12న లండన్ లైఫ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అసద్‌షాన్, యాంబర్ రోజ్ జంటగా నవీన్ మేడారం దర్శకత్వంలో రూపొందిన ‘లండన్ లైఫ్’ చిత్రం ఈనెల 12న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా దర్శకుడు నవీన్ మేడారం చిత్ర వివరాలను చెప్పారు. లండన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన చిత్రమిదని, హాలీవుడ్‌లో దాదాపు 30 సినిమాలకు గ్రాఫిక్స్ వర్క్‌లో పనిచేశానని, ఆ అనుభవంతో ఈ చిత్రాన్ని రూపొందించానని అన్నారు. నిజామాబాద్‌కు చెందిన తాను సినిమాలపై వున్న ఆసక్తితో ఈ రంగాన్ని ఎంచుకున్నానన్నారు. లండన్ వెళ్లిన నలుగురు అమ్మాయిలు, నలుగురు అబ్బాయిలు కలిసి ఒకే ఇంట్లో ఉండాల్సి వస్తుందని, ఆ సమయంలో వాళ్లకెదురైన సంఘటనలనే చిత్రంగా రూపొందించామన్నారు. సినిమా మొత్తం ఇంగ్లీష్‌లోనే వుంటుందని, దీనికి తెలుగు సబ్‌టైటిల్స్‌తో విడుదల చేస్తున్నామన్నారు. అలాగే యుకె, లండన్‌లో వచ్చే నెలలో, అభిషేక్ పిక్చర్స్ ద్వారా ఇక్కడ విడుదల చేస్తున్నామన్నారు. మరో 8 స్క్రిప్ట్స్ ఉన్నాయని, త్వరలోనే మరో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నానని అన్నారు.