రాష్ట్రీయం

అమరావతిలో అమృత వర్శిటీ క్యాంపస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 19: భారతదేశంలో ఉత్తమ పరిశోధనా విశ్వవిద్యాలయంగా పేరొందిన అమృత యూనివర్శిటీ తన క్యాంపస్‌ను అమరావతిలో ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. మూడు దక్షిణాది రాష్ట్రాల్లో ఐదు క్యాంపస్‌లను కలిగి ఉన్న అమృత విశ్వవిద్యాలయం దాదాపు 2500 కోట్ల వ్యయంతో ఈ క్యాంపస్ ఏర్పాటు చేయనుంది. దీంతో పాటు ఒక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని కూడా ఏర్పాటు చేస్తారు. 2250 పడకలతో మెగా ఆస్పత్రిగా ఇది పనిచేయనుంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నెలకోల్పే వైద్య విశ్వవిద్యాలయానికి అనుబంధంగా రీసెర్చి హెల్త్ కేర్ క్యాంపస్‌ను కూడా ఏర్పాటు చేస్తారు. ఈ మేరకు వర్శిటీ ప్రతినిధులు ప్రమభుత్వానికి మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిపై నివేదికను అందజేశారు. అమరావతిలో అమృత యూనివర్శిటీని ఏర్పాటు చేయాలని సిఎం చంద్రబాబునాయుడు చేసిన విజ్ఞప్తిపై మాతా అమృతానందమయి దేవి సానుకూలంగా నిర్ణయం తీసుకున్నారని వర్శిటీ ప్రతినిధులు చెప్పారు. నవ నగరాల కూర్పుగా ఏర్పాటవుతున్న అమరావతిలో ఇప్పటికే ప్రఖ్యాత విద్యాసంస్థలు తమ క్యాంపస్‌లు ఏర్పాటుకు ముందుకు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో బ్రిటన్‌కు చెందిన ఒక సంస్థ మెడికల్ సిటీ ఏర్పాటు చేయబోతోంది. మరో పక్క కేంద్ర ప్రభుత్వం ఎయిమ్స్‌ను నిర్మించబోతోంది. ఈ క్రమంలో అమరావతి చుట్టుపక్కలే దాదాపు 13, 14 ప్రఖ్యాత సంస్థలు ఏర్పాటు కాబోతున్నాయి. ఇప్పటికే అమృత వర్శిటీ కేరళ, కర్నాటకల్లో తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేసింది. అమెరికాలోని ఐవి యూనివర్శిటీ, మరికొన్ని ప్రఖ్యాత యురోపియన్ విశ్వవిద్యాలయాలతో స్టూడెంట్ ఎక్చ్సేంజి ప్రోగ్రాంలను నడుపుతున్న అమృత వర్శిటీ ఉన్నత విద్యారంగంలో నూతన ప్రమాణాలను నెలకోల్పింది.