అదిలాబాద్

రైతుబంధుతో ఎంతో మేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెబ్బెన, మే 18: రైతుబంధు పథకంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. మండలంలోని కైర్గాం, రెబ్బెన, పులికుంట, గంగాపూర్‌లోని రైతులకు రైతుబంధు చెక్కులను శుక్రవారం ఆమె అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వాలూ చేయని పనిని తమ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు ఎకరాకు రూ. 8 వేల చొప్పున అందిస్తున్నారని పేర్కొన్నా రు. రెబ్బెన ఎంపీపీ కార్నథం సంజీవ్‌కుమార్, జడ్పీటీసీ అజ్మిర బాబూరావు, వైస్ ఎంపిపి రేణుక, ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ శంకరమ్మ, స్థానిక సర్పంచ్ పెసర వెంకటమ్మ, ఏడీఏ శ్రీనివాస్ రావు, తహసీల్దార్ సాయన్న, ఏఓ మంజు ల, రైతు కమిటీ కోఆర్డినేటర్ బీ. నాగయ్య, ఏఈఓ అర్చన, ఉప సర్పంచ్ శ్రీ్ధర్, ఆర్ ఐ ఉర్మిళ, టీఆర్‌ఎస్ మండల ప్రెసిండెంట్ శ్రీ్ధర్ రెడ్డి, నాయకులు చిరంజీవి గౌడ్, చెన్న సోమశేఖర్‌తో పాటు రైతులు, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
దండేపల్లి: ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబాంధవుడని మంచిర్యాల శాసనసభ్యుడు నడిపెల్లి దివాకర్ కొనియాడారు. రైతుబం ధు పథకంలో భాగంగా మండలంలోని కుందెల్‌పహాడ్, తానిమడుగు, రెబ్బన్‌పెల్లి గ్రామాలలో శుక్రవారం రైతులకు పాసుపుస్తకాలు, చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ మోటపలుకుల గురువయ్య, తహసీల్దార్ దత్తుప్రసాద్ రావు, జడ్పీటీసీ భూక్య యశ్వంత్ నాయక్, సహకార సం ఘం చైర్మన్ గడ్డం శ్రీనివాస్,మార్కెట్ కమి టి ఉపాధ్యక్షుడు పడిగెల శంకర్‌రావు, స ర్పంచ్ కొట్టే రాజేశ్వరిసత్తయ్య,నేతలు దుర్గాప్రసాద్, ఎఓ కుమార్‌యాదవ్, ఆర్‌ఐ గణపతి, ఎంపీటీసీ సభ్యురాలు ముత్యం సత్తవ్వ, ఉప సర్పంచ్ బత్తుల శేఖర్,నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
వేమనపల్లి: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల పక్ష పాతి అని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు. గురువారం మండలంలోని నీల్వాయి గ్రామం లో రైతుబంధు పథకంలో భాగంగా రైతులకు చెక్కులు, పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్థానిక జడ్పీ సభ్యులు ఆర్. సంతోష్‌కుమార్, తహసీల్దార్ సాయి బాబా, రైతు కమిటీ కోఆర్డినేటర్ భీమయ్య, స్థానిక సర్పంచ్ మల్లిక తిరుపతిరెడ్డి, స్థానిక ఎంపీటీసీ జరీనా షాబ్బీర్, ఏఓ ఆనంద్ రావు, ఏపీఎం ఉమారాణి, రెవె న్యూ అధికారి ప్రహ్లాద్, ఏఈఓ సంతోష్, తదితరులు పాల్గొన్నారు.
చెన్నూర్: చెన్నూర్‌లోని ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం రైతుబంధు చెక్కుల పంపిణీకి ఎమ్మెల్యే నల్లాల ఓదెలు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసి ఆర్ ఆలోచన, రైతుల ఆలోచన తెలంగాణ రైతులందరూ ధనవంతులు అవ్వాలని కేసీఆర్ సంకల్పం రైతుల అప్పుల బాధ లు కావద్దని కేసీఆర్ రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ దిలీప్‌కుమార్, ఎంపీడీవో వేముల మల్లేశం, ఏఓ ప్రేమ్‌కుమార్, చెన్నూర్ సిఐ కిషోర్, జడ్పీ వైస్‌చైర్మన్ మూల రాజిరెడ్డి, ఎంపీపీ మైదాం కళావతి, సర్పంచ్ కృష్ణ, నాయిని సతీష్, కరుణ సాగర్ రావు తదితరులు పాల్గొన్నారు.

జాబ్‌మేళాతో ఉపాధి అవకాశాలు
బెల్లంపల్లి, మే 18: ఆలిండియా సొసైటీ ఆఫ్ ఎలక్ట్రానిక్ అండ్ కంప్యూటర్స్ టెక్నాలజీ ఇంటిగ్రేటేడ్ ట్రైబల్ వెల్ఫేర్ డెవలంప్‌మెంట్ ఏజెన్సీ సం యుక్త ఆధ్వర్యంలో నిర్వహించే జాబ్ మేళాతో నిరుపేదలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు ఐటీడీఏ జేడీ ఎంటీ నాగభూషణం తెలిపారు. శుక్రవారం బెల్లంపల్లి మండలంలోని తాళ్ల గురిజాల శివారులో గల ఐటీడీఏ యూత్ ట్రైనింగ్ సెంటర్‌లో నిరుద్యోగ యువతీ, యువకులకు జాబ్ మేళాను నిర్వహించారు. యురేఖ కోర్సు, ఎస్ బీ ఐ క్రెడిట్ డివిజన్, సోలార్ ఇన్‌స్టాలేషన్, అంకం ఫెర్టిలైజర్, తదితర కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు జాబ్ మేళాలో పాల్గొని పలుసూచన లు అందజేశారు. ఈ సందర్భంగా వా రు నిరుద్యోగులకు పలు ఉద్యోగాలపై సూచనలు చేశారు. బెల్లంపల్లి, ఉట్నూ ర్, ఇచ్చోడ, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, తదితర ప్రాంతాలకు చెందిన నిరుద్యోగులు జాబ్ మేళాకు హాజరయ్యారు. ఈ జాబ్‌మేళాలో నైపుణ్యం కలిగిన వారిని గుర్తించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. 10వ తరగతి నుంచి డిగ్రీ, బి ఈ డి చేసిన నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో వివిధ కంపెనీల ప్రతినిదులు మహేందర్, ప్రభు, రాంమోహాన్ రాజు, రమేష్, రాంచందర్, రాజ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.

పేదల వైద్యానికి సీఎం చేయూత
* ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్
కడెం, మే 18: రాష్ట్రంలోని పేద ప్రజల వైద్యం కోసం పెద్దఎత్తున సీఎం సహాయనిధి నుండి నిధులు మంజూరుచేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేద ప్రజలకు చేయూతనందిస్తున్నారని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. శుక్రవారం మండలంలోని నవాబ్‌పేట్ గ్రామానికి చెందిన జీ.మనీషాకు వైద్య చికిత్సల నిమిత్తం మంజూరైన రూ.36 వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో ఉమ్మడి రాష్ట్రంలో పాలక ప్రభుత్వాలు ఏనాడుకూడా పేదల వైద్యం కోసం పట్టించుకునే దాఖలాలు కూడా లేవన్నారు. రాష్ట్రంలో టీఆర్ ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్యం కోసం పెద్దఎత్తున నిధు లు మంజూరుచేస్తుందని ఆమె పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ కడెం మండల కన్వీనర్ హపావత్ రాజేంధర్ నాయక్, నవాబ్‌పేట్ గ్రామస్థులు, నేతలు పాల్గొన్నారు.