రంగారెడ్డి

ఆంగ్లభాషలో ప్రావీణ్యం సాధించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 15: అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పెనుమార్పుల దృష్ట్యా ఆంగ్ల భాషలో ప్రావీణ్యం పొందాలని, దీనికోసం చిన్నతనం నుంచే విద్యార్థులు ఆంగ్ల భాషను అలవర్చుకోవాలని సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. స్థానిక గురుకుల ఆశ్రమ పాఠశాలలో రాష్టవ్య్రాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలల్లో సాంఘిక శాస్త్రం, ఆంగ్లం విద్యాబోధకులకు శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు. గురుకుల పాఠశాలలో జ్యోతీరావు పూలే, సావిత్రిబాయి, అంబేద్కర్ విగ్రహాలను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థులు ఆంగ్ల బాషకున్న ప్రాథాన్యతను దృష్టిలో పెట్టుకొని దానిని పూర్తి స్థాయిలో అలవర్చుకోవాలని అన్నారు. 5, 6తరగతుల విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో బోధన నిమిత్తం ఉపాధ్యాయులకు సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. సాంఘిక సంక్షేమ గురుకులంలో రాష్టవ్య్రాప్తంగా ఉన్న 104 పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు హాజరయ్యారని, మంగళవారం శిక్షణ శిబిరంలో మరో 84 పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొంటారని పేర్కొన్నారు. వారికి పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చి విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన నిర్వహించే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ గురుకులాల డిప్యూటీ కార్యదర్శి లక్ష్మయ్య, జిల్లా సమన్వయకర్త గీతాలక్ష్మి, ఆర్‌కెపురం, నల్లకంచె, హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం గురుకులాల ప్రధాన ఉపాధ్యాయులు వెంకటమ్మ, జయంతి, అంజయ్య, నర్సింహా, స్వేరోస్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాజు, పది జిల్లాకు చెందిన గురుకులాల సాంఘికశాస్త్రం, ఆంగ్ల విద్యాబోధకులు పాల్గొన్నారు.