రాష్ట్రీయం

పదహారులో..పరుగే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిఎం కెసిఆర్ బిజీ షెడ్యూల్
పాలనా యంత్రాంగంపై దృష్టి
పార్టీ పటిష్ఠంపైనా సమాలోచనలు
జిల్లాల పర్యటనకు సన్నద్ధం

హైదరాబాద్, డిసెంబర్ 29: నూతన సంవత్సరంలో అభివృద్ధి కార్యక్రమాల జోరు పెంచేందుకు ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నారు. మరోవైపు పార్టీని పటిష్ఠం చేసే బాధ్యతలతోనూ తలమునకలు కానున్నారు. ముఖ్యంగా కొత్త సంవత్సరంలో జనవరి నెలంతా కెసిఆర్ బిజిబిజీగా గడపనున్నారు. జనవరి మూడవ తేదీన టిఆర్‌ఎస్‌ఎల్‌పి సమావేశం నిర్వహిస్తారు. తెలంగాణ భవన్‌లో జరిగే ఈ సమావేశంలో పార్టీపరంగా, ప్రభుత్వపరంగా చేపట్టే కార్యక్రమాల గురించి వివరిస్తారు. తెలంగాణ ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న ఆశలను నెరవేర్చే విధంగా ప్రజాప్రతినిధులు ఏ విధంగా పని చేయాలో వివరిస్తారు. అదేవిధంగా ప్రభుత్వం ఇప్పటివరకు సాధించిన దాన్ని శాసన సభ్యులకు వివరించడంతోపాటు చేసిన పనులు జనంలోకి తీసుకు వెళ్లాలని శాసన సభ్యులకు సూచిస్తారు. జిల్లాల్లో విస్తృతంగా పర్యటించాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి జనవరి నుంచి అమలు చేయనున్నారు. నూతన సంవత్సరం తెలంగాణకు శుభసూచకంగా ఉండాలని కోరుకుంటూ యాదాద్రి వెళతారు. రెండవ తేదీన క్యాబినెట్ సమావేశం నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మూడవ తేదీన తెలంగాణ భవన్‌లో టిఆర్‌ఎస్‌ఎల్‌పి సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి పార్లమెంటు సభ్యులను కూడా ఆహ్వానించారు. ప్రభుత్వ పథకాల అమలుతోపాటు గ్రేటర్ ఎన్నికలపై సమావేశంలో చర్చిస్తారు. నాలుగు, ఐదు తేదీల్లో వరంగల్ జిల్లాలో పర్యటిస్తారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో కలిసి ఏటూరు నాగారం బ్రిడ్జిని ప్రారంభిస్తారు.
వరంగల్ జిల్లా భూపాలపల్లిలోని కాకతీయ థర్మల్ ఉత్పత్తి ఉత్పత్తి కేంద్రం స్టేజ్ 2 కింద నెలకొల్పిన 600 మెగావాట్ల యూనిట్‌ను జనవరి ఐదవ తేదీన ఉదయం 11 గంటలకు జాతికి అంకితం చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం వరంగల్ కలెక్టరేట్‌లో జిల్లా అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. టెక్స్‌టైల్ పార్క్ నిర్మాణం, మిషన్ భగీరథ, వరంగల్ నగరాభివృద్ధి, కాకతీయ కాలువల మరమ్మత్తులు, మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లు తదితర అంశాలపై సమీక్షిస్తారు.ముఖ్యమంత్రి వరుసగా జిల్లాల్లో పర్యటించనున్నారు. ఒక్కో జిల్లాలో వారం రోజుల పాటు మకాం వేసి అభివృద్ధి పనులను వేగవంతం చేయనున్నట్టు ముఖ్యమంత్రి గతంలో ప్రకటించారు. వరంగల్ జిల్లాలో రెండు రోజుల పాటు మకాం చేయనున్నారు. ఆ తరువాత అన్ని జిల్లాల్లోనూ ఇదే విధంగా పర్యటించనున్నారు.
కొత్త రాష్ట్రం మొదటి ఆరునెలలు కనీసం అధికారులు సిబ్బంది కేటాయింపులు కూడా లేకుండా గడిచిపోయింది. తొలి ఆరునెలలు అన్ని ప్రభుత్వ శాఖలపై సమగ్రమైన అవగాహన కలిగించుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చిన ముఖ్యమంత్రి ఆ తరువాత శాఖల వారిగా చేపట్టదలిచిన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రణాళికలు రూపొందించారు. ఇప్పుడు పనులను వేగవంతం చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వరుసగా రానున్నాయి. వీటితో పాటు ముఖ్యమంత్రి జిల్లాల్లో విస్తృతంగా పర్యటించాలని నిర్ణయించారు. ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్ ఒక కొలిక్కి రావడంతో ఏ జిల్లాలో ఏ ప్రాజెక్టుల నిర్మాణం ఏ విధంగా ఉండాలో స్పష్టత వచ్చింది. జిల్లాల పర్యటనలో వీటి గురించి ముఖ్యమంత్రి వివరిస్తారు. మరోవైపు పార్టీపరంగా ఇప్పటివరకు పెద్దగా కార్యక్రమాలు చేపట్టలేదు. తొలుత ప్రభుత్వంపై పట్టు సాధించేందుకు అధికారిక కార్యక్రమాలపైనే దృష్టిసారించిన ముఖ్యమంత్రి ఇప్పుడు కార్యక్రమాలు దారిలో పడడంతో పార్టీపై కూడా దృష్టిసారించారు. మూడవ తేదీన జరిగే సమావేశంలో పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలను వివరిస్తారు.