ఉత్తరాయణం

అర్థంకాని నేటి అర్థశాస్త్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాస్త కష్టపడితే కౌటిల్యుడి అర్థశాస్త్రం అర్థం చేసుకోవచ్చునేమో కాని మన ఆధునిక ప్రజాస్వామ్యపు అర్థశాస్త్రం మాత్రం సామాన్యుడికి అర్థమయ్యే పరిస్థితి ఏమాత్రం లేదు. ప్రజలే కేంద్రంగా, వారి సంక్షేమమే లక్ష్యంగా ఆర్థిక విధానాలు ఉంటాయని భావిస్తాం. ప్రజలెన్నుకున్న ప్రభుత్వమైనా, దాని శాఖలైనా పదేపదే అదే భరోసాని మాటల్లో ఇస్తాయ. వాస్తవాలు మాత్రం భిన్నంగా ఉండి గందరగోళ పరుస్తుంటాయ. ఉదాహరణకి బ్యాంకు వ్యవహారాలు చూద్దాం. అప్పులెగ్గొట్టిన కొద్దిమంది ఘరానా పెద్దల నుండి రావాల్సిన మొండి బకాయలను బ్యాంకులే దయతలచి మాఫీ చేస్తుంటాయ. ఈ రెండు సంవత్సరాల్లో ఆ మొత్తం లక్షా పదిహేను వేల కోట్ల రూపాయలట. వాటిలో ఐదువందల కోట్ల రూపా యలు పైబడి ఎగ్గొట్టిన వారి వివరాలు చెప్పమని సుప్రీంకోర్టు ఆదేశిం చింది. అలా ఆదేశిస్తే గానీ వారి పేర్లు కూడా బయటపెట్టని బ్యాంకులు, వెయ్యరూపాయలు కట్టలేని రైతుల పట్ల ఎలా విరుచుకుపడతాయో, జప్తు లంటూ అవమానిస్తాయో అందరికీ తెలిసిన సత్యమే. ఒకవైపు ఈ నిర్వాకమైతే రెండోవైపు బ్యాంకులు, ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యంగా ఉండడానికి చిన్న మొత్తాల పొదుపులపై వడ్డీకోత. కోట్లాది మంది సామాన్యులు దాచుకున్న సొమ్ముపై ఇంతవరకూ ఇస్తున్న కొద్దిపాటి వడ్డీ కూడా ఇవ్వలేమని ఆక్రోశం. ఇక మన జీడీపీ రెండంకెల్లో రంకెలు వేస్తుందని ప్రకటన. అభివృద్ధి సాధిస్తున్నామని సంతసించే లోగా మరో ప్రకటన- ‘అత్యవసర మందులు, కేన్సర్ మందులపై రాయతీలు తొలగించడం వల్ల ధరలు పెంపు’. ఉపాధి పథకాలకీ, సంక్షేమ పథకాలకీ, ఆరోగ్యానికీ, విద్యకీ నిధుల కోత. అంటే అంకెల్లో కనబడుతున్న అభివృద్ధి అతి తక్కువ మందికే లబ్ది చేకూర్చి, అశేష ప్రజానీకానికి మాత్రం అన్యాయం చేస్తోంది. ప్రభుత్వం కూడ అందుకు అనుగుణంగానే నడుస్తోంది. న్యాయస్థానాలు ఆదేశించినప్పుడే కుంభకోణాలపైనా, అవకతవకలపైనా, నల్లధనంపైనా, అంతో ఇంతో హడావిడి. ఆపై అంతా షరా మామూలే. ఈ అర్థశాస్త్రం ఆను పానులు ఎవరైనా వివరిస్తే బాగుండును.
- డా.జి.వి.జి. శంకరరావు, పార్వతీపురం
కరవుభత్యం విడుదల చేయాలి
జూలై, 2015లో మంజూరు కావాల్సిన కరవు భత్యాన్ని తెలంగాణ భ్రుత్వం దసరా, దీపావళి పర్వదినాల్లో ప్రకటిస్తుందని ఉద్యోగులు, పిం ఛనుదార్లు ఎంతగానో ఎదురు చూశారు. సంక్రాంతికైనా ప్రకటన వస్తుందన్న ఆశ తీరలేదు. ఇకనైనా ప్రభుత్వం సత్వరమే కరువుభత్యాన్ని ప్రకటించి, ఈ నెల జీతాల్లో, పెన్షన్‌తో కలిపి ఇవ్వాలి. కరవు భత్యంతో పాటు వేతన బకాయల విడుదల విషయంలోనూ ప్రభుత్వం సానుకూల ప్రకటన చేయాలి.
- చామర్తి వెంకట రామకృష్ణ, హైదరాబాద్
ఏది దేశ ద్రోహం?
అఫ్జల్‌గురుపై కేసు విచారణ జరిపి, సుప్రీకోర్టు వారు మరణశిక్ష విధించారు. అతను ఉరితీయబడ్డాడు. కాంగ్రెస్ అయతే సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరించి, అఫ్జల్ గురును వదిలిపెట్టేదా? ఒకవేళ పశ్చిమ బెంగాల్‌లో తాము అధికారంలో ఉండి ఉంటే వామపక్షాలు వదలివేసేవా? నిజంగా అతగాడు పార్లమెంటును పేల్చివేసి ఉన్నా కాంగ్రెస్, వామపక్షాలు ఇట్లాగే ప్రవర్తించేవా? ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని నడవనివ్వక పోవడం పెద్ద దేశ ద్రోహం.
- కాశీ అన్నపూర్ణ , హైదరాబాద్