరస్మరణీయం అయింది. అయితే నవతరం దర్శకులు మేకప్ లేకుండా సహజ వ్యక్తులతో సహజ వాతావరణంలో చిత్రాలు తీస్తున్నారు. ఇది మంచిదే. అయితే అప్పటి సినిమాలలో ఉన్న అందం ఇప్పుడు లేదు.
-బి ప్రభాస్, గాంధీనగరం