గుంటూరు

జిజిహెచ్‌లో విజయవంతంగా 100 గుండె శస్తచ్రికిత్సలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 20: గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో శుక్రవారం విజయవంతంగా 100వ గుండె శస్తచ్రికిత్సలు పూర్తిచేశారు. సహృదయ ట్రస్ట్ ఆధ్వర్యంలో గుండె శస్తచ్రికిత్సలను ఉచితంగా చేస్తున్నారు. డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే ఆధ్వర్యంలో 100వ శస్తచ్రికిత్స విజయవంతంగా పూర్తికావడంతో ఆ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే పాల్గొని అభినందనలు తెలిపారు. ప్రభుత్వాసుపత్రిలో అతితక్కువ కాలంలో 100 మందిని గుర్తించి శస్త్ర చికిత్సలు ఉచితంగా చేయడం అభినందనీయమన్నారు. గుండె విభాగంలో వైద్యులు చూపుతున్న చొరవను మిగిలిన విభాగ వైద్యులు కూడా అనుసరించి గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు పేరు ప్రఖ్యాతులు తేవాలన్నారు. వైద్యసేవలు అందుకునేందుకు వచ్చే వారిని నొప్పించకుండా వైద్యులు సేవలు అందించాలని కోరారు. అనంతరం 100 ఆపరేషన్లు విజయవంతంగా పూర్తిచేసిన డాక్టర్ గోపాలకృష్ణ గోఖలేను కలెక్టర్ కాంతిలాల్‌దండే, జిజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజునాయుడులు సత్కరించారు.