రాష్ట్రీయం

మెట్రో రైల్వే లైన్ అలైన్మెంట్ పై అసెంబ్లీ లో చర్చ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : ఆదివారం కూడా సమావేశమైన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో మెట్రో రైల్వే లైన్ అలైన్మెంట్ పై జరిగిన చర్చలో పలువురు సభ్యులు పాల్గొన్నారు. మెట్రో అలైన్మెంట్ ఇష్టం వచ్చినట్లు మారుస్తున్నారని, ఇదొక కుంభకోణంలా వుందని ఆరోపించిన ఎం ఐ ఎం సభ్యుడు అక్బరుద్దీన్ ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మెట్రోరైలు అలైన్ మెంట్ మార్పుతో నగర ప్రజలపై అదనపు భారం పడుతుందని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్ మెట్రో అలైన్ మెంట్ మార్చలేదని , మెట్రో పనులు శరవేగంతో జరగుతున్నాయని, ఇప్పటివరకు 75 శాతం పనులు పూర్తయ్యాయని కేటీఆర్ తెలిపారు. మెట్రోపనులు సకాలంలో పూర్తి చేస్తామని కేటీఆర్ చెప్పారు.