క్రీడాభూమి

ఆస్ట్రేలియా చేతిలో న్యూజిలాండ్ చిత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్లింగ్టన్, ఫిబ్రవరి 15: ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 52 పరుగుల భారీ తేడాతో చిత్తయింది. ఆస్ట్రేలియాకు రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌పై 1-0 ఆధిక్యం లభించింది. డబుల్ సెంచరీ సాధించిన ఆడం వోగ్స్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 183 పరుగులకే ఆలౌటైంది. అనంతరం ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 562 పరుగుల భారీ స్కోరును సాధించిన 379 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. ఇన్నింగ్స్ ఓటమి వెంటాడుతున్న నేపథ్యంలో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన కివీస్ మూడో రోజు, ఆదివారం ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. అప్పటికి ఇంకా 201 పరుగులు వెనుకంజలో ఉన్న న్యూజిలాండ్ చేతిలో ఆరు వికెట్లు ఉన్నాయి. మ్యాచ్ నాలుగో రోజు, సోమవారం ఉదయం ఆటను కొనసాగించిన న్యూజిలాండ్ 327 పరుగులకు ఆలౌటైంది. టామ్ లాథమ్ (63), నికోలస్ (59) అర్ధ శతకాలు చేసినా ఫలితం లేకపోయింది. చివరిలో టిమ్ సౌథీ (48), మార్క్ క్రెగ్ (33 నాటౌట్) కొంత సేపు ఆస్ట్రేలియా బౌలింగ్‌ను అడ్డుకునేందుకు కొద్దిసేపు పోరాటం సాగించారు. కానీ, టాప్ ఆర్డర్ వైఫల్యం కారణంగా కివీస్‌కు ఓటమి తప్పలేదు. నాథన్ లియాన్ 91 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టగా, మిచెల్ మార్ష్‌కు మూడు వికెట్లు లభించాయి.