అక్షర

అనుభూతి సాంద్రత గల కవిత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొన్ని తీగలు
కొన్ని రాగాలు
(కవితా సంపుటి)
కవయిత్రి: ఎన్.అరుణ
వెల: రు.100
ప్రతులకు:
ప్రసిద్ధమైన పుస్తకశాలలు

‘‘దారం చేతిలో ఉన్నంత మాత్రాన
పతంగి
నువ్వనుకుంటున్నట్టు
ఎగురుతుందనుకోవడం భ్రమ’’
ఇటువంటి తాత్త్విక అనుభూతుల కలయిక ‘కొన్ని తీగలు కొన్ని రాగాలు’. ఎన్.అరుణ ఎనిమిదవ కవితా సంపుటి ఇది. ‘వౌనమూ మాట్లాడుతుంది’ మొదటి కవితా సంపుటినుంచి ఇప్పటివరకు కవిత్వ శక్తిని ఇనుమడింపచేస్తునే రాయడం విశేషం. కవితా సంపుటికి శీర్షిక పెట్టడం మామూలు అంశం కాదు. ఎంతో ఔచిత్యంగా ఉండాలి. కొన్ని తీగలు అనుభూతికి చెందితే, కొన్ని రాగాలు తాత్వికతకి చెందుతాయి. ఆమె కవిత్వంలో కొత్త ఆలోచనలు, సరికొత్త ప్రతిపాదనలు ఉంటాయి.
‘‘వయసు శరీరానికే
మనసుకు కాదంటారు
ఎంత అందమైన అబద్ధం’’
-అంటూ కవితను ప్రారంభించడం ఒక శిల్పం. పాఠకుడ్ని అస్థిమిత పరిచి ఏంటో చూద్దాం అనిపిస్తుంది. అందరూ చెప్పే అంశాన్ని విభిన్నంగా ఆలోచించడమే తాత్త్వికత. మరో ఉదాహరణ-
‘‘ఇదివరకు
గమ్యం నా చేతిలో ఉండేది
ఇప్పుడది నన్ను పరిహసిస్తోంది
వెనుకపడ్డప్పుడు తెలుస్తుంది
నడక విలువేమిటో’’
ఇది జీవనసత్యం. దేనికైనా వర్తిస్తుంది. అంతా సజావుగా ఉన్నప్పుడు, వృద్ధులు ఉన్నప్పుడు విలువలు తెలుసుకోలేం! ఇదీ తాత్వికత!
ఒక భావాన్ని సాదాసీదాగా కాకుండా విశిష్టంగా, గాఢంగా చెప్తే దానిని అభివ్యక్తి శిల్పం అంటాం. ఈ గుణం చాలా కవితల్లో కనిపిస్తుంది. మచ్చుకి-
‘‘దోసిలినిండా అక్షరాలతో
కాగితం ముందు మోకరిల్లాను
అక్షరాలు
ఈ క్షణాల దారంతో
ఏ కవితను అల్లుకుంటాయో తెలియదు’’-
ఇది కవిత్వ రచన గురించిన సూక్తిగా అనిపిస్తుంది.
‘వీధులు చచ్చిపోతాయి గానీ
జ్ఞాపకాలకు మరణం ఉండదు’
అంటారు అరుణ. నిజమే-మనిషి జ్ఞాపకాలతోనే ఆనందాన్ని అనుభవిస్తాడు. చీమ, గడప, కాలింగ్‌బెల్...ఇలా వస్తు నవ్యతను గమనిస్తాం. కొన్ని కవితలు వ్యక్తిత్వ వికాసాన్ని బోధిస్తాయి. మానసిక చైతన్యానికి, నూతన అనుభూతులకి చదవవలసిన కవితా సంపుటి ఇది.

-ద్వా.నా.శాస్ర్తీ