రాష్ట్రీయం

గజానికి రూ.60 వేల పరిహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుల్తాన్‌బజార్ వ్యాపారులకు..
మెట్రో రైలు అధికారుల నిర్ణయం

హైదరాబాద్, డిసెంబర్ 24: నిత్యం ట్రాఫిక్ సమస్యతో సతమతమయ్యే నగరవాసులు చిరకాల స్వప్నమైన మెట్రోరైలు కల ఫలించే దిశగా ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు కేవరం కారిడార్ 1,3 వరకే వేగంగా జరిగిన పనులు ఇపుడు కారిడార్ 2లోని సుల్తాన్‌బజార్‌లో సైతం ఊపందుకున్నాయి. ఇక్కడి స్థల, ఇంటి యజమానులను ఒప్పించేందుకు మెట్రోరైలు అధికారులు ఇతర ప్రాంతాల కన్నా కాస్త మెరుగైన, స్పెషల్ నష్టపరిహారాన్ని ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. కారిడార్ 1, 3ల్లోని హబ్సిగూడ, తార్నాక, సికిందరాబాద్, బేగంపేట ప్రాంతాలతో పాటు కూకట్‌పల్లి, జెఎన్‌టియు, మూసాపేట, ఎర్రగడ్డ, సనత్‌నగర్, అమీర్‌పేట, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో ఇప్పటి వరకు సేకరించిన భూములకు మార్కెట్ విలువ ప్రకారం సుమారు రూ. 40వేల నుంచి రూ. 45 వేల వరకు ఒక్కో గజానికి నష్టపరిహారాన్ని చెల్లించారు.
కానీ సుల్తాన్‌బజార్ స్థల యజమానులకు కాస్త ఎక్కువగా నష్టపరిహారాన్ని చెల్లించేందుకు సిద్ధమయ్యారు. సుల్తాన్‌బజార్ చారిత్రక మార్కెట్ కావటంతో తొలుత అలైన్‌మెంట్ మార్పుకు సంబంధించి డిమాండ్లు విన్పించినా, తొలుత ప్రతిపాదించిన అలైన్‌మెంట్ ప్రకారమే పనులు జరుగుతాయని సర్కారు స్పష్టం చేయటంతో ఈ ప్రాంతంలో అధికారులు స్థల సేకరణ ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. ఇందులో భాగంగానే కోఠి ఉస్మానియా మెడికల్ కాలేజీ ముందున్న పెట్రోల్ బంక్‌వెనుక మెట్రో అధికారులు సుల్తాన్‌బజార్ వ్యాపారస్తులకు ప్రత్యామ్నాయ పునరావాసం కల్పించేందుకు నిర్మించిన జి ప్లస్ నాలుగు అంతస్తుల భవనం పార్కింగ్ స్థలం కోసం సుమారు 1370 గజాల పెట్రోల్ బంక్ స్థలాన్ని రెండురోజుల క్రితం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు గాను రూ. 15.22 కోట్లను నష్టపరిహారంగా చెల్లించారు. సుల్తాన్‌బజార్, కోఠి ప్రాంతాల్లో అనుకూలంగా ప్రాంతాల్లో హకర్స్ ప్యారడైజ్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.
తక్కువ సేకరణ..ఎక్కువ పరిహారం
మెట్రో పనుల కారణంగా సుల్తాన్‌బజార్‌లోని చారిత్రక కట్టడాలకు ముప్పు ఏర్పడకుండా స్థల సేకరణ చేపట్టేందుకు అధికారులు ఆచితూచి వ్యవహారిస్తున్నారు. మిగిలిన కారిడార్లలో చేసిన స్థల సేకరణ ప్రకారం రోడ్డుకిరువైపులా సుమారు 80 నుంచి వంద అడుగుల వరకు స్థలాన్ని సేకరించారు. కానీ సుల్తాన్‌బజార్‌లో వీలైనంత తక్కువ, మెట్రోకారిడార్, స్టేషన్ల నిర్మాణానికి సరిపోయేటంటే స్థలాన్ని సేకరించాలని, ఒక్కో గజానికి సుమారు రూ. 60 వేల నుంచి రూ. 62 వేల మధ్య నష్టపరిహారాన్ని సేకరించాలని భావిస్తున్నారు.
వంద మంది వ్యాపారులకు పునరావాసం సిద్ధం
ఒకవైపు స్థల సేకరణ చేపడుతూనే అధికారులు మరోవైపు ఇక్కడి వ్యాపారులకు ప్రత్యామ్నాయ పునరావాసాన్ని కల్పించే అంశంపై దృష్టి సారించారు. కోఠి ఉస్మానియా మెడికల్ కాలేజీ ముందు మొత్తం 2వేల చదరపు గజాల విస్తీర్ణంలో 70వేల చదరపు అడుగల ఏరియాతో నిర్మించిన భవనంలో మెట్రో స్టేషన్‌తో పాటు స్థానిక వ్యాపారులకు ఇందులో దుకాణాలను కేటాయించేందుకు సిద్ధమయ్యారు. రెండు సెల్లార్లు, గ్రౌండ్ ఫ్లోర్, పై నాలుగు అంతస్తుల్లో వంద మంది వ్యాపారులకు పునరావాసం కల్పించనున్నట్టు చెప్పారు. ఈ భవనాన్ని అరుదైన డిజైనింగ్‌లో నిర్మించారు.