తెలంగాణ

డిశ్చార్జి అయిన గుండె మార్పిడి రోగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 13: అరుదైన గుండె మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్న ఇద్దరు మహిళా రోగులు శుక్రవారం సికింద్రాబాద్‌లోని యశోదా ఆస్పత్రినుంచి డిశ్చార్జి అయ్యారు. ఇద్దరు రోగులూ బ్రెయిన్‌డెడ్ కేసుల్లో అవయవ దానం వల్ల పునర్జన్మ పొందినవారే కావడం విశేషం. ఈ సందర్భంగా ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ జిఎస్ రావు, వైద్యులు ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే, శశికాంత్ విలేఖరులతో మాట్లాడారు.
బెంగళూరులో బ్రెయిన్ డెడ్ అయిన ఓ యువకుడినుంచి సేకరించిన గుండెను పద్మ అనే రోగికి అమర్చి శస్త్ర చికిత్స నిర్వహించారు. గత నెల 28న జరిగిన ఈ శస్త్ర చికిత్స విజయవంతమైంది. ఖమ్మం జిల్లా కొత్తగూడెంకు చెందిన పద్మ శుక్రవారం డిశ్చార్జి అయ్యారు.
అలాగే నాగోల్‌కు చెందిన ఎర్ర రాణి (48) అనే మహిళ హృద్రోగ సమస్యలతో యశోద ఆస్పత్రిలో చేరారు. ఆమె పేరును జీవన్‌దాన్ జాబితాలో నమోదు చేయగా నగరంలోని ఓ ఆసుపత్రిలో బ్రెయిన్‌డెడ్‌తో ఉన్న యువకుడి గుండెను దానం చేసేందుకు అతని కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. ఐదు గంటల పాటు శస్తచ్రికిత్స చేసి యువకుడి గుండెను రాణికి అమర్చారు. గుండె మార్పిడి శస్తచ్రికిత్స జరిగిన మహిళలు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యుడు గోపాలకృష్ణ గోఖలే తెలిపారు. భారతదేశంలో ఇలాంటి అరుదైన శస్తచ్రికిత్సలు ఇప్పటి వరకు 200 మాత్రమే జరిగాయని పేర్కొన్నారు. మహిళలు పద్మ, రాణి మాట్లాడుతూ మరో జన్మను ప్రసాదించిన ఘనత యశోద ఆసుపత్రికి దక్కిందని అన్నారు. విలేఖరుల సమావేశంలో ఏపి, తెలంగాణ జీవన్‌దాన్ కోఆర్డినేటర్ డాక్టర్ స్వర్ణలత పాల్గొన్నారు.
గుండె మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్న ఇద్దరు మహిళా రోగులు

అప్పులబాధతో రైతు ఆత్మహత్య
రామన్నపేట, మార్చి 13: అప్పులబాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నల్లగొండ జిల్లా రామన్నపేట మండలంలోని నిధాన్‌పల్లి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన కడారి మల్లేశం (30) అదేగ్రామంలో భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం సాగిస్తున్నాడు. ఐదు ఎకలాలలో వరి, ఐదుఎకరాలలో మినుములు, ఎనిమిది ఎకరాలలో పత్తిసాగుచేశాడు. రోజురోజుకు పంటఎండిపోతుండడంతో తట్టుకోలేక గురవారం సాయంత్రం క్రిమిసంహారక మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు నార్కట్‌పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స నిర్వహిస్తుండగా పరిస్థితి విషమించి మృతచెందాడు. మృతుని భార్య పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ జి. రాజశేఖర్ తెలిపారు.

మూడు నెలల్లో కొత్త ‘ఇసుక పాలసీ’
మండలిలో మంత్రి హరీశ్‌రావు వెల్లడి

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 13: రానున్న రెండు, మూడు నెలల్లో ఇసుక తరలింపునకు సంబంధించి ప్రత్యేక పాలసీని అమలు చేయనున్నట్లు మంత్రి హరీశ్‌రావు శాసన మండలిలో శుక్రవారం వెల్లడించారు. ఇసుకను అక్రమంగా తరలించే విషయంపై టిడిపి సభ్యులు అరికెల నర్సారెడ్డి, పొట్ల నాగేశ్వర్‌రావు సభాముఖంగా అడిగిన ప్రశ్నకు మంత్రి హరీశ్‌రావు స్పందిస్తూ అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవటంతో పాటు యంత్రాలను కూడా స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. ఇసుక తవ్వకం, తరలింపునకు సంబంధించి ఓ ప్రత్యేకమైన పాలసీని రూపొందించామని తెలిపారు. ఈ పాలసీకి సంబంధించి ప్రతి జిల్లాల్లో ఇసుక రీచ్‌లను తవ్వే బాధ్యతలు కలెక్టర్లకే అప్పగించినట్లు మంత్రి వివరంచారు. అంతేగాక, టన్నుకు కొన్ని జిల్లాల్లో రూ. 400, మరికొన్ని జిల్లాల్లో అంతకన్నా తక్కువ, ఎక్కువ ధరలు పలుకుతుందని వివరించారు. మరో 30 ఇసుక రీచ్‌ల తవ్వకానికి పర్యావరణ అనుమతి కోసం వేచి చూస్తున్నామని వెల్లడించారు. వినియోగదారులు తమకు కావల్సిన ఇసుకను ఈ సేవ, మీ సేవల ద్వారా కూడా ఆన్‌లైన్ సేవలను కూడా అందుబాటులోకి తెచ్చామని చెప్పారు.
హరితవనం కింద
230 కోట్ల మొక్కలు!
తెలంగాణ రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు గాను హరితవనం కార్యక్రమం కింద మొత్తం రాష్ట్రంలో 230 కోట్ల మొక్కలను నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు అటవీశాఖ మంత్రి జోగు రామన్న వెల్లడించారు. ఇందుకు ఇప్పటికే తాజాగా బడ్జెట్‌లో రూ. 325 కోట్లు కేటాయించినట్లు వివరించారు.

ౄ తహశీల్దార్ కార్యాలయం ఎదుట హల్‌చల్
రుణమాఫీ జాబితాలో పేర్లు లేవని..
ఐదుగురు రైతుల ఆత్మహత్యాయత్నం

కోడేరు, మార్చి 13: మహబూబ్‌నగర్ జిల్లా కోడేరు మండల పరిధిలోని జనుంపల్లి గ్రామానికి చెందిన రైతులు రుణమాఫీ వర్తించనందుకు నిరసనగా శుక్రవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం ముందు పురుగుల మందు చేతపట్టుకొని ఆత్మహత్య చేసుకుంటామంటూ నిరసన వ్యక్తం చేశారు. గుడిపల్లి లోని ఐసిఐసిఐ బ్యాంక్‌లో 2013లో వ్యవసాయ రుణాలు పొందిన ఐదుగురు రైతులు రుణమాఫీ జాబితాలో తమ పేర్లు లేవని, బ్యాంక్ అధికారులతోను, తహశీల్దార్ కార్యాలయం చుట్టూ పలుమార్లు తిరిగినా అధికారులు స్పందించకపోవడంతో విసిగి వేసారి తహశీల్దార్ కార్యాలయం ముందు ఆత్మహత్యా యత్నానికి పాల్పడి నిరసన వ్యక్తం చేశారు. ఇందుకు స్పందించిన తహశీల్దార్ తక్షణమే పూర్తి వివరాలు తీసుకొని రుణమాఫీ జాబితాలో చేరుస్తామని హామీ ఇవ్వడంతో సదరు రైతులు ఆందోళన విరమించారు. ఆత్మహత్యాయత్నం చేసుకొన్న బాధిత రైతుల్లో అంకె శివమ్మ, ముద్రగొల్ల మంత్రాలయ్య, శ్రీపురం గోపాల్, రాఘవేందర్, కుర్మయ్యలతోపాటు ఎంపిటిసి భర్త శేషయ్య ఉన్నారు.

తెరాసను ఎదుర్కొనే సత్తా బిజెపికే ఉంది

ౄ పార్టీ బలోపేతం కోసం కేంద్ర నాయకత్వం దృష్టి
ౄ దేశ సమగ్రాభివృద్ధి కోసం కోఆపరేటివ్ ఫెడరలిజం అమలు
ౄ బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు
ఆంధ్రభూమి బ్యూరో
మహబూబ్‌నగర్, మార్చి 13: తెలంగాణలో తెరాసను ఎదుర్కొనే కేవలం బిజెపికి మాత్రమే ఉందని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు. శుక్రవారం హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల పట్ట్భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మహబూబ్‌నగర్‌లోని పాలమూరు యూనివర్సిటీ విద్యార్థులతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయ, నిరుద్యోగ సంఘాల నాయకులతో భేటి అయ్యారు. అనంతరం సింధూ హోటల్ మీటింగ్‌హాల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్భ్రావృద్ధి కోసం కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం అంకితభావంతో పని చేస్తుందని, తెలంగాణ రాష్ట్రంతో పాటు బిజిపియేతర రాష్ట్రాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సుపరిపాలన అందిస్తున్నారని, దేశ సమగ్రాభివృద్ధి కోసం కోఆపరేటివ్ పెడరలిజంను అమలు చేస్తున్నామని, దీంతో అన్ని రాష్ట్రాలు అభివృద్ధి పథంలో నడిచే విధంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు లేస్తుందని అన్నారు. రాష్ట్రాల నిధుల వాటాను 32శాతం నుండి 42శాతంకు పెంచడం జరిగిందని మురళీధర్‌రావు వెల్లడించారు. కేంద్రంలో ఎన్నడు లేని విధంగా కేంద్ర ప్రభుత్వాలు గతంలో రాష్ట్ర ప్రభుత్వాలకు స్వేచ్చ ఇచ్చేవి కావని, కానీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాక రాష్ట్రాలకు స్వేచ్చా వాతావరణాన్ని కల్పించడం జరిగిందని అన్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కెసిఆర్ అడగకముందే కేంద్ర ప్రభుత్వం ఏయిమ్స్‌ను ఇచ్చిందని అన్నారు.

అసెంబ్లీలో గొడవ చేస్తే సహించం

ౄ బయటకు పంపించైనా సభను నడిపిస్తాం
ౄ కిశోర్‌బాబూ... టిటిడిపి తమ్ముళ్లకు క్లాస్ తీసుకో
ౄ గవర్నర్‌కు ఫిర్యాదు చేయడం పెద్ద జోక్
ౄ నీటి పారుదల మంత్రి హరీష్‌రావు

సిద్దిపేట రూరల్, మార్చి 13: అసెంబ్లీలో గొడవ చేస్తే సహించమని, బయటకు పంపించైనా సభను నడిపిస్తామని నీటి పారుదల శాఖ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి తన్నీ రు హరీష్‌రావు అన్నారు. మెదక్ జిల్లా, సిద్దిపేట ఎంపిడిఓ కార్యాలయంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి శుక్రవారం సాయం త్రం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రజా సమస్యలను చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించడం జరుగుతోందని, అంతేకాని గొడవలు చేసి అడ్డుకుంటే కఠినంగా వ్యవహరిస్తామని పరోక్షంగా టిడిపి ఎమ్మెల్యేలను హెచ్చరించారు. సభ వాయిదా వేసి పారిపోయే సంస్కృతి తమది కాదని ప్రజల సమస్యలను కులంకషంగా చర్చించి సభను జరిపి సమస్యలను పరిష్కారించడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తిండి తింటూ టిటిడిపి నేతలు పక్క రాష్ట్రం భజన చేస్తున్నారని విమర్శించారు. గవర్నర్ సమక్షంలో జాతీయ గీతాన్ని అవమానించే విధంగా వ్యవహరించిన టిడిపి ఎమ్మెల్యేలను సభ నుండి గేంటివేశామన్నారు. టిడిపి సభ్యులు క్షమాపణ చెప్పకుండా అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గతంలో అసెంబ్లీలో క్షమాపణ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మంత్రి రావెల కిశోర్‌బాబు శాసనసభ రూ ల్స్, సభ సంప్రదాయాల గురించి, నిబంధనల గురించి ప్రతిపక్షాలకు క్లాస్ తీసుకునారన్నారు. శాసనసభ వ్యవహారాల గురించి ఎపి మంత్రి కిశోర్‌బాబు తెలంగాణ టిడిపి నేతలకు ఎన్టీఆర్ భవన్‌లో క్లాస్ తీసుకోవాలని మంత్రి హరీష్‌రావు కోరారు. టిడిపి ఎమ్మెల్యేలు గవర్నర్‌కు ఫిర్యాదు చేయడం పెద్ద జోక్ అన్నా రు. గవర్నర్‌పై దాడికి ప్రయత్నించి, కాగితాలు విసిరి ప్రసంగానికి ఆటంకాలు కల్పించడంమే కాక జాతీయ గీతాన్ని అవమానించి ఏ మొఖం పెట్టుకొని వెళతారని ప్రశ్నించారు. ఢిల్లీకి వెళ్లి రాష్టప్రతిని కలుస్తామంటున్నారని, జాతీయ గీతాన్ని అవమానించినందుకు అసెంబ్లీకి క్షమాపణ చెప్పలేదని రాష్టప్రతిని కలుస్తారా అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో కరీంనగర్ మేయర్ రవీందర్‌సింగ్, రాష్ట్ర నేత వేలేటి రాధకిషన్‌శర్మ, ఎంపిపిలు ఎర్ర యాదయ్య, కూర మాణిక్యరెడ్డి, జెడ్పీటిసిలు గ్యార వజ్రవ్వ యాదగిరి, కమలరాంచంద్రం, మున్సిపల్ మాజీ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, మారెడ్డి రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.

విద్యార్థులపై
సర్పంచ్ భర్త వీరంగం

ఆరుగురికి గాయాలు

మధిర, మార్చి 13: ఖమ్మం జిల్లా మధిర మండలం ఖమ్మంపాడు ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో స్కూల్ మేనేజ్‌మెంట్ చైర్మన్ వీరంగం వేసి విద్యార్థులను విచక్షణారహితంగా కొట్టాడు. ఈ సంఘటన శుక్రవారం జరిగింది. బాధిత విద్యార్థులు, గ్రామస్థులు, ఉపాధ్యాయులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం 8.45 గంటల సమయంలో పాఠశాలలోకి వచ్చిన ఎస్‌ఎంసి చైర్మన్, ఆ గ్రామ సర్పంచ్ భర్త షేక్ బాజీ పాఠశాల ఆవరణలో ఉన్న ఏడో తరగతి విద్యార్థులు మాటూరి శ్రీనివాస్, పచ్చల వినయ్, ఆరో తరగతి విద్యార్థులు మాదినేని వీరబాబు, భూక్యా గోపి, భూక్యా సాయి, ఐదో తరగతి విద్యార్థి పవన్‌ను ఎలాంటి కారణం లేకుండానే విద్యుత్ వైర్‌తో చితకబాదాడు. విద్యార్థుల ఒంటిపై వాతలు తేలి చర్మం చిట్లి రక్తం కారింది. పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులను మధిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. ఎస్‌ఎంసి చైర్మన్‌పై పాఠశాల ఉపాధ్యాయుడు తళ్ళూరి ఆంజనేయులు మధిర రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈమేరకు ఎస్‌ఐ గాంతుల శ్రీనివాస్ కేసు నమోదు చేశారు. పాఠశాల వద్దకు వెళ్లి విచారణ జరిపారు. విద్యార్థులను కొట్టిన బాజీపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

అక్బర్, అసదుద్దీన్‌లను
భుజాలకెత్తుకున్న కెసిఆర్

ౄ నిజాం భజన చేస్తున్న నియంత
ౄ రాష్ట్రంలో డిఎస్సీ లేనట్లేనా..
ౄ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి
మహబూబాబాద్, మార్చి 13: తెలంగాణ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించి... అయితే గియితే రాయల తెలంగాణ ఇవ్వండంటూ తెగేసి చెప్పిన మజ్లీస్ పార్టీ నేతలు అక్బరొద్దీన్, అసదొద్దీన్ ఒవైసీలను ముఖ్యమంత్రి కేసిఆర్ తన అవసరం కోసం భుజాల మీద ఎత్తుకుని ఊరేగుతున్నాడని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఘాటుగా విమర్శించారు. మానుకోటలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కేవలం తన ఒక్కని సొంతమన్నట్లుగా కేసిఆర్ మాట్లాడుతున్నాడన్నారు. నిజాం పరిపాలన తనకు ఆదర్శమని, నిత్యం నిజాం ప్రభువు నామజపం చేస్తున్న కేసిఆర్ ఈ రాష్ట్రాన్ని ఓ నియంతలా పాలిస్తున్నాడన్నారు. నిన్నటికి నిన్న నిజాంబాద్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో సభావేదికపై నుండే డిఎస్సీ లేదు అని చెప్పడం ఆయన నియంతృత్వ వైఖరికి ఉదాహరణ అన్నారు. ఎన్నో సంవత్సరాలుగా డిఎస్సీపై ఆశలు పెట్టుకుని చదువుతున్న విద్యార్థుల, మేధావుల ఆశలను ఒక్క మాటతో తేల్చివేయడం కేసిఆర్ వంటి నియంతకే చెల్లిందన్నారు. విద్యార్థుల ఉద్యమాలతో తెలంగాణ సాధించుకుంటే ఈ రాష్ట్రంలో ఫీజురీయంబర్స్‌మెంట్ రద్దు చేసే కుట్ర జరుగుతుందన్నారు. దేశంలోనే మహిళలకు మంత్రి వర్గంలో స్థానంలేని ఏకైక రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమేనని, మహిళల హక్కులను అణచివేసే ఇంతటి మూర్ఖపు ముఖ్యమంత్రి ఈ దేశంలోనే ఎక్కడా కనిపించడన్నారు.

ప్రజాభిప్రాయ సేక‘రణం’

ౄ టెంట్లు కూల్చివేత, కుర్చీలు ధ్వంసం
ౄ కలుషిత జలాలు, ఎండిన వరితో నిరసనలు
ౄ స్థానికులను చెదరగొట్టిన పోలీసులు
ౄ పోలీసు బందోబస్తుతో ప్రజాభిప్రాయ సేకరణ
ౄ కాలుష్య కారక పరిశ్రమలపై కఠిన చర్యలు: జెసి

చౌటుప్పల్, మార్చి 13: నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం ఎల్లగిరి శివారులోని బృందావన్ లేబొరేటరీ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ విస్తరణకు శుక్రవారం పరిశ్రమ ఆవరణలో నిర్వహించిన ప్రజాభిప్రాయసేకరణ రసాభాసగా మారింది, ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభం కాగానే జెసి సత్యనారాయణ సమక్షంలోనే రైతులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ టెంట్లు కూల్చివేశారు. కుర్చీలను విరగ్గొట్టారు. ప్రజాభిప్రాయ సేకరణ వద్దంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇప్పటికే కెమికల్ పరిశ్రమల వల్ల భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమయ్యాయని, పంటలు పండటంలేదని, పశువులు కూడా నీరు తాగడంలేదని, కలుషిత జలాలతో రోగాల బారిన పడుతున్నామని ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపిపి చిలుకూరి ప్రభాకర్‌రెడ్డి వేదిక ముందు బైఠాయించి నిరసన తెలిపారు. దోతిగూడెం గ్రామానికి చెందిన రైతులు కంపెనీల కాలుష్యతో భూగర్భజలాలు కలుషితమైన నీటిని డబ్బాలలో తీసుకువచ్చారు. అదేవిధంగా కలుషిత నీటితో ఎండిపోయిన వరి పంటలను సైతం తీసుకువచ్చి నిరసనలు వ్యక్తం చేశారు.
రైతులు, స్థానికులు, ప్రజాప్రతినిధుల ఆగ్రహంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అప్పటికే పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి ఉన్నారు. ముగ్గురు సిఐలు భూపతి గట్టుమల్లు, శివరాంరెడ్డి, బాలగంగిరెడ్డిలతో పాటు ఎస్‌ఐలు, పోలీసులతో బందోబస్తు ఏర్పా టు చేశారు. పరిస్థితి అదుపు తప్పుతుందని భావించిన పోలీసులు స్థానికులను చెదరగొట్టారు. అనంతరం పోలీసు బందోబస్తు మధ్య ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు.

సూర్యాపేటలో ఇంటర్ ప్రశ్నపత్రాల లీక్

సెంటర్ల వద్ద సమాధానాల జిరాక్స్ ప్రతులు ౄ ఆర్‌ఐవో, ఆర్డీవో, డీఎస్పీ విచారణ

సూర్యాపేట టౌన్, మార్చి 13: ఇం టర్ ప్రథమ సంవత్సర పరీక్షల్లో భాగంగా నల్లగొండ జిల్లా సూర్యాపేటలో శుక్రవారం ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయి. శుక్రవారం జరుగుతున్న బాటనీ, సివిక్స్ పరీక్షలకు సంబంధించి ప్రశ్నా పత్రంలోని ప్రశ్నల వరుస క్రమానికి అనుబంధంగా ఏ 4 షీట్లలో సమాధానాలు రాసి జిరాక్స్ తీసిన పేపర్లు పరీక్ష కేంద్రాలు ఉన్న జూనియర్ కళాశాల సమీపంలో, 60 అడుగుల రోడ్డుపై లభ్యమయ్యాయి. పట్టణంలో పరీక్ష పత్రాలు లీక్ అవుతున్నాయని గత రెండు రోజులుగా విస్తృత ప్రచారం జరుగుతోంది. గురువారం చానెళ్లలో వార్తలు రావడంతో ఆర్‌ఐవో ప్రకాశ్‌బాబు వచ్చి తనిఖీలు నిర్వహించి ఎలాంటి అవకతవకలు జరగడం లేదని పరీక్షలు సక్రమంగా సాగుతున్నాయని ప్రకటించారు. శుక్రవారం పరీక్ష ప్రారంభమైన గంటలోగానే సమాధానాలతో కూడిన పేపర్లు సెంటర్ల వద్ద ప్రత్యక్షం కావడం.. వాటి విజువల్స్‌తో చానళ్లలో ప్రసారం కావడంతో ఊరుకులు పరుగుల మీద ఆర్‌ఐవో ప్రకాశ్‌బాబు, సూర్యాపేట ఆర్డీవో శ్రీనివాస్‌రెడ్డి, డీఎస్పీ ఎంఏ రషీద్ పరీక్ష కేంద్రాల వద్ద తనిఖీలు నిర్వహించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో పరీక్షల కేంద్రాల డీవోలు, సూపరింటెండెంట్‌లు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆర్‌ఐవో మాట్లాడుతూ పరీక్ష కేంద్రాలలో పరీక్షలు సక్రమంగానే జరుగుతున్నాయని సెంటర్ల బయట మాత్రం సమాధానాల పత్రాల పేపర్లు లభ్యమయ్యాయని తమ విచారణలో ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని ఈ విషయమై పూర్తిస్థాయి విచారణ జరపాల్సిందిగా సూర్యాపేట డీఎస్పీకి ఫిర్యాదు చేశామన్నారు. ఆర్డీవో శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి రెండు సెంటర్లకు ఒక తహశీల్దార్ గాని లేక ఎండీవో గాని వారితో పాటు ఇద్దరు అసిస్టెంట్లతో స్పెషల్ స్క్వాడ్ ఏర్పాటు చేశామనన్నారు. పరీక్షల నిర్వహణ సక్రమంగా జరపాలని ఎలాంటి అవకతవకలకు పాల్పడినా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు.