5న ఓ స్ర్తి రేపు రా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూతన నటీనటులతో రీడింగ్ లాంప్ క్రియేషన్స్ పతాకంపై అశోక్‌రెడ్డి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘ఓ స్ర్తి రేపురా’ (కల్పితమా.. ఖచ్చితమా). ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఫిబ్రవరి 5న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా అశోక్‌రెడ్డి మాట్లాడుతూ, ఒకప్పుడు ఊళ్లో దెయ్యం తిరుగుతుందని, ఇంటి గోడలపై ‘ఓ స్ర్తి రేపురా’ అని రాసేవారు. కొన్నిచోట్ల అయితే, భయంతో చాలామంది వారు వుంటున్న గ్రామాలను విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఇదే అంశంతో హారర్ థ్రిల్లర్‌గా, డిఫరెంట్‌గా ఈ చిత్రాన్ని రూపొందించామని, సంగీతం ఈ చిత్రానికి హైలెట్‌గా వుంటుందని తెలిపారు. ఇటీవల విడుదల చేసిన ప్రమోషనల్ పాటకు మంచి ఆదరణ లభించిందని, రీరికార్డింగ్ పూర్తిచేసి సినిమాను ఫిబ్రవరి 5న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఆశీష్ గాంధీ, వంశీకృష్ణ కొండూరి, కునాల్ కౌశిక్, దీక్షాపంత్, శృతిమోల్, మనాలీ రాధోడ్ ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రంలో వైవా హర్ష, స్వప్నిక, షాన్, వీరబాబు, శ్యాంసుందర్, సోనాల్ ఝాన్సీ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీతం:జి.వి. ఎడిటింగ్:రామాంజనేయరెడ్డి, కెమెరా:సిద్ధం మనోహర్, దేవర హరినాధ్, పాటలు:సుభాష్ నారాయణ, మాటలు:పవన్ రాచేపల్లి, కథ, నిర్మాత, దర్శకత్వం:అశోక్‌రెడ్డి.