రాష్ట్రీయం

యువశక్తితో దేశానికి సౌభాగ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 16: యువశక్తిని దేశాభివృద్ధికి ఉపయోగించాలన్నదే తన ఉద్దేశమని ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గి వాసుదేవ్ స్పష్టం చేశారు. దేశంలోని వివిధ నగరాల్లో యువతలో చైతన్యం కలిగించేందుకు ‘యువతా సత్యం తెలుసుకో’ పేరుతో ప్రచారం ప్రారంభించారు. ఇప్పటికే దేశంలోని ఐదు నగరాల్లో ఈ తరహా కార్యక్రమాలు నిర్వహించిన సద్గురు ఈ నెల 18న హైదరాబాద్‌లోని నల్సార్ విశ్వవిద్యాలయంలో విద్యార్థులతో సమావేశమవుతున్నారు. నల్సార్ వర్సిటీలో ‘ఇన్ హౌస్ ఈవెంట్’గా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నల్సార్ వర్సిటీలో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ చేరుకున్న సద్గురు ఆదివారం ఇక్కడ మీడియా ప్రతినిధుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, యువకుల్లో అద్భుతమైన శక్తి దాగి ఉంటుందని, ఈ శక్తిలో కేవలం ఒక శాతం శక్తిని మాత్రమే వారు తమ జీవితానికి వినియోగించుకోగలుగుతున్నారని పేర్కొన్నారు. ప్రతి వ్యక్తిలో ఉండే శక్తి ఉపయోగించుకుంటే వ్యక్తిగతంగానే కాకుండా సామాజికంగా కూడా అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. యువత తమలో ఉన్న శక్తిని స్వయంగా గుర్తించలేకపోతున్నారని, తమలో ఉన్న శక్తిని పూర్తిగా వినియోగించుకోగలిగితే అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నారు. యువశక్తిని వెలుగులోకి తీసుకువచ్చేందుకు తాను దేశంలోని ప్రధానమైన నగరాల్లోని వర్సిటీలను సందర్శిస్తున్నానని, సమాజంలో చైతన్యం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పారు.
జీవితంలో భయం అనేది ఉండకూడదని, ఎలాంటి సమస్యనైనా సునాయాసంగా ఎదుర్కోగలుగుతామన్న భావన విద్యార్థులు, యువతలో రావలసి ఉందని సద్గురు పేర్కొన్నారు. చిన్నచిన్న అంశాలకు నిరాశకు గురికాకూడదన్నారు. ఇదే విషయాన్ని ప్రపంచంలోని ప్రజలకందరికీ తెలియచేయాలన్నదే తన ఉద్దేశమని వివరించారు. 2017లో మన దేశంలో 25 సంవత్సరాలలోపు వయస్సున్న 18,600 మంది యువతీయువకులు ఆత్మహత్యకు పాల్పడ్డారని గుర్తుచేశారు. ఆత్మహత్య ఏ సమస్యకు కూడా పరిష్కారం కాబోదని స్పష్టం చేశారు. విద్యార్థులు, యువకుల తల్లిదండ్రులు తమ పిల్లలతో స్నేహపూర్వకంగా మెలగాల్సి ఉందని, వారిపై ఎలాంటి ఒత్తిడి తీసుకురాకూడదని వివరించారు. రసాయనాల వల్ల ఆహారం, గాలి, నీరు కలుషితం కాకుండా చూడాల్సి ఉందన్నారు. ప్రస్తుతం మనం అనుసరిస్తున్న విద్యావ్యవస్థ లోపభూయిష్టంగా ఉందని, విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం కలిగించే విధంగా విద్యావిధానం ఉండాలన్నారు. విద్యాసంస్థల్లో విద్యార్థులు గడిపే సమయంలో సగం సమయం మాత్రమే అకడమిక్ అంశాలకు వినియోగించాలని, మిగతా సగం సమయాన్ని సాహిత్యం, కళలు, క్రీడలు తదితర అంశాల్లో వారిలో ఉండే ప్రతిభను వెలికితీసే విధంగా వినియోగించాలన్నారు. విద్యార్థులు, యువత మత్తుమందులకు బానిసలు కాకుండా చూడాల్సిన బాధ్యత సమాజంపై ఉందన్నారు. ప్రస్తుత కేంద్రప్రభుత్వం ఈ దిశలో చర్యలు తీసుకుంటోందని ప్రశంసించారు. యువతలో ఉండే నైపుణ్యాన్ని పూర్తిగా వినియోగించుకుంటే దేశాభివృద్ధికి దోహదపడుతుందని వివరించారు.
యోగాతో మార్పు
యోగా ప్రాక్టీస్ చేయడం ద్వారా మనలో శక్తి పెరుగుతుందని సద్గురు పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో మంచి పాలకులను ఎన్నుకోవడం ప్రజలపై మరీ ముఖ్యంగా యువతపై ఉందని గుర్తు చేశారు. ఉగ్రవాదం వల్ల అభివృద్ధి కుంటుపడుతుందని, గత నాలుగేళ్లలో దేశంలో ఉగ్రవాద చర్యలు నిలిచిపోయాయని గుర్తు చేశారు. దేశ సరిహద్దుల్లో, కశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు సాగుతున్నాయని, వీటిని ఎదుర్కొనే శక్తి మన సైన్యానికి ఉందన్నారు.