జాతీయ వార్తలు

ఇలాగైతే మొద్దుల భారతమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, ఏప్రిల్ 18: విద్యార్థులు చదువుకోకుండా డిగ్రీలు ప్రదానం చేస్తూ పోతే భారత దేశం మొద్దుల భారతంగా మారుతుందని జమ్ముకాశ్మీర్ హైకోర్టు సోమవారం అభిప్రాయపడింది. ఇలాంటి చర్యల వల్ల మన దేశ విద్యావ్యస్థకు తీరని విఘాతం కలుగుతుందని వ్యాఖ్యానించింది. ‘ఒక్కసారి ఊహించండి.. ఎలాంటి చదువు చదవకుండా ప్రజలకు డిగ్రీలను ఇస్తూ పోతే భారత దేశం మొద్దుబుర్రలతో నిండిపోతుంది. దేశ భవిష్యత్తు అంధకారంలో పడిపోతుంది’ అని జస్టిస్ అత్తర్ పేర్కొన్నారు. కాశ్మీర్‌లోని ఎలిమెంటరీ టీచర్స్ ట్రైనింగ్ (ఈటీటీ) కాలేజీ యజమాని మనీష్ సూరి దాఖలు చేసిన ఓ పిటిషన్‌పై కాశ్మీర్ హైకోర్టు ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. 2013లో పలు ఈ టీటీల్లో డిగ్రీల ప్రదానంలో భారీ ఎత్తున సొమ్ములు చేతులు మారాయని జమ్మూకాశ్మీర్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నివేదిక ఆధారంగా పలు ఈటీటీలపై అక్కడి పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. ఒక్కో అభ్యర్థి నుంచి రూ.45వేల నుంచి రూ. 80వేల వరకు లంచాలు స్వీకరించి అడ్డగోలుగా డిగ్రీలను ప్రదానం చేశారు. కనీసం ఉపాధ్యాయుల ఎంపిక జాతీయ మండలి నిర్దేశించిన ఏ ఒక్క నిబంధనను కూడా పట్టించుకోలేదు. పోలీసులు దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేయాలని పిటిషనర్ సూరి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఒకే రకమైన అభియోగాలతో రెండు ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేయజాలరని పిటిషనర్ వాదించారు. ఈ సందర్భంగా జస్టిస్ అత్తర్ వ్యాఖ్యానిస్తూ ‘డబ్బులు పెట్టి కొనుక్కున్న విద్య.. విద్య లేకపోవటం కంటే దారుణమైంద’ని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. నిజాయితీని మించిన ఆస్తి మరొకటి లేదన్న షేక్‌స్పియర్ మాటల్ని కూడా న్యాయమూర్తి ఉటంకించారు.