తెలంగాణ

భూ కుంణకోణంలో ఇరుక్కున్న కెకెపై చర్యలేవీ..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 18: భూ కుంభకోణంలో ఇరుక్కున్న తెరాస ఎంపి కె కేశవరావుపై చర్యలు తీసుకోవడంలో సిఎం కెసిఆర్ ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని టిటిడిపి అధికార ప్రతినిధి సతీష్‌మాదిగ ప్రశ్నించారు. అదే దళితుడైన రాజయ్యను ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి ఎందుకు బర్తరఫ్ చేశారో ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదని అన్నారు. రాజయ్యకో న్యాయం, కెకె కి ఒక న్యాయమా..? అని నిలదీశారు. ఆదివారం నాడిక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో సతీష్ మాట్లాడుతూ మియాపూర్ భూ కుంభకోణంలో ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీపైనా తీవ్ర ఆరోపణలు వచ్చాయని తెలిపారు. రూ.15 వేల భూ కుంభకోణంలో ఉప ముఖ్యమంత్రికి బినామీ పేర్లపై రూ.50 కోట్ల విలువ చేసే భూమి ఉందని, ఇంట్లో పని చేసే ఇద్దరు సాక్షులుగా ఉన్నారని వార్తలొచ్చిన నేపధ్యంలో కనీసం విచారించ లేదని, డిప్యూటీ సిఎంపై ఎందుకు చర్యలు తీసుకోలేదో వెల్లడించాలని డిమాండ్ చేశారు. మేడ్చల్ దగ్గర నాలుగు ఎకరాల అసైన్డ్ భూమిని రిజిష్ట్రేషన్ చేయించుకున్నానని మరో టిఆర్‌ఎస్ నేత డి.శ్రీనివాస్ ఒప్పుకుంటే ఆయనపై చర్యలు ఎందుకు తీసుకోలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. దోషులను శిక్షించడంలోనూ తెరాస ప్రభుత్వం ముఖాలను, కులాలను చూసి బొట్టుపెట్టే పని చేస్తున్నారని ధ్వజమెత్తారు. దళితుడు కాబట్టే రాజయ్య ఎదుగుదలను చూసి ఓర్వలేక కావాలనే బర్తరఫ్ చేశారని ఆరోపించారు.