రాష్ట్రీయం

ఆధునిక బాట పట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఫిబ్రవరి 15: జాలర్లు ఆధునికతను సంతరించుకుని అభివృద్ధి బాటలో పయనించాలని అఖిల భారత క్షత్రియ సంఘం అధ్యక్షుడు డా. గజేంద్ర భాన్జీ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సోమవారం పర్యటించిన జాలర్ల కుటుంబాలను కలిశారు. తుళ్లూరు మండలం రాయపూడి గ్రామంలో జాలర్లతో సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వం 200 కోట్ల నిధులను జాలర్ల అభివృద్ధికి కేటాయించిందని తెలిపారు. అందువల్ల జాలర్లు పాత పద్ధతులను విడనాడి నూతన హంగులను సమకూర్చుకోవాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ఆదాయ మార్గాలను మెరుగుపర్చుకోవాలన్నారు. జాలర్ల అభివృద్ధికి ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాయన్నారు. జాలర్లు చైతన్యవంతులై ప్రభుత్వ వనరులను సమకూర్చుకుని ముందుకెళ్లాలన్నారు. ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలపై అవగాహన పెంచుకుని ఆర్ధికాభివృద్ధి సాధించాలని ఆయన ఆకాంక్షించారు.