Others

ధనమేరా.. అన్నిటికీ మూలం..’(నాకు నచ్చిన సినిమా )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ దర్శకుడు బి.ఎన్.రెడ్డి నిర్మాతగా, దర్శకునిగా తీసిన మరపురాని వెండితెర వెలుగుల చిత్రం ‘బంగారు పంజరం’. పాలగుమ్మి పద్మరాజు రాసిన సున్నితమైన కథకు అందమైన రూపకల్పన చేశారు దర్శకుడు. దేవులపల్లి కృష్ణశాస్ర్తీ అజరామరమైన పాటలకు వీనుల విందైన సంగీతం సమకూర్చినవారు స్వరాల రాజేశ్వరరావు. ఈ పాటలను మధుర మంజుల గాయని ఎస్.జానకి అద్భుతంగా ఆలపించారు. ఘంటసాలగారి గురించి చెప్పేదేముంది! ‘పగలైతే దొరవేరా రాతిరి నా రాజువిరా’, ‘కొండల కోనల సూరీడు’, ‘మనిషే మారేరా రాజా. మనసే మారేరా’ ‘గట్టుకాడ.. ఎవరో.. చెట్టునీడ ఎవరో.. నల్లకనుల నాగస్వరము ఊదేరు ఎవరో..’ వంటి సుస్వరమైన పాటలు మనలను మరో లోకానికి తీసుకువెళతాయి. ఇక నటీనటుల విషయానికి వస్తే అగ్ర తాంబూలం వాణిశ్రీకి ఇవ్వాలి. తన సహజ నటనతో ఆనాడు బి.ఎన్.రెడ్డిగారినే అబ్బురపరిచిందట. శోభన్‌బాబు, గీతాంజలి, శ్రీరంజని తమతమ పరిధిలో నటించి మెప్పించారు.
కథ విషయానికి వస్తే అడవిలో స్వేచ్ఛగా ఎగిరే పక్షిని ‘బంగారు పంజరం’లో బంధిస్తే ఆ పక్షి సున్నితమైన స్వచ్ఛమైన భావాలు ఎలా బలి అవుతాయో మర్మగర్భంగా చెప్పారు. ‘నీలా... నీలా’ అంటూ చివర్లో వాణిశ్రీ కోసం శోభన్‌బాబు పడిన బాధ తపన, దుఃఖం చక్కగా చిత్రీకరించారు. నాకు ఎంతో బాగానచ్చిన చిత్రం. ఎన్నిసార్లయినా చూడాలని అనుకుంటున్న చిత్రం ఇది.
- కోలపల్లి ఈశ్వర్, నెల్లూరు