రాష్ట్రీయం

‘జనగణమన’కు జన్మనిచ్చిన మదనపల్లె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటితో 105 వసంతాలు

మదనపల్లె, డిసెంబర్ 26: భారతీయతకు నిలువెత్తు రూపమైన మన జాతీయగీతం జనగణమన 104 వసంతాలు పూర్తిచేసుకుని నేడు 105వ వసంతంలోకి అడుగుపెడుతోంది. 1911 డిసెంబర్ 27న కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో జాతీయగీతాన్ని మొదటిసారిగా ఆలపించారు. జాతీయగీతం వినపించగానే ప్రతి భారతీయుడు అప్రమత్తమై ఎక్కడ ఎలా ఉన్నా తగు గౌరవాన్ని ఇస్తారు. అలాంటి గౌరవాన్ని విశ్వకవి రవీంధ్రనాథ్ ఠాగూర్ కలం నుంచి జాలువారిన అక్షరసుమాలు ప్రేరేపిస్తాయి. బెంగాలీ భాషలో రవీంద్రనాధ్ ఠాగూర్ రాసిన జనగణమన గీతాన్ని ఆంగ్లంలో తర్జుమా చేసి మొదటగా మదనపల్లె బిటి కళాశాలలో ఆలపించారు. స్వాతంత్య్ర సంగ్రామం ఉవ్వెత్తున సాగుతున్న రోజుల్లోనే రవీంద్రనాథుని గీతం స్వాతంత్య్ర వీరులను మరింత ఉత్తేజితులను చేయడమే కాకుండా దీనివల్ల ప్రపంచ చిత్రపటంలో మదనపల్లెకు అపారమైన ఖ్యాతి లభించింది. జాతీయగీతాన్ని రచించడమే కాకుండా సుదీర్ఘ చరిత్ర కలిగిన బిటి కళాశాలలో రవీంద్రనాథుడే ఆ గీతాన్ని మొదటిసారి ఆలపించారు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ మదనపల్లె పట్టణం బిసెంట్ థియోసాఫికల్ (బిటి) కళాశాలలో జనగణమణ గీతాన్ని బెంగాల్ భాష నుంచి ఆంగ్లంలోకి అనువదించారు.
ఆ అనువాదంతో పాటు ఆయనే స్వయంగా ఆలపించారు. స్వాతంత్య్ర పోరాటంలో చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలో 1913లో అనిబిసెంట్ దివ్యజ్ఞాన కళాశాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ విద్యార్థులతో పాటు స్థానికులు స్వాతంత్య్ర ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించేవారు. ఈ విషయాన్ని తెలుసుకున్న బ్రిటిష్ ప్రభుత్వం కళాశాలకు మద్రాసు విశ్వవిద్యాలం గుర్తింపు రద్దు చేసింది. అదే సమయంలో నేషనల్ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్‌గా ఉన్న రవీంధ్రనాథ్ ఠాగూర్ అప్పటి బిటి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కజిన్స్ ఆహ్వానం మేరకు 1919 ఫిబ్రవరి 25న మదనపల్లెకు వచ్చారు.
ఈ సమయంలో ఇండోర్ గేమ్స్, సంగీత పోటీలలో విద్యార్థుల గళం నుంచి జాలువారిన దేశభక్తి గీతాలకు స్పందించిన ఠాగూర్ పోటీల అనంతరం ఆర్ట్స్ రూమ్ (ప్రస్తుతం బిఎ తరగతి గది)లో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో బెంగాలీ భాషలో రాసిన జనగణమణ గీతాన్ని ‘ది మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా’ పేరిట ఆంగ్లంలోకి 1919 ఫిబ్రవరి 28న అనువదించారు. బిటి కళాశాలలో పెద్దఎత్తున జరిగిన పోటీల ముగింపు సమావేశంలో ఈ గీతానికి ప్రిన్సిపాల్ కజిన్స్ సతీమణి మార్గరేట్ కజిన్స్ బాణీలు కట్టి ఆలపించారు. జనగణమన గీతం పట్ల ఉత్తేజితులైన విద్యార్థులంతా తమ గొంతు కలిపారు. నాటి బిటి కళాశాలలో విద్యార్థుల ఆలాపనతో ప్రారంభమైన జనగణమణ గీతం భారతీయుల నోట పలికినంతకాలం మదనపల్లె పేరు చరిత్రపుటల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది.
** రవీంద్రుడు బస చేసిన బిటి కళాశాల ఆవరణలోని భవనం**