రాష్ట్రీయం

అగ్రిగోల్డ్‌పై నేడు నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఫిబ్రవరి 15: అగ్రిగోల్డ్ ఛైర్మన్, ఎండిలను అరెస్టుచేసి ఏలూరులోని జిల్లా జైలుకు తరలించటం, వారు బెయిల్ కోసం, సిఐడి పోలీసులు వారి కస్టడీ కోసం న్యాయస్ధానంలో పిటిషన్లు దాఖలు చేయటం తెల్సిందే. సోమవారం మధ్యాహ్నం వీటికి సంబంధించి వాదనలు జరిగాయి. అయితే నిర్ణయాన్ని మంగళవారం ఉదయం వెలువరిస్తామని జిల్లా ఇన్‌ఛార్జి న్యాయమూర్తి ఎ హరిహరనాథశర్మ వాయిదావేశారు.
అయితే వాదనల సందర్భంగా పలు అంశాలు ప్రస్తావనకు రావటం, అంతేకాకుండా ఇప్పటికే ఈ కేసు హైకోర్టులో విచారణలో ఉండటం, వివిధ పోలీసుస్టేషన్లలో కేసులు నమోదు కావటం వంటి కారణాల నేపథ్యంలో ఈవిషయంలో పూర్తిస్థాయిలో పరిశీలన అనంతరమే బెయిల్, కస్టడీ అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే వాదనల సమయంలో అగ్రిగోల్డ్ యాజమాన్యం ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించిందా, లేక ప్లాట్‌ల కోసం నగదు సేకరించిందా అన్న విషయంలో స్పష్టత కావాలని న్యాయమూర్తి అడగటంతో ఈవిషయంలోనూ మరికొంతసేపు వాదనలు జరిగాయి. వాదనలు ముగిసిన అనంతరం నిర్ణయాన్ని మంగళవారం వెలువరించాలని నిర్ణయించారు. ఇదిఇలాఉండగా అగ్రిగోల్డ్ బాధితుల సంఘం జాయింట్ యాక్షన్ సమావేశం సోమవారం వి యేషయ్య అధ్యక్షతన ఏలూరులో జరిగింది. ఈసందర్భంగా ఫిబ్రవరి నెలలో ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తికి బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ పోస్టుకార్డులు రాయాలని తీర్మానించారు. 22న కలెక్టరేట్ వద్ద ధర్నా చేయాలని నిర్ణయించారు. అలాగే ఆ రోజు కార్యక్రమానికి వివిధ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు, కులసంఘాల పెద్దలను ఆహ్వానించాలని నిర్ణయించారు.