జాతీయ వార్తలు

అరుణాచల్ కొత్త సిఎంగా కలిఖో ప్రమాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌహతి, ఫిబ్రవరి 19: అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ అసమ్మతి నాయకుడు కలిఖోపుల్ శుక్రవారం పదవీ స్వీకార ప్రమాణం చేశారు. గవర్నర్ రాజ్‌ఖోవా ఆయన చేత ప్రమాణం చేయించారు. పదకొండుమంది బిజెపి ఎమ్మెల్యేల వెలుపలి మద్దతుతో కలిఖో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తారు. ఆయనకు మరో ఇద్దరు ఇండిపెండెంట్ల మద్దతు కూడా ఉంది. వీరందరూ కూడా కొత్త ప్రభుత్వంలో చేరే అవకాశం కనిపిస్తోంది. ఇలావుండగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఖలికో ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్లీ రద్దుకు సిఫార్సు చేసే అవకాశం కనిపిస్తోంది. 47 సంవత్సరాల ఖలికో గతంలో ఆర్థిక మంత్రిగా, ఆరోగ్య మంత్రిగా పనిచేశారు.