రాష్ట్రీయం

ఎబివిపికి కేంద్రం అండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 21: సెంట్రల్ యూనివర్సిటీ ఎబివిపికి అడ్డాగా మారిందని ఎఐసిసి నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంత రావు విమర్శించారు. దేశంలోని అన్ని వర్సిటీల్లో ఎబివిపిని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని ఆయన ఆరోపించారు. సెంట్రల్ వర్సిటీలో దళిత విద్యార్థులు చేస్తున్న దీక్షా శిబిరానికి ఎబివిపి తప్ప అన్ని విద్యార్థి సంఘాలు వెళ్లి మద్దతు ప్రకటించాయని ఆయన గురువారం విలేఖరుల సమావేశంలో చెప్పారు. యూనివర్సిటీ పాలనలో అక్రమాలు జరుగుతున్నాయని, విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తాను గతంలోనే రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నించానని, అంతేకాకుండా 2014 నవంబర్ 17న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాశానని ఆయన చెప్పారు. దానిపై స్పందించని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గత ఏడాది కేంద్ర మంత్రి దత్తాత్రేయ రాసిన లేఖపై స్పందించారని అన్నారు. తన లేఖపై ఎందుకు స్పందించలేదని ఆయన మంత్రి ఇరానీని ప్రశ్నించారు. తాను ఐదారు లేఖలు వర్సిటీ విసికి రాశానని ఆమె చెప్పడాన్ని విహెచ్ ప్రస్తావిస్తూ విసి అప్పారావు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. విసి అప్పారావు ధీమా ఏమిటని విహెచ్ ప్రశ్నించారు.
స్పందించే తీరిక లేదా?
హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో దళిత విద్యార్థి రోహిత్ ఆత్మహత్య చేసుకున్న వ్యవహారంపై దేశ వ్యాప్తంగా అలజడులు జరుగుతుంటే తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఏమాత్రం పట్టించుకోవడం లేదని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. కెసిఆర్‌కు ఖాదీ భండార్‌కు వెళ్ళి వంద జతల బట్టలు ఖరీదు చేసేందుకు గంటల తరబడి తీరిక ఉంది కానీ దళిత విద్యార్థుల బహిష్కరణ గురించి చర్చించే తీరిక లేదని ఆయన గురువారం విలేఖరుల సమావేశంలో విమర్శించారు. మిషన్ భగీరథ పనులపై ఉన్నత స్థాయి ఇంజినీర్లతో పనుల పరిశీలన, టెండర్ల పరిశీలన జరపాలని అప్పటి వరకు పనులు జరపవద్దని ఆయన డిమాండ్ చేశారు.